Hardik pandya – bumrah: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) పరిస్థితి రోజు రోజుకు దిగజారి పోతోంది. గత సీజన్ తరహాలోనే ఈ సారి కూడా చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్ లు ఆడితే 4 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. దీనికి తోడు హార్థిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Mumbai Indians vs Punjab Kings) మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో బుమ్రాను కించపరుస్తూ హార్దిక్ పాండ్యా ( Hardik pandya) వ్యవహరించాడు. అంతేకాదు వికెట్లు తీయడం లేదని బుమ్రాపై నిప్పులు చెరిగాడు హార్ధిక్ పాండ్యా. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ముంబై కెప్టెన్ పాండ్యాపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అటు రోహిత్ శర్మ కూడా సీరియస్ అయినట్లు సమాచారం అందుతోంది.
Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖరీదైనవా ? ఆ డబ్బులతో 4 SUV కార్లు కొనచ్చు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో బుమ్రా మరోసారి విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా 41 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, నిన్న బుమ్రా బౌలింగ్ చేస్తున్న క్రమంలో.. అతనికి అనుకూలంగా ఫీల్డింగ్ సెట్ చేయకుండా ఓవరాక్షన్ చేశాడు హార్దిక్ పాండ్యా. బౌలర్ బుమ్రాకు నచ్చిన విధంగా ఫీల్డింగ్ చేసే అవకాశం ఇవ్వకుండా తనకు నచ్చినట్లుగా ఫీల్డర్లను సెట్టింగ్ చేశాడు. బుమ్రా లాంటి తోపు బౌలర్ ను కూడా కించపరుస్తూ వ్యవహరించాడు. ఈ పరిస్థితులను గమనించిన బుమ్రా, హార్దిక్ పాండ్యా పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏదైనా చేసుకో… నాకేం సంబంధం లేదన్నట్టుగా బుమ్రా సైగలు చేశాడు. అంతేకాదు వికెట్లు ఎక్కువగా తీయడం లేదని బుమ్రాపై సీరియస్ కూడా అయ్యాడట హార్దిక్ పాండ్యా. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య నిన్న కీలక ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో మొదట ముంబై బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 195 పరుగులు సాధించింది ముంబై ఇండియన్స్. డికాక్ సెంచరీ చేయగా నమన్ ధీర్ అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇక 195 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేదించేసింది పంజాబ్ కింగ్స్. మరోసారి సర్పంచ్ సాబ్ మెరిసి జట్టును గెలిపించాడు. ఈ విజయంతో పాయింట్లు పట్టికలో నెంబర్ వన్ స్థానానికి దూసుకు వెళ్ళింది పంజాబ్. దీంతో ఈసారైనా పంజాబ్ టైటిల్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: SRH జట్టులో చీలిక.. తెలంగాణ, ఏపీ ఫ్యాన్స్ మధ్య కొత్త పంచాయితీ..తలపట్టుకున్న కావ్య పాప
🚨 JASPRIT BUMRAH NOT HAPPY WITH HARDIK PANDYA’S CAPTAINCY 🚨
When Jasprit Bumrah bowling, Hardik Pandya was seen giving suggestions to him and setting the field according to himself, not according to Bumrah.
Jasprit Bumrah argued once but later surrendered to the captain and… pic.twitter.com/jy20zYi0sU
— AK 45 (@ImRo45_Club) April 16, 2026
i don’t recognise my team anymore… pic.twitter.com/nntva5lkQt
— Un-Lucky (@Luckyytweets) April 16, 2026