Dog Temple Kerala: కుక్కల దేవాలయం చూశారా? మనుషులకే కాదు.. పెంపుడు కుక్కలకూ ఆశీర్వాదాలు ఇక్కడ లభిస్తాయి. మీరు విన్నా నమ్మడం లేదు కదా. కానీ అక్కడికి వెళ్లాక మాత్రం మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇదొక ఆలయం.. అది కూడా మన కుక్కల కోసం. మన పెంపుడు శునకాలు పరవశించే పక్కా దేవాలయం ఇది. మన పెంపుడు ప్రాణులను తీసుకెళ్లి స్వయంగా ఆశీర్వాదాలు తీసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఇంతకు ఈ ఆలయం ఎక్కడ ఉంది? దీని స్పెషల్ ఏమిటో తెలుసుకుందాం.
ఇది కేరళలోని కన్నూర్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అరుదైన దేవాలయం. ఇది సాధారణంగా మనం చూసే ఆలయాల్లో ఒకటి కాదు. ఇక్కడ పూజలు, నైవేద్యాలు.. అన్నీ కుక్కల కోసమే. దేవుడే నాయిని అని భావించే స్థలమిది. కాళ్ళ దగ్గర కూర్చునే కుక్క, దేవునికి భక్తిగా తల వంచే దృశ్యాలు.. ఇక్కడ మనకు ఓ దివ్యమైన అనుభూతి ఇస్తాయి.
ఈ ఆలయం శ్రీ ముత్తప్పన్ కి అంకితం చేయబడింది. ముత్తప్పన్ ను ఇక్కడ శివుడి అవతారంగా భక్తులు భావిస్తారు. కానీ మిగతా శైవ ఆలయాల్లో కనిపించే విధంగా ఇతర నిబంధనలు, మత ఆచారాలే కాదు.. ఇక్కడ ఉన్నది ఆత్మీయత, ప్రేమ, పంచభూతాలతో కలసిన భావతరంగం. మూగజీవాల పట్ల కూడా భక్తి చూపించే సంప్రదాయం మన దేశంలో ఉంటుందని ఈ ఆలయం స్పష్టం చేస్తుంది.
Also Read: Hyderabad New Flyover 2025: హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్.. ఇక రైడింగ్ వేరే లెవెల్ బాస్!
ఇక్కడకు బెంగళూరు, ముంబయి, చెన్నై లాంటి ప్రదేశాల నుండి కూడా పెంపుడు శునకాలతో ఇక్కడికి యజమానులు వస్తారు. తమ పెంపుడు జంతువులకు శుభాశీస్సులు ఇవ్వాలనే భావనతో, ఒక మంచి శుభారంభం కోసం.. ముఖ్యంగా కొత్తగా Dog Adoptions చేసినప్పుడు, తమ కుక్క పుట్టినరోజున ఇది ఒక దివ్యమైన ప్రదేశంగా భావిస్తున్నారు.
అంతేకాదు, ఈ ఆలయం పరిసరాలు పూర్తిగా ప్రకృతి ఒడిలో ఉండడంతో, కుక్కలు సంతోషంగా తిరుగుతూ, ఎటు చూసినా పచ్చని దృశ్యాలు కనిపించడంతో, శునకాల ఆనందానికి అవధులు ఉండవు. ఈ ఆలయాన్ని దర్శించడం ఓ దివ్యమైన అనుభూతి అనే తరహాలో ఇక్కడ పెంపుడు కుక్కలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి.
ఈ ఆలయానికి వెళ్లే రోడ్డు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్న వారు కచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శిస్తే కలిగే అనుభూతి వేరు. అదిరిపోయే ఫోటోలు తీసుకునే అవకాశం, వీడియోస్ కోసం మంచి వ్యూ కూడా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో కుక్కల కోసం నీళ్లు, కూర్చునే చోట్లు, ట్రీట్‌లను అందించే స్టాల్స్ కూడా ఉన్నాయి. కొందరు స్వచ్ఛందంగా సేవ చేయడానికి కూడా అక్కడే ఉంటున్నారు.
ఈ దేవాలయం ఒక చిన్న స్ఫూర్తి. మూగజీవాల పట్ల మన ప్రేమను, భక్తిని, బాధ్యతను గుర్తుచేస్తుంది. మానవులు మాత్రమే కాదు, ప్రతి జీవిలోనూ భగవంతుడిని చూడాలనే భారతీయ భావనకు ఇది ప్రతీక. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే.. అక్కడ ఉన్న కుక్కల పట్ల ప్రేమ చూపించే స్థానికులు, ఆలయ కమిటీ చాలా గొప్ప పనులు చేస్తున్నారు.
సారాంశంగా చెప్పాలంటే, మీ దగ్గర కూడా ఒక పెంపుడు కుక్క ఉంటే, దానికి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకురావాలనుకుంటే, ఈ ఆలయం తప్పనిసరిగా చూడాల్సింది. కేవలం పూజలు చేయడానికి కాదు, ప్రేమను పంచుకోవడానికి, జీవరాశుల మధ్య ఉన్న బంధాన్ని గుర్తించడానికి ఇది ఓ పరిపూర్ణ స్థలం. మొత్తం మీద ఈ ఆలయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.