BigTV English

Nindu Noorella Saavasam Serial Today December 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఆత్మ ఇంట్లోనే ఉందన్న స్వామీజీ – ఎమోషనల్‌ అయిన అమర్‌

Nindu Noorella Saavasam Serial Today December 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఆత్మ ఇంట్లోనే ఉందన్న స్వామీజీ – ఎమోషనల్‌ అయిన అమర్‌

Nindu Noorella Saavasam Serial Today Episode :  అమర్‌ ఇంటికి వచ్చిన స్వామిజీ ఆరు ఆత్మను చూస్తాడు. ఆరుకు అనుమానం వస్తుంది. ఆయనకు నేను కనిపించానా గుప్త గారు. నేను ఆయనకు కనిపించానా చెప్పండి గుప్త గారు అని అడుగుతుంది ఆరు. దీంతో ఆయనకు నువ్వు కనిపించావని చెప్తాడు గుప్త. దీంతో రెండు రోజుల్లో నువ్వు ఈ లోకం విడిచి వెళ్లెదవు బాలిక అంటూ చెప్పిన గుప్త మాటలు గుర్తు చేసుకుని ఆరు భయపడుతుంది. ఇంతలో నువ్వు ఈ లోకం విడిచి వెళ్లుటకు విధి నిర్ణయించింది.


ఎప్పటి వలే ఇప్పుడు కూడా నువ్వు విధికి ఎదురు వెళ్లకు బాలిక. లేదంటే నువ్వు నీ కుటుంబం చాలా సమస్యలు ఏదుర్కోవాల్సి వస్తుంది. ఏమీ మాట్లాడకుండా నాతో నువ్వు మా లోకానికి రమ్ము బాలిక అని పిలుస్తాడు. దీంతో మనోహరి కన్న కూతురునియే వదిలేసిన కసాయి అని తెలిసి కూడా నా పిల్లలను వదిలేసి నేను ఎలా రాగలను గుప్త గారు అని ప్రశ్నిస్తుంది. ఇంతలో బాల్కనీలోకి వచ్చిన మనోహరి.. ఆరు నా గురించి నాకు తెలిసినదాని కన్నా నీకే ఎక్కువ తెలుస్తుంది. నా గురి ఎప్పటికీ తప్పదని తెలుసుకో ఆరు అంటూ వెళ్లిపోతుంది. ఆరు భయంగా చూస్తుంది.

స్వామీజీ లోపలికి వెళ్లగానే ఆయనను కూర్చోబెట్టి మిస్సమ్మ ను వాటర్‌ తీసుకురమ్మని చెప్తాడు. మిస్సమ్మ వాటర్‌ తీసుకురాగానే ఇంత కాలానికి గమ్యం చేరావా తల్లి అంటాడు స్వామిజీ. ఇంతలో అమర్‌ వచ్చి నమస్కారం స్వామిజీ అని చెప్పగానే మీ పెళ్లి కోసం విధి చాలా పెద్ద ఆట ఆడింది. ఎన్ని కష్టాలు వచ్చినా మీ బంధాన్ని వదలకండి. అని చెప్తాడు. మనోహరి రాగానే ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది. అని అడుగుతాడు. మనోహరి అని నా పెద్ద కోడలి స్నేహితురాలు అని నిర్మల చెప్పగానే.. చావు కోరి వచ్చిన స్నేహమా..? చావు కూడా వేరు  చేయలేని స్నేహమా అని స్వామిజీ అడగ్గానే మనోహరి షాక్‌ అవుతుంది.


చెప్పమ్మా మనోహరి నీ స్నేహం ఎటువంటిది. స్నేహం ప్రాణాలు ఇస్తుందా..? ప్రాణాలు తీస్తుందా..? అని అడుగుతాడు. మనోహరి తడబడుతుంటే మీ సమస్య ఏంటో చెప్పమ్మా అని నిర్మలను అడుగుతాడు స్వామిజీ.. ఇంట్లో ఒక దాని  తర్వాత ఒకటి వస్తుంది. ఏదో ఒక ప్రమాదం కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. దోషం ఏమైనా ఉందేమోనని తెలుసుకుని నివారణ చేసుకుందామని పిలిపించాం స్వామి అని నిర్మల చెప్పగానే నీ అనుమానం నిజం నిర్మలమ్మ అంటాడు స్వామిజీ.. దోషం జరిగింది. మీ మనసులో ఉన్న అనుమానమే నిజం అయింది. అని స్వామి చెప్పగానే అంటే తప్పు జరిగిందా..? స్వామి.. మేము ఏ తప్పు చేయలేదు. తెలియకుండా ఏదైనా చేసి ఉంటే చెప్పండి స్వామి పరిహారం చేసుకుంటాం అని మిస్సమ్మ అడుగుతుంది.

రాథోడ్ కూడా ఏమైంది స్వామి బయటకే చూస్తున్నారు. ఇందాక వచ్చేటప్పుడు కూడా బయట అలా చూశారు అని అడుగుతాడు. దీంతో నేను చెప్పే విషయం మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు.. సంతోషాన్ని ఇవ్వవచ్చు.. మనసును బాధ పెట్టవచ్చు కానీ మీ కుటుంబం క్షేమం కోరే మనిషిని కాబట్టి చెప్తున్నాను అంటూ ఈ ఇంటి పెద్ద కోడలు ఎక్కడికి పోలేదు. ఈ ఇంటి చుట్టూనే తిరుగుతుంది. అని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు.  అదెలా సాద్యం అవుతుంది స్వామి. మనిషి చనిపోయాక ఆత్మ, పరమాత్మలో లీనం అవుతుంది కదా అని శివరాం  అడగ్గానే అదెలా జరగుతుంది శివరాం. అమ్మాయి  ఆస్తికలు ఇంకా కలపలేదు కదా..? ఆస్థికలు దాచుకుని ఆత్మకు మోక్షం కలగాలంటే ఎలా సాధ్యపడుతుంది అని స్వామిజీ అడగ్గానే…

కిటికీలోంచి వింటున్న ఆరు.. గుప్త గారు నా పర్మిషన్‌ లేకుండా నన్ను పైకి తీసుకెళ్లలేరు కదా..? మరి ఆస్థికలు కలిపితే నేను ఎలా పైకి వెళ్తాను చెప్పండి అని అడుగుతుంది. మనోహరి మాత్రం హ్యాపీగా ఫీలవుతుంది. అంటే స్వామిజీ ఆరు ఇక్కడే ఉందా..? అని అమర్‌ అడగ్గానే అవును ఇక్కడే ఉంది. బయట ఉండొచ్చు.. గుమ్మం దగ్గర ఉండొచ్చు.. ఏ కిటికీ దగ్గరైనా ఉండొచ్చు  అని స్వామిజీ చెప్తాడు. అమర్‌ అంతా వెతుకుతాడు. బయటకు వెళ్లి చూస్తాడు. గార్డెన్‌లోకి వెళ్లి ఏమోషనల్‌ అవుతూ గట్టిగా ఆరు అని పిలుస్తాడు అమర్‌. పక్కనే ఉన్న ఆరు ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో లోపల ఉన్న శివరాం, మిస్సమ్మను వెళ్లి అమర్‌ను తీసుకురాపో అని చెప్తాడు. మిస్సమ్మ బయటకు వస్తుంటే.. గుప్త పరుగెత్తుకొచ్చి ఆరును పక్కకు తీసుకెళ్తాడు. మిస్సమ్మ వచ్చి ఆమర్‌ను లోపలకి తీసుకెళ్తుంది.

అంజు స్వామి దగ్గరకు వెళ్లి మీరు చెప్తుంది నిజమా..? మా అమ్మా ఇక్కడే ఉందా..? అని అడుగుతుంది. అవును తల్లీ అని స్వామిజీ చెప్తాడు. ఇంతలో మనోహరి వెంటనే హడావిడి చేసి ఆస్థికలు నదిలో కలిపించాలి అని మనసులో అనుకుని స్వామిజీ మీరు చెప్తుంది నిజమే కదా..? అయితే వెంటనే ఆరు అస్థికలను నదిలో కలిపేద్దాం అంటుంది. బాధపడినట్టు నటిస్తుంది. నిర్మలకు కూడా ఆరు అస్థికలు వెంటనే నదిలో కలుపుదాం అంటుంది.

ఈ ఇంటి మేలు కోరే మేడం వల్ల ఆపద వస్తుందంటే నేను నమ్మడం లేదు స్వామి అంటాడు రాథోడ్‌. అది నిజమే ఆస్థికలు నదిలో కలపకపోవడం వల్ల దోషం జరిగిందేమో కానీ ఇంటికి కాపలాగా రక్షణగా నిలబడింది ఈ ఇంటి పెద్ద కోడలు అని స్వామిజీ చెప్తాడు. తన వలన కీడు ఎప్పటికీ జరగదు. కానీ ఆస్థికలు కలిపి అమ్మాయికి మోక్షం కలిపించడం మన ధర్మం. మీ ధర్మం మీరు పాటించండి.. మిగతాది దేవుడు చూసుకుంటాడు అని చెప్పి వెళ్లిపోతాడు స్వామిజీ.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Stories

×