trinayani serial today Episode: విక్రాంత్ నయని నిక్షేపంగా ఉంటే తనకు బాగా లేదని నువ్వు అలా ఎలా రాస్తావురా అంటూ విశాల్ ప్రశ్నించగానే ఐయామ్ సారీ బ్రో అంటాడు విక్రాంత్. సారీ చెప్తే క్షమించేస్తారా..? బతికుండగానే పెద్ద మరదలును చంపేశావు కదరా.. అంటాడు వల్లభ. వదిన అంటే దేవత అనే నువ్వే ఇలా చేశావంటే నమ్మబుద్ది కావడం లేదు అంటుంది సుమన. దీంతో ఏదో తెలియక చేశాడులేమ్మా అంటాడు పావణమూర్తి. విక్రాంత్ బాబు చేసిన దానికి నాకేం కోపం రావడం లేదని చెప్తుంది నయని.
దీంతో నీకు రాకపోతే మాకు వస్తుంది త్రినేత్రి అంటుంది తిలొత్తమ్మ. దీంతో దురందర, విశాల్ తిడతారు. మీరు నేను నయని కాదని నిరూపిస్తే అప్పుడు మీ మాటలకు అర్థం ఉంటుంది అని చెప్తుంది నయని. ఇంతలో విక్రాంత్ నయనికి సారీ చెప్తాడు. పర్వాలేదని ఈసారి ఏదైనా చేస్తే ముందు మీ అమ్మను గుర్తు తెచ్చుకుని చేయండి అని చెప్పి నయని వెళ్లిపోతుంది.
విక్రాంత్ ఫోన్ లోమాట్లాడుతుంటే సుమన వెనక నుంచి వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది. విక్రాంత్ వదులు సుమన అని ఎంత చెప్పినా వదలదు సుమన ఇంతలో హాసిని వచ్చి సుమనను లాగేస్తుంది. మా ఆయనను హగ్ చేసుకుంటే లాగేస్తావేంటి అక్కా అంటూ ప్రశ్నిస్తుంది. అవతలి నుంచి రెస్పాన్స్ లేనప్పుడు నువ్వు ఒక్కదానివే రొమాన్స్ అనుకుంటే ఎలా చిట్టి అంటుంది హాసిని. దీంతో మా అక్క ఇన్సూరెన్స్ డబ్బులు నా కూతురు ఇవ్వాలని అడిగిన నీకు నా మీద ఎంత ప్రేమో అర్థం అవుతుందని అంటుంది సుమన. దీంతో అయినా నువ్వు అలా ఎలా చేశావు విక్రాంత్ అని హాసిని అడుగుతుంది. నేను పద్దతి ప్రకారం చేశాను కానీ ఇలా స్పీడ్ పోస్ట్ వస్తుందని అసలు అనుకోలేదు వదిన అంటాడు విక్రాంత్.
నయని రూం సర్దుతుంటే.. పావణమూర్తి వచ్చి సుమన నిన్ను అన్ని మాటలు అంటుంటే నువ్వు కోప్పడకపోవడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అమ్మా అంటాడు. ఇంతలో విశాల్ వచ్చి మామయ్య నువ్వు నయనిని గమనించావా..? ఈ మధ్య తనకు కోపం రావడం లేదు. శాంతంగా ఉంటుంది. అని చెప్పగానే అమ్మవారు కాళికమ్మ అవతారం ఎత్తే ముందు శాంతంగా ఉంటారట అని పావణమూర్తి చెప్పగానే మీరు అలా చెప్తే బాబుగారికి మళ్లీ కంగారు మొదలవుతుంది బాబాయ్ నేను మళ్లీ ఎవరి మీదకు యుద్దానికి వెళ్తానోనని నా వెనకాలే తిరుగుతారు అంటుంది నయని. ఎంతో మంచిదైన నయనిని ఇంకా వెయ్యేళ్లు బతకాలని కోరుకోవాలి కానీ.. అని విశాల్ చెప్పగానే ఆ మాట అనకు అల్లుడు ఇప్పుడే దూసుకెళ్లి నీ మరదలు సంగతి చూడాలని ఉంది అంటాడు. వద్దులే మామయ్యా అంటూ పావణమూర్తిని ఎత్తుకుని బయటకు వెళ్లిపోతాడు విశాల్.
నేత్రిని వెతుక్కుంటూ పట్నం వచ్చిన బామ్మ ఫోటో చూపిస్తూ అందరినీ అడుగుతుంది. ఇంతలో వల్లభ ఎదురుపడగానే త్రినేత్రి గురించి అడుగుతుంది. నేత్రి ఫోటో చూపిస్తుంది. వల్లభ ఆశ్చర్యంగా బామ్మను కారెక్కు అంటాడు. దీంతో బామ్మ తిడుతూ చుట్టు పక్కల ఎవరూ లేరని నన్ను బలత్కారం చేస్తావా..? అంటూ కొడుతుంది. దీంతో ఏయ్ బామ్మ నీకు నీ మనవరాలిని చూపిస్తాను అంటాడు. ఎక్కడుందిరా నా మనవరాలు మీ ఇంట్లో ఉందా..? అని బామ్మ అనగానే అవును నిజంగానే మా ఇంట్లో ఉందని చెప్తాడు వల్లభ. దీంతో నీ పని చెప్తా ఉండు సచ్చినోడా అంటూ తిడుతుంది బామ్మ. దీంతో అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వస్తాడు వల్లభ.
ఇంటికి వచ్చిన వల్లభ అందరినీ పిలిచి త్రినేత్రి గురించి వెతుక్కుంటూ వచ్చిన బామ్మ గురించి చెప్తాడు. మమ్మీ చెప్పింది అక్షర సత్యం తనది అధార భూతం అని చెప్తాడు. నీ మేనమామ పేరు ముక్కోటి, నీ మేనత్త పేరు వైకుంఠం అంటూ వల్లభ చెప్పగానే అందరూ విచిత్రంగా వల్లభను చూస్తుంటారు. బ్రో కథలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నావు అని విక్రాంత్ అడుగుతాడు. వల్లభ మాటలు ఎవ్వరూ నమ్మరు. వల్లభకు పిచ్చి పట్టిందని అంటుంది హాసిని. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?