E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today June 20th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను కొట్టిన చిత్ర

Nindu Noorella Saavasam Serial Today June 20th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను కొట్టిన చిత్ర
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: చిత్ర ఫోర్స్‌ చేయడంతో వినోద్‌ తాళి కడతాడు. ఇంతలో అక్కడకు అమర్‌, మిస్సమ్మ, నిర్మల, శివరాం, మనోహరి వస్తారు. మనోహరి ఏం తెలియనట్టు చిత్ర ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. చిత్ర వినోద్‌ చేతులు పట్టుకుంటుంది. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. శివరాం కోపంగా రేయ్‌ వినోద్‌ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..? అని అడుగుతాడు. దీంతో వినోద్‌ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నాన్న అని చెప్తాడు. ఇప్పుడు చిత్ర నా భార్య మన ఇంటి కోడలు అంటాడు. మిస్సమ్మ ఎమోషనల్ అవుతూ ఎందుకు వినోద్‌ ఎందుకు ఇంత పని చేశావు. ఒక్క నిమిషం ఆలోచించవచ్చు కదా అంటుంది. ఏం మా పెళ్లి ఆపడానికా అంటాడు వినోద్‌.

దీంతో శివరాం కొడుతూ అసలు నీకు బుద్ది ఉందారా..? అంటాడు. నేను మీ మాట కాదన్నాను అని మా పెళ్లి అవ్వకుండా ఉండాలని మీరు చూస్తున్నారు. అందుకే కదా అన్నయ్యా నన్ను ఆశ్రమానిక పిలిపించారు. ఇప్పుడు ఇక్కడకు వచ్చారు అంటూ అడుగుతాడు. దీంతో మిస్సమ్మ వినోద్‌ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు. కానీ నిజం తెలుసుకో అంటుంది. అవునా ఏంటా నిజం చెప్పండి  ఇవాళ నేను తెలుసుకుంటాను అని అడగ్గానే.. మిస్సమ్మ చిత్ర గురించి నిజం చెప్పబోతుంటే.. అమర్‌ ఆపేస్తాడు. శివరాం చెప్పడానికి ప్రయత్నించినా అమర్‌ ఆపేసి.. వినోద్‌ మీరిద్దరూ ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారని మాకు తెలుసు. వీళ్లిద్దరూ చిత్రను దత్తత తీసుకున్న వాళ్లు వీళ్ల సమక్షంలో మీ పెళ్లి చేయాలని వీళ్లను మీకు పరిచయం చేయాలని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. మీకు పెళ్లి చేస్తామని చెప్పాక కూడా మీరు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. మనోహరి వీళ్లిద్దరిని తీసుకెళ్లి దేవుడి దర్శనం చేయించు అని చెప్తాడు. మనోహరి వాళ్లిద్దరిని తీసుకుని వెళ్లిపోతుంది.

Advertisement

వాళ్లు వెళ్లిపోయాక ఏవండి ఎందుకండి వినోద్‌కు ఎందుకు నిజం చెప్పలేదు అని మిస్సమ్మ అడుగుతుంది. శివరాం కూడా కోపంగా వాడు పెళ్లి  చేసుకుంది ఎవరినో వాడికి ఎందుకు చెప్పలేకపోయావు అమర్‌ అంటూ నిలదీస్తాడు. దీంతో అమర్‌ చెప్పి ఏం చేస్తాం నాన్నా.. వినోద్‌ చిన్నప్పటి నుంచి ఎంత సెన్సిటివో తెలుసు కదా..? వాడు ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయాడని చెప్పడం.. వాడి భార్య చేతిలో మోసపోయాడని చెప్పడం ఎలా ఒకటి అవుతుంది నాన్నా.. నేను చెప్పబోయే నిజం వాడి మనసు ముక్కలు చేస్తుంది నాన్నా అంటూ అమర్‌ ఎమోషనల్‌ అవుతాడు.

అయితే ఆ రాక్షసి మీ తమ్ముడి జీవితం నాశనం చేస్తుంది బాబు అని రావు చెప్తాడు. మా మాట విని మీ తమ్ముడికి నిజం చెప్పండి అని రావు భార్య అంటుంది. మిస్సమ్మ కూడా అవునండి వినోద్‌కు అర్థం అయ్యేలా చెబుదామండి అంటుంది. చెప్తే వినే స్థితిలో వాడు లేడు.. చిత్రనే మంచి మనిషిగా మార్చి వినోద్‌ జీవితం చక్కబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని అమర్‌ చెప్తాడు. అలాంటి అమ్మాయిని ఎలారా మార్చేది అంటూ శివరాం అడుగుతాడు. తప్పదు వినోద్‌ కోసం మనం భరించాలి. చిత్ర మారే వరకు మనం ప్రయత్నిద్దాం అని చెప్పి అమర్‌ వెళ్లిపోతాడు.

Advertisement

తర్వాత అందరూ కలిసి ఇంటికి వస్తారు. ఆచారం ప్రకారం ఇంటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురుతో గడప ముందు బియ్యపు చెంబును కాలితో తన్ని లోపలికి రమ్మని చెప్తారు. చిత్ర కోపంగా ఇలాంటివన్నీ నాకు నచ్చవని చెప్పి గట్టిగా చెంబును తన్నగానే.. అది వెళ్లి మిస్సమ్మ ముఖంపై పడుతుంది. మిస్సమ్మ గాయం అయి రక్తం వస్తుంది. అయినా అదేమీ పట్టించుకోకుండా చిత్ర, వినోద్‌ వెళ్లిపోతారు. తర్వాత రూంలోకి వెళ్లి బాధపడుతున్నా మిస్సమ్మ దగ్గరకు ఆయిట్‌మెంట్‌ తీసుకుని వచ్చి పెడతాడు అమర్‌. మిస్సమ్మను బాధపడొద్దని ఓదారుస్తాడు. తర్వాత అమర్‌ వెళ్లిపోతుంటే.. ఏవండి మీరేం టెన్షన్‌ పడకండి ఇంట్లో అందరిని నేను చూసుకుంటాను మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్తుంది. దీంతో అమర్‌ వెనక్కి వచ్చి మిస్సమ్మను హగ్‌ చేసుకుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×