Spirit Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతిలో ఎప్పుడు అర డజను సినిమాలతో బిజీగా ఉంటాడు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నా కూడా ఒక్క సినిమాతో డార్లింగ్ థియేటర్లలోకి వస్తాడు. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, హను రాఘవపూడి కాంబీనేషన్ లో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్.. ఈ మూవీ షూటింగ్ మొదలువ్వలేదు కానీ ఈ మూవీ గురించి రోజుకో వార్త నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టోరీ లీక్ అయ్యిందని మరో న్యూస్ వినిపిస్తుంది.. ఇందులో అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజమేంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..
ఫ్యాష్ బ్యాక్ లో ఇలా కనిపిస్తున్నాడా..?
స్పిరిట్ మూవీలో డార్లింగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఆయనకు సంబందించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చేసాయి. ఇక డైరెక్టర్ వంగా కూడా ఈ పాత్ర గురించి రీవిల్ చేశాడు. అయితే తాజాగా ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ మరో పాత్రలో నటిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్.. స్పిరిట్ సెకండాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటూ ఎమోషనల్ సీక్వెన్స్ కూడా ఉంటాయని, దానికి తగ్గట్టే సెకండాఫ్ లో ప్రభాస్ క్యారెక్టర్ పై ఓ అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ను సందీప్ ప్లాన్ చేశాడని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ క్యారెక్టర్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఇదే కనుక నిజమైతే థియేటర్లు బద్దలవుతాయని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
స్పిరిట్ లో ఇద్దరు హీరోయిన్లా..?
ఇటీవల ఈ మూవీ హీరోయిన్ గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతుంది.. మొన్నటివరకు దీపికా పదుకొనే అని ప్రచారంలో ఉండగా.. ఆమె కండిషన్స్ వల్లే ఆమెను తప్పించినట్లు వంగా అన్నారు. అయితే ఆమె ఈ మూవీ స్టోరీని లీక్ చేసింది. ఇదంతా పక్కన పెడితే డార్లింగ్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యింది. త్వరలోనే సెట్స్ మీదకు సినిమా వెళ్ళబోతుందని సమాచారం. ఈ మూవీ కన్నా ముందు రెండు సినిమాలు పూర్తి అవ్వాలి. ముందు ఆ సినిమాల పైనే డార్లింగ్ ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది. స్పిరిట్ తర్వాత కల్కి 2, సలార్ 2 సినిమాల్లో నటించనున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాక్.. అలాగే హాలీవుడ్ లో మూవీ ఆఫర్స్ డార్లింగ్ కు వస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రభాస్ సినిమాల లైనప్ మాములుగా లేదు.