E-Paper
Advertisement

Thriller Movies on OTT : టాప్ 8 ఇంటర్నేషనల్ థ్రిల్లర్ మూవీస్… ఒంటరిగా చూస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టే

Thriller Movies on OTT : టాప్ 8 ఇంటర్నేషనల్ థ్రిల్లర్ మూవీస్… ఒంటరిగా చూస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టే

Thriller Movies on OTT  : కొన్ని హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసినప్పుడు మీకు నిజంగానే నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది. భయంతో వణికి పోతారు. ఒంటరిగా మాత్రం చూసే ధైర్యం చేయలేరు. ఇటువంటి సినిమాలను ఒంటరిగా చూస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టే. అంతలా వణికిస్తాయి. ఇప్పుడు మనం, ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో అతి భయంకరమైన సినిమాలు గురించి చెప్పుకుందాం. ఇవి ఏ ఓటీటీ లో ఉన్నాయో తెలుసుకుని, మీరు కూడా ఈ సినిమాలను చూసి భయపడతారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

Hereditary

2018 లో వచ్చిన ఈ మూవీలో ఒక కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోతుంది. ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో వింత శబ్దాలు, భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రతిక్షణం మిమ్మల్ని టెన్షన్ పెట్టిస్తూ చంపేస్తుంది.  10/10 రేటింగ్ దీనికి ఉంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video ) లో స్ట్రీమింగ్ అవుతుంది.

The Dark and the Wicked

2020లో వచ్చిన ఈ మూవీలో తండ్రి మరణం కూతుర్లు కోరుకుంటారు. ఈ సినిమా ఒక వినాశనం అనే చెప్పాలి. బీభత్సమైన ఎక్సైటింగ్ దీనిని చూస్తే వస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video ) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రేటింగ్ 9/10  ఉంది.

Lake Mungo

2008 లోడాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ ఆస్ట్రేలియన్ హారర్ మూవీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఒక కుటుంబంలో కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోతారు. ఆ తర్వాత ఆమె అనుమానస్పద మృతికి కారణం బయట పడుతుంది. ఈ క్రమంలోనే మీ గుండెల్లో వణుకు కూడా పుడుతుంది. ఈ మూవీ రేటింగ్ 9/10  ఉంది. ఆపిల్ టివి (Apple TV) లో స్ట్రీమింగ్ అవుతోంది.

The Auto of Jane Doe

అతీంద్రియ శక్తులు ఉన్న ఒక శవానికి పోస్టుమార్టం చేస్తారు ఇద్దర డాక్టర్లు. ఆ తర్వాత ఆ శవం వెనక భయంకరమైన మిస్టరీ దాగి ఉంటుంది. ఈ మూవీ రేటింగ్ 8.5/10 గా ఉంది. ఈ మూవీ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

The Babadook

ఇందులో మనుషుల్ని నీడలా వెంటాడే ఒక సైతాన్ ఉంటాడు. వాడి చేతుల్లో మనుషులు ఘోరంగా చనిపోతూ ఉంటారు. ఈ మూవీ మానసికంగా కూడా మిమ్మల్ని భయపెడుతుంది. ఇది కూడా ఐఎండిబి రేటింగ్ లో 8.5/10 గా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video ) లో స్ట్రీమింగ్ అవుతుంది.
Noroi: The Curse

2005 లో వచ్చిన ఈ జపనీస్ హారర్ మూవీ నెమ్మదిగా వెళుతూ ఒక భయంకరమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఒక శాపం చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ కూడా 10/10 రేటింగ్ లో ఉంది. యూట్యూబ్ (YouTube) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Martyrs 

2008 లో వచ్చిన ఈ ఫ్రెంచ్ హారర్ థ్రిల్లర్ సినిమా దుష్టశక్తుల చుట్టూ తిరుగుతుంది. ఇందులో భావోద్వేగ హింస ఉంటుంది. ఈ మూవీ బాధ పెడుతూ, భయపెడుతుంది. ఈ మూవీ ముబి (MUBI) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

ఓటీటీలోకి 7,000 కోట్ల మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Big Stories

×