E-Paper
Advertisement

Horoscope  Today December 23rd :  ఈరోజు  ఆ రాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

Horoscope  Today December 23rd :  ఈరోజు  ఆ రాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 23న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. సన్నిహితులతో అకారణ విభేదాలు తప్పవు. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వాహన, యోగములు ఉన్నవి. వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందులు క్రమ క్రమంగా తొలగుతాయి.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గరి వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. ఇంట్లో శుభకార్యములు నిర్వహిస్తారు. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటా బయటా సమస్యలు పెరుగుతాయి. దైవ సంబంధిత విషయములలో ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్న పాటి సమస్యలు తప్పవు.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో ఆకారణ కలహ సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. సంతాన విద్యా విషయాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో ఆందోళనలు పెరుగుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. బంధు మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన నష్టాలు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు  చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులతో ఉన్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులందు శ్రమ అధికమౌతుంది. ఇతరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు పెరుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×