E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today April 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మకు అనామిక సీరియస్‌ వార్నింగ్‌ – అయోమయంలో మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today April 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మకు అనామిక సీరియస్‌ వార్నింగ్‌ – అయోమయంలో మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  ఆశ్రమంలో ఉన్న చిత్ర మెల్లగా అనామిక దగ్గరకు వెళ్లి నువ్వు కొంచెం మా అరుంధతిలా ఉన్నావు తెలుసా..? అని అడుగుతుంది. దీంతో అవును నా నవ్వు కొంచెం మేడంలా ఉంటుందని ఆంటీ వాళ్లు అంటుంటారు అని చెప్తుంది. ఇంతలో చిత్ర నీకు ఇంట్లో అందరి గురించి తెలుసా..? అని అడుగుతుంది. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అని అనామిక అడగ్గానే.. తెలివైన దానివే.. మను గురించి తెలుసుకోవాలి అని చిత్ర చెప్పగానే.. మను గురించి చిత్ర ఎందుకు అడుగుతుంది. ఇందాక చిత్ర ఏదో చెప్పబోతుంటే మను పక్కకు తీసుకెళ్లింది. చిత్రకు మను గురించి తెలుసా..? తెలుసుకోవాలనుకుంటుందా..? అని మనసులో అనుకుంటుంది.

ఇంతలో చిత్ర ఆలోచిస్తున్నారేంటి మను గురించి తెలుసా..? అని అడుగుతుంది. దీంతో పెద్దగా నాకేం తెలియదండి.. ఆవిడ ఒక ఏడు సంవత్సరాలు ఎక్కడుందో ఏం చేసిందో ఎవ్వరికీ తెలియదు అంటుంది. అప్పుడే కోల్‌కతాలో పెళ్లి చేసుకుని బిడ్డను కన్నది అని చిత్ర మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత కొడైకెనాల్‌ లో అరుంధతి మేడం దగ్గరకు వచ్చారట. వచ్చిన నాలుగు రోజులకే అరుంధతి మేడం యాక్సిడెంట్‌లో చనిపోయారట. మీకో విషయం తెలుసా..? సార్‌ పెళ్లి మనోహరిగారితే జరగాలట. కానీ అనుకోకుండా భాగీతో జరిగిపోయింది. ఇప్పటికీ భాగీని తప్పించి మనోహరి గారు అమర్‌ పెళ్లాంగా సెటిల్‌ అవ్వాలని ట్రై చేస్తుందట.. చిత్ర గారు మళ్లీ ఇదంతా నేను చెప్పానని మనోహరికి చెప్పకండి నన్ను తిడుతుంది అని చెప్పి వెళ్లిపోతుంది ఆరు అలియాస్‌ అనామిక.

Advertisement

అనామిక వెళ్ళిపోయాక చిత్రి ఆలోచిస్తుంది. ఆరు పెళ్లి అయినప్పుడు మనోహరి చేసిన చాలెంజ్‌ గుర్తు చేసుకుంటుంది. అమ్మా మనోహరి ఆరోజు నువ్వు అన్న మాటలు కోపంతో అన్నావనుకున్నాను. కానీ ఇలా ఇన్నేళ్లు పంతంతో పగబట్టి అరుంధతి మీద పగ తీర్చుకుంటావనుకోలేదు. అంటే అమర్‌ను పెళ్లి చేసుకోవడానికి మనోహరే అరుంధతిని చంపేసింది.  ప్లాన్‌ చేసి పెళ్లి చేసుకునే సమయానికి భాగీతో పెళ్లి అయిపోయింది. అంటే ఇప్పుడు కూడా భాగీని చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. ఆహా ఏం దొరికావు మనోహరి నేనేదో నిన్ను భయపెట్టి కొంచెం డబ్బులు తీసుకుందామని ఇక్కడికి వస్తే.. నాకు మాత్రం పెద్ద జాక్‌ పాట్‌ తగిలింది. నీ గతాన్ని అడ్డు పెట్టుకుని నా భవిష్యత్తును సెట్‌ చేసుకుంటా..! అని ప్లాన్‌ చేసుకుంటుంది చిత్ర.

మరోవైపు అందరికీ భోజనాలు వడ్డించడానికి శివరాం, నిర్మల ఏర్పాట్లు చేస్తుంటారు. రాథోడ్‌కు మిగిలిన ఏర్పాట్లు చూడమని నిర్మల చెప్తుంది. అలాగేనని వెళ్లున్న రాథోడ్‌ ఆలోచిస్తూ ఉన్న అమర్‌ను చూస్తాడు. దగ్గరకు వెళ్లి సార్‌ ఒక్కరే ఇక్కడ ఏం చేస్తున్నారు..?  ఏంటి సార్‌ గేటు దాకా వచ్చిన మేడం లోపలకు రాకుండా పోతారు. మీరు మరీ ఇక్కడ నిలబడి వెయిట్‌ చేయాలా..? లోపలికి రండి సార్‌ అని పిలుస్తాడు. దీంతో అమర్‌ నేను భాగీ కోసం వేయిట్‌ చేయడం లేదు రాథోడ్‌. భాగీ చుట్టూ అల్లుకుంటున్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను. అని అమర్‌ చెప్పగానే.. రాథోడ్‌ షాక్‌ అవుతాడు. దీంతో అమర్‌ కోల్‌కతాలో జరిగింది మొత్తం చెప్తాడు.

Advertisement

పక్క నుంచి వింటున్న మనోహరి షాక్‌ అవుతుంది. ఇది అమర్‌ కు చెప్పదు అనుకుంటే మొత్తం చెప్పినట్టు ఉంది. అసలు కోల్‌కతా ఎందుకు వెళ్లిందో అది కూడా చెప్పిందా..? ఏంటి..? అని భయపడుతుంది. మేడంను చంపాల్సిన అవసరం ఎవరికుంది సార్‌ అని రాథోడ్‌ అడగ్గా ఆరును చంపిన వాళ్లే భాగీని చంపాలనుకుంటున్నారు. భాగీ ప్రతి మూమెంట్‌ను వాళ్లు వాచ్‌ చేస్తున్నారు. అనగానే.. రాథోడ్ భయంగా మేడంకు ఇంకా ప్రమాదం ఉంది సార్‌ అంటాడు. ఇంతలో నిర్మల వచ్చి నాన్నా అమర్‌ అందరూ భోజనానికి కూర్చుంటున్నారు. మీరు రండి అని పిలుస్తుంది. సరే వస్తున్నాం పద అమ్మా అంటూ అమర్‌, రాథోడ్‌ ఇద్దరూ భోజనానికి వెళ్తారు. అందరూ భోజనం చేస్తూ.. హ్యాపీగా మాట్లాడుకుంటారు.

తర్వాత ఇంటికి వెళ్లాక మిస్సమ్మ కిచెన్‌లో  వంట చేస్తుటే.. ఆరు వెళ్లి భాగీ అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా..? లైఫ్‌లో సార్‌తో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలని ఉందా..? లేదా..? అని అడుగుతుంది. మరోవైపు అమర్‌ దగ్గర రాథోడ్‌ మిస్సమ్మ మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీకు తెలియదా..? సార్‌ అని అడుగుతాడు. కింద ఆరు అసలు సార్‌కు దగ్గరయ్యే ప్రయత్నం ఏదైనా చేస్తున్నావా..? నువ్వు.. ఆయన ఫస్ట్‌ వైఫ్‌ను మర్చిపోలేక పోతున్నారు. అలా అని అలాగే వదిలేస్తావా..? అంటుంది. పైన రూంలో రాథోడ్‌ మీరిద్దరూ సంతోషంగా కొత్త జీవితం మొదలు పెట్టే రోజు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు సార్‌ మిస్సమ్మకు ఒక్క చాన్స్‌ ఇచ్చి చూడండి సార్‌. సంతోషాన్ని ప్రేమను కొత్తగా పరిచయం చేస్తారు. అంటూ రాథోడ్‌, అమర్‌ మనసులో ప్రేమను.. ఆరు, మిస్సమ్మ మనసులో కొత్త ఆశలను రేకెత్తిస్తారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×