E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న రేఖ  

Brahmamudi Serial Today Episode June 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న రేఖ  
Advertisement

Brahmamudi serial today Episode: తాము ఓడిపోయామని తెలియజేయడానికే తాను స్వీట్స్‌ పంచుతున్నానని శేషు చెప్తాడు. ఇక రేఖ పరిస్థతి భవిష్యత్తులో ఎలా ఉంటుందో నా ఇమేజ్‌లోకి వచ్చి మీరే చూడండి అంటాడు. ఇమాజినేషన్‌లో రేఖ, భ్రమరాంబ ఇల్లు తుడుస్తుంటే.. అపర్ణ, సుభాష్‌ కాలు మీద కాలేసుకుని కూర్చుని రేఖను కాఫీ అడుగుతుంది. రేఖ పరుగెత్తుకుంటూ వెళ్లి కాఫీ తీసుకొస్తుంది. అంతా ఇమాజిన్‌ చేసుకున్న రేఖ, భ్రమరాంబ ఉలిక్కి పడతారు. తాము ఊహించుకుంటేనే భయంగా ఉంది అంటారు. రేఖ కోపంగా శేషును తిడుతుంది. శేషు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భ్రమరాంబ కంగారుపడుతూ.. రాజును తిడుతుంది. మనం ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. ఆ రాజు గాడు అదే నిజం చేస్తే మన పరిస్థితి ఏంటని భయపడుతుంది. రేఖ మాత్రం ఆ రాజు గాడు మనకు గిఫ్ట్‌ ఇచ్చాడు కదా నేను వాడికి పెద్ద రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తాను అంటూ వెళ్లిపోతుంది.

వెంకట్‌ భాదపడుతుంటే.. నందు ఓదారుస్తుంది. మీ అమ్మానాన్న గుర్తు పట్టలేదు కదరా..? అనగానే.. వెంకట్‌ బాధగా గుర్తు పట్టలేదు కానీ వాళ్లను అక్కడ చూడగానే.. నేను షాక్‌ అయ్యాను.. వాళ్లు నన్ను నమ్ముతున్నారు.. కానీ నేను వాళ్లను మోసం చేస్తున్నాను. నిజం తప్ప అబద్దం గురించి తెలియని నేను ఇప్పుడు అబద్దపు జీవితంలో గడిపేస్తున్నాను. ఈ గిల్టీ ఫీలింగ్‌తో అన్నం సహించడం లేదు. సరిగ్గా నిద్ర పట్టడం లేదు అంటూ బాధపడుతుంటే.. నందు రేయ్‌ నువ్వు మెతక మనిషివిరా అందుకే నీకు ముందే చెప్పాను. ఈ విషయం గురించి మీ అమ్మా నాన్నలకు ముందే చెప్పమని.. కానీ నువ్వే వినలేదు.. అనగానే.. వెంకట్‌ మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు.. నన్ను గొప్ప వాణ్ని చేయాలని మా అమ్మానాన్న ఎంతో కష్టపడ్డారు ఆశపడ్డారు. అలాంటి వాళ్లకు నేను డెలివరీ బాయ్‌గా చేస్తున్నాను అంటే వాళ్లు తట్టుకోలేరు.. జనం మధ్య బంధువుల మధ్య తలెత్తుకోలేరు వాళ్ల పరువు తీశానని బాధపడతారు అంటూ వెంకట్‌ బాధపడుతుంటే.. నువ్వేం దొంగతనం చేయడం లేదు.. కష్టపడి నీ కాళ్ల మీద నువ్వు నిలబడి బతుకుతున్నావు.. అని ఓదారుస్తుంది.

Advertisement

రాజు, ఇందులను అపర్ణ, సుభాష్‌ మెచ్చుకుంటారు. ఈ డిజైన్స్‌ ఓకే చేయించుకోవడానికి మీరు ఎంతలా కష్టపడ్డారో మాకు తెలుసు.. ఇప్పుడు మీ మీద మాకు పూర్తి నమ్మకం వచ్చిందని చెప్తారు. మీరిద్దరు ఇలాగే కంపెనీ పూర్వ వైభవం తీసుకురావాలని కావ్య, ఇందులాగానే మీరు సక్సెస్‌ఫుల్‌ గా కొనసాగాలని కోరుకుంటున్నామని చెప్తారు. ఇందు అందరికీ స్వీట్లు ఇస్తుంది. స్వాతి మాత్రం ఏంటక్కా ఇంత చిన్న స్వీట్‌ ముక్క పెట్టి అంత పెద్ద సక్సెస్‌ ను ఎంజాయ్‌ చేద్దామా..? అని అడగ్గానే.. రాజు ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్‌ చేద్దామా..? అని అడగ్గానే.. అదేం లేదు ఇంట్లోనే ఉండి ఎంజాయ్‌ చేయాలి అంటూ ఇందు చెప్తుంది. ఇంతలో స్వాతి కల్పించుకుని బావ అప్పుడే నిన్ను మా అక్క బలే కంట్రోల్‌లో పెట్టుకుందా..? అని అడగ్గానే.. ఇది యూనివర్సల్‌ ప్రాబ్లమ్‌ అంటూ చెప్తాడు.

ఇంటికి వెళ్లిన చలపతి, లక్ష్మీ ఇద్దరూ వెంకట్‌ గురించి ఆలోచిస్తుంటారు. అప్పుడే వచ్చిన వెంకట్‌ను చూసి నిజం చెప్పమని అడుగుతారు. డెలివరీ చేసినప్పుడు వెంకట్‌ను గుర్తు పట్టామని చెప్తారు. వెంకట్‌ షాక్‌ అవుతాడు. ఎందుకు ఈ పని చేశావు అని అడుగుతారు. దీంతో వెంకట్‌ జరిగింది మొత్తం చెప్తాడు. దీంతో నువ్వు కోచింగ్‌ తీసుకో ఉద్యోగం వచ్చేదాకా ఈ డెలివరీ జాబ్‌ వదిలేయ్‌ అంతా నేను చూసుకుంటాను అని చెప్పగానే.. వెంకట ‌ఎమోషనల్‌ అవుతూ ఏడుస్తూ.. చలపతిని హగ్‌ చేసుకుంటాడు. ఇంతలో నందు వస్తుంది. వెంకట్‌ గురించి చాలా గొప్పగా చెప్తుంది. వెంకట్‌ ఏమనుకుంటున్నాడో అదే చేయనివ్వండి.. ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడని చెప్తుంది. నందు మాటలకు చలపతి కన్వీన్స్‌ అవుతాడు. వెంకట్‌ను నచ్చినట్టు ఉండమని చెప్తాడు. వెంకట్‌ హ్యాపీగా ఫీలవుతూ.. నందుకు థాంక్స్‌ చెప్తాడు.

Advertisement

రూంలో ఉన్న రాజు దగ్గరకు ఇందు వెళ్లి స్వీట్స్‌ ఇస్తుంది. రాజు తినకుండా ఇదంతా నా ఇమాజినేషన్‌ ఇందు నాకు స్వీట్స్‌ పెట్టడం ఏంటి అనుకుంటూ పక్కకు వెళ్లిపోతాడు. ఇందు పక్కకు వెళ్లి స్వీట్స్‌ ఇవ్వబోతుంది. రాజు షాక్‌ అవుతాడు. ఇదేంటి ఇమాజినేషనా..? లేక నిజమా అని మనసులో కంగారుపడుతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Big Stories

Advertisement
×