E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు పోలీస్ స్టేషన్ లో అవమానం.. అరుణ్ కు మైండ్ బ్లాక్.. మీనాకు ఝలక్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు పోలీస్ స్టేషన్ లో అవమానం.. అరుణ్ కు మైండ్ బ్లాక్.. మీనాకు ఝలక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 30th: సుందరి పెళ్లి పత్రికలు ప్రింటింగ్ ఇచ్చాము అని రంగా అలాగే కామాక్షి ఇద్దరు కలిసి సత్యం వాళ్ళ కుటుంబం కి చెప్పడానికి పండ్లు తీసుకొని వస్తారు.. రంగా కామాక్షి ఇద్దరు కూడా ఈ పెళ్లి జరగడానికి కారణం బాలు మీనా అని పొగడ్తల వర్షం కురిపిస్తాడు.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాలు మీనాలపై ప్రశంసలు కురిపిస్తారు.. ఇక పెళ్లికి మీ కుటుంబం ముందుండి అన్ని చేయాలి అని రంగా కోరగానే.. ఇక బాలు మీనా దగ్గరుండి పెళ్లికి అన్ని చేస్తామని అంటారు.. ఇక రెస్టారెంట్ కి సంబంధించి పనులు నువ్వు రవి చూసుకుంటాను అని అంటాడు.. మేకప్వేయడానికి రోహిణి కాస్త వెనకడుగు వేస్తుంది.. మొత్తానికి బాలు మీన ఇద్దరు కలిసి సుందరి పెళ్ళికి పెద్దలుగా మారుతారు..

మనోజ్ కు ఘోర అవమానం..

మన పోలీస్ స్టేషన్ కి వెళ్లి మళ్లీ తన నోటి దూలతో మాట్లాడుతూ ఉంటాడు.. అయితే కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి ఇక్కడ కూర్చుని ఉంటే అసలు పట్టించుకోవేంటి అని అంటాడు. ఏంటి నువ్వు బిజినెస్ మాన్ అయితే.. నాకు పని నువ్వు చేస్తే నీ పని నేను చేయాలా అని కానిస్టేబుల్ కూడా మనోజ్ కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తూ వెటకారంగా మాట్లాడుతాడు.. నువ్వు మొన్న చెప్పినట్టే ఈరోజు కూడా చెవిలో చెబుదామని వచ్చావా అని కానిస్టేబుల్ మనోజ్ ని దారుణంగా అవమానించాలా మాట్లాడుతాడు.. అయితే పోలీస్ స్టేషన్ లోని వాళ్ళందరూ కూడా ఆ రోజు చెవిలో చెప్పింది వీడియో కదా అని మనోజ్ ని అడుగుతాడు. ఇక మనోజ్ ఏమి మాట్లాడకుండా బయటికి వస్తున్నాడంట అక్కడ ఉన్న కానిస్టేబుల్ పిలిచి మరీ కొడతాడు.. మొత్తానికి పాపం మనోజ్ మరోసారి చెంప దెబ్బలతో బయటకు వచ్చేసాడు.

బాలు దెబ్బకు అరుణ్ సస్పెండ్..

Advertisement

ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ పోలీస్ స్టేషన్ కి రాగానే అందరూ కూడా ఎంత పని చేసావయ్యా నువ్వు అని అడుగుతారు.. అక్కడున్న కానిస్టేబుల్ అందరూ నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి? ఎందుకు ఇలాంటి పని చేశావు అని అడుగుతారు.. నువ్వు వస్తే ఎస్ఐ గారు వెయిట్ చేయమని చెప్పారు. నువ్వు ఇలా చేస్తావని ఎవ్వరూ అనుకోలేదు.. నువ్వు కాసేపు వెయిట్ చెయ్ ఎస్ఐ గారు నీతో మాట్లాడాలంట అని అక్కడున్న కానిస్టేబుల్ చెప్పగానే అరుణ్ నేనేం చేశాను బాలు గాడు ఏమైనా నామీద ప్లాన్ చేశాడా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు.. తర్వాత ఎస్సై ఎక్కడికొచ్చి నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని అనగానే అరుణ్ షాక్ అవుతాడు.. బాలు తీసిన వీడియోని చూపించి నువ్వే రూల్స్ పాటించకపోతే జనాలు ఎలా పాటిస్తారు అని అరుస్తాడు.. అంతేకాదు తనని సస్పెండ్ చేసినట్లు చెప్పడంతో అరుణ్ షాక్ అయ్యి బయటకు వెళ్ళిపోతాడు. ఆ బాలు నామీద రివేంజ్ తీర్చుకుంటున్నాడు. చెప్తా వాడిపని అని అంటుంది.

విద్య, మీనాను చూసి రోహిణి షాక్..

విద్య మీనా వెళ్లిపోతుంటే ఆపుతుంది.. మీనా నీకోసమే నేను కలవాలని వద్దామనుకున్నాను.. నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని విద్య అనడంతో ఏంటి దేని గురించి మాట్లాడాలి అని మీనా అడుగుతుంది.. ఆ అబ్బాయి ఫోన్ తీసుకున్నాను.. కానీ అందులో ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు అలాగే ఫోన్ నెంబర్లు ఫ్రెండ్స్ ఇవి మాత్రమే ఉన్నాయి.. తను మంచివాడనే నేను అప్పుడే కన్ఫామ్ చేయలేను కానీ ఇంకాస్త టైం తీసుకుని ఏదైనా చేయాలి అని అనుకుంటుంది.. అయితే తన ఇష్టాలు నీఇష్టలు తెలుసుకొని కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుంది అని మీనా సలహా ఇస్తుంది..నువ్వు నాకు ఏదో ఒక మంచి సలహా ఇస్తూనే ఉంటావు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని విద్య అంటుంది.. మీనా విద్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా రోహిణి చూసి వీళ్లిద్దరూ ఏదో నా గురించే మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటుంది.. ఇక మీనా వెళ్లదని రోహిణి మీరిద్దరు బాగా క్లోజ్ అయిపోయారు కదా అని కుళ్ళుకుంటుంది..

సుమతి, అరుణ్ పెళ్లి ఫిక్స్..?

Advertisement

ఇక సుమతి అరుణ్ వాళ్ళ ఇంటికి మందులు తీసుకుని వెళుతుంది.. అరుణ్ వాళ్ళ అమ్మ సుమతిని చూసి చాలా సంతోషంగా ఉంటుంది. అరుణ్ సస్పెండ్ అయిన విషయం చెప్పడంతో షాక్ అవుతారు.. రూల్స్ పాటించే మీరు సస్పెండ్ అవడం ఏంటి ఏం జరిగింది అని సుమతి అడుగుతుంది.. ఒకడు నామీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకున్నారు.. నన్ను కావాలని ఇరికించాడు మూడు రోజుల నన్ను సస్పెండ్ చేశారు అని అరుణ్ చెప్తాడు.. వాళ్ళ అమ్మ మాత్రం కాస్త టెన్షన్ పడుతుంది.. సుమతి మాత్రం మీకు మూడు రోజులు సెలవు దొరికింది కదా.. మీ అమ్మని బాగా చూసుకోండి అని సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

బాలుకు మీనా దిమ్మతిరిగే క్లాస్..

బాలు చాలా సంతోషంగా ఇంట్లోకి రావడం తీసిన మీనా ఏంటి మీరంతా సంతోషంగా ఉన్నారు ఏం చేశారు అని అడుగుతుంది.. ఈరోజు నేను సాధించేసాను.. నాకు చాలా సంతోషంగా ఉంది అని బాలు హడావిడి చేస్తాడు.. అది చూసిన మీనా ఏంటి ఏం చేశారు అంతగాని అడుగుతుంది.. అది విన్న మీనా మీరు తప్పు చేసారు.. అతను ఎవరి కోసమో ఎమర్జెన్సీగా వెళుతూ ఉంటే మీరు ఇలా చేయడం ఏమీ బాగోలేదు అని మీనా బాలు పై సీరియస్ అవుతుంది.. అతని పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు ఇలా చేయడం బాగోలేదు అని బాలుని తిడుతుంది మీనా.. మొత్తానికి బాలు మీనా క్లాస్ వల్ల రియలైజ్ అవుతాడు.. బాలు మీనా కి కారు డ్రైవింగ్ నేర్పిస్తాడు..

అయ్యో.. ప్రభావతికి ఎంత కష్టం..

ఇక డాన్స్ స్కూల్ కి పిల్లలందరూ వస్తారు. కానీ అందులో ఒక వ్యక్తి వెయిట్ మిషన్ తీసుకొని వస్తాడు. అందరూ జిమ్ లో కూడా వెయిట్ చూసుకుంటున్నారు.. మీరు ఇక్కడ కూడా వెయిట్ మిషన్ ని చెక్ చేసి ఎలా ఉండాలో చెప్పాలి అని అంటారు. ఇక అందరూ సరదాగా వెయిట్ ఎంత ఉంటానో అని చెక్ చేసుకుంటారు. కామాక్షి, చింతామణితో పాటుగా అక్కడున్న పిల్లలందరూ కూడా వెయిట్ ని చెక్ చేసుకుంటారు.. కానీ ప్రభావతి ఆ మిషన్ మీద ఎక్కగానే అది ఆగిపోతుంది దాంతో కామాక్షి వాళ్ళందరూ కూడా ప్రభావతిని ఆటపట్టిస్తారు. ఇక మొత్తానికి అక్కడ ఒక సరదా వాతావరణం క్రియేట్ అవుతుంది..అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : బృందావనంకు వెళ్లిన మహా.. చక్రికీ దిమ్మతిరిగే షాక్.. తాయర్ కు స్ట్రాంగ్ మహా వార్నింగ్..

Related News

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Intinti Ramayanam Pallavi : పల్లవికి ఏమైంది..? ఇది అసలు ఊహించలేదు..

Big Stories

Advertisement
×