BigTV English
Advertisement

Nindu Noorella Saavasam Serial Today June 2nd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ ఈరోజు ఏపిసోడ్ 

Nindu Noorella Saavasam Serial Today June 2nd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ ఈరోజు ఏపిసోడ్ 

Nindu Noorella Saavasam Serial Today Episode : అంజు కనిపంచడం లేదని అమర్‌  ఫోన్‌ చేసి చెప్తుంది మిస్సమ్మ. అమర్‌ సీసీ కెమెరాలో చెక్ చేయమంటాడు. చేశానండి అంజు ఒక్కతే బయటకు వెళ్లడం ఉంది అని చెప్తుంది. దీంతో అమర్‌ కంగారుగా ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు ఇంట్లో పిల్లలు అనామిక అంజును వెతుకుతుంటారు. మిస్సమ్మ కంగారుపడుతుంది. అందరూ కంగారుపడుతుంటారు.  అనామిక గార్డెన్‌ లోకి వచ్చి గుప్త గారు అని పిలుస్తుంది. వెంటనే గుప్త వస్తాడు. గుప్త గారు ఎక్కడికి వెళ్లిపోయారు అని అడుగుతుంది. దీంతో గుప్త ఇచ్చటనే ఉన్నాను. ఏంటి నీ పిల్ల పిచ్చుక కనిపించడం లేదని కంగారు పడుతున్నావా..? అని అడుగుతాడు.


దీంతో అనామిక ఓ అయితే పక్కా సమాచారంతోనే వచ్చారా..? అయితే అంజు ఎక్కడికి వెళ్లింది.. అసలు ఏం జరుగుతుంది గుప్త గారు అని అడుగుతుంది. దీంతో ఆ పిల్ల పిచ్చుక చేరాల్సిన చోటికే చేరింది అని గుప్త చెప్తాడు. అంటే ఎక్కడికి వెళ్లింది అని అనామిక అడుగుతుంది. తన జన్మస్థానమునకు వెళ్లింది. నీవు ఎచ్చట నుంచి తీసుకువచ్చితివో అచ్చటికే వెళ్లింది అని గుప్త చెప్తాడు. కోల్‌కతా వెళ్లిందా..?అంటే రణవీర్‌ తీసుకెళ్లిపోయాడా..? అసలు ఏం జరుగుతుంది గుప్త గారు. అంజలి ఎందుకు రణవీర్‌తో కొల్‌ కతా వెళ్లింది అని అనామిక అడగడంతో కన్న తండ్రి స్వార్థమునకు కన్న తల్లి మోసమును బలి అయినది అని గుప్త చెప్పగానే.. ఏం మాట్లాడుతున్నారు మీరు.. వాళ్లిద్దరు అంజలిని ఏం చేయబోతున్నారు.. నా పాపకు ఏ ప్రమాదం లేదు కదా అని అడుగుతుంది. దీంతో గుప్త జరగబోయేది లలాట లికితం.. నువ్వెంత బాధపడిననూ జరగవలసినదే జరుగును. కన్న ప్రేమ ప్రాణములు కోరుతున్నది. పెంచిన ప్రేమ ప్రాణములను పణంగా పెట్టి అయిననూ ఆ పిల్లపిచ్చుకను కాపాడవలెనని చూచుతున్నది. ఈ వింత కథను చూసి ఏమి అనవలెనో తెలియటలేదు అంటాడు గుప్త.

మీ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది గుప్త గారు ఏం జరగబోతుంది. అంజుకు ఏం కాదని మాత్రం చెప్పండి ఫ్లీజ్‌ అని అడుగుతంది. దీంతో గుప్త ఏమియూ కాదు. సంతోషమేనా… అంటాడు గుప్త. అమ్మా చాలు అది చాలు గుప్త గారు నా అంజుకు ఏమీ కాకుండా ఉంటే అంతే చాలు. ఆయన వెళ్లి రణవీర్‌ను ఏం చేసైనా నా అంజును తీసుకొస్తారు అంటుంది. దీంతో గుప్త నవ్వుతాడు. ఏమైంది గుప్త గారు ఎందుకు నవ్వుతారు అని అడుగుతుంది. దీతో గుప్త జరగబోవునది ఎవరు తలచెదరు. తలచినది ఎటుల జరుగును అంటాడు. దీంతో అనామిక కంగారుగా ఫ్లీజ్‌ గుప్త గారు అసలేం జరగబోతుంది చెప్పండి అని అడుగుతుంది. దీంతో గుప్త నీ  పతి దేవుడు వెతుకుతూ వెళ్తున్న సమాధానములు అతగాడికి దొరుకును. అవి ఈ ఇంటి నుంచే వెళ్లును. సమస్య ఇచ్చటనే ఉన్నది. సమాధానం ఇచ్చటనే ఉన్నది. నీ పతి దేవునకు సమాధానం అర్థం అయిన రోజున సమస్యలన్నీయు తొలగిపోవును అని చెప్తాడు గుప్త.


దీంతో అనామిక మరి అది.. అంటూ ఏదో అడగబోతుంటే.. గుప్త కానీ ఆ దినము ఎప్పుడు వచ్చునో నేను చెప్పలేను. దగ్గరలో ఉన్నదని మాత్రం చెప్పగలను. బాలిక పౌర్ణమి నాడు నువ్వు ఈ దేహమును వదిలి శాశ్వతంగా నువ్వు ఇచ్చట నుంచి మా లోకమునకు వెళ్లినప్పుడు నీకు ఈ బాధ ఉండరాదనే ఈ నిజం చెప్పితిని జరగబోవునది వీక్షించుటకు వేచి ఉండుము అని చెప్పి గుప్త వెళ్లిపోతాడు. తర్వాత అనామిక, మిస్సమ్మ రూంలో ఉంటారు. మిస్సమ్మ బాధగా అసలే జరుగుతుంది అక్కా అంజు ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు. అంటూ కోపంగా టేబుల్‌ మీద కొడుతుంది.  ఫైల్స్‌ కింద పడతాయి. అందులోంచి రణవీర్‌ ఫోటో మిస్సమ్మ చూస్తుంది. అంజు మెడలో ఉన్న చైన్‌ లాంటిదే రణవీర్‌ మెడలో ఉండటం చూసి మిస్సమ్మ షాక్‌ అవుతుంది. అంజు రణవీర్ కూతురేమోనని అనుమానిస్తుంది. వెంటనే అమర్‌కు ఫోన్‌ చేసి అంజు రణవీర్‌ కన్న కూతురు అని చెప్తుంది. అమర్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో రణవీర్‌ అంజును తీసుకుని వస్తాడు. అమర్‌ ను చూసిన రణవీర్‌, అంజు షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

CM Revanth Reddy: కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Deepthi Manne: పెళ్లి పీటలు ఎక్కిన జగదాత్రి సీరియల్ నటి.. ఫోటోలు వైరల్!

Nagababu: మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. బాబాయ్ కల నెరవేర్చారుగా!

TV: పెళ్లైన 5 ఏళ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి.. ఎవరంటే?

Illu Illalu Pillalu Today Episode: నర్మదపై వేదవతి కోపం.. లంచం తీసుకుంటు దొరికిన నర్మద.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..

Brahmamudi Serial Today November 7th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని కొట్టిన రాహుల్‌ – వీడియో తీసిన రంజిత్‌   

Nindu Noorella Saavasam Serial Today November 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బెడిసికొట్టిన మనోహరి ప్లాన్‌  

GudiGantalu Today episode: ఘనంగా సుశీల బర్త్ డే వేడుక.. ప్రభావతి పై బాలు సెటైర్.. సుశీల సర్ప్రైజ్ గిఫ్ట్..

Big Stories

×