E-Paper
Advertisement

OTT Movie : కొడుకు చచ్చాక అనుకోకుండా ఇంటికొచ్చే అతిథులు… హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే మావా

OTT Movie : కొడుకు చచ్చాక అనుకోకుండా ఇంటికొచ్చే అతిథులు… హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే మావా
Advertisement

OTT Movie : బ్లాక్ మ్యాజిక్ థీమ్‌ పై వచ్చే సినిమాలలో ఒళ్ళు జలదరించే సీన్స్ ఉంటాయి. ఇటువంటి సినిమాలు ఇచ్చే కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఇదే జానర్ లో వచ్చింది. ఇందులో కొన్ని సన్నివేశాలు వెన్నులో వణుకుపుట్టించే విధంగా ఉంటాయి. ఒంటరిగా ఈ హారర్ సినిమాను చూస్తే అంతే సంగతులు. ఎవరినైనా తోడు పెట్టుకుని ఈ సినిమాను చూడటమే బెట్టర్. ఈ హారర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

హిజ్రాన్, అడ్నాన్ అనే దంపతులకు బిరోల్ అనే రెండేళ్ల కొడుకు ఉంటాడు. ఈ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్న సమయంలో, బిరోల్ ఒక ప్రమాదంలో అనుమానస్పదంగా చనిపోతాడు. ఈ సంఘటనతో సంతోషకరమైన వీళ్ళ జీవితం ఛిన్నాభిన్నం అవుతుంది. ఆ తర్వాత అడ్నాన్ తన భార్య హిజ్రాన్‌తో దూరంగా ఉంటాడు. కొడుకు మరణానికి ఆమెను నిందిస్తాడు. నీవల్లే నా కొడుకు చానిపోయాడని బాధపడతాడు. ఇక హిజ్రాన్ తన కొడుకు మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. తన గతంలో జరిగిన విషయాలను ఆరా తీస్తుండగా, ఈ కుటుంబంలోని చీకటి రహస్యాలు, బ్లాక్ మ్యాజిక్‌తో సంబంధం ఉన్న కొన్ని భయంకరమైన విషయాలు తెలుస్తాయి.

ఈ క్రమంలో ఆమె ఒక పాడుబడిన ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒకప్పుడు ఈ ఫ్యామిలీ నివాసం ఉండేది. ఇప్పుడు అక్కడ ఆమె సూపర్‌ నాచురల్ శక్తులతో సంబంధం ఉన్న భయంకరమైన అనుభవాలను ఎదుర్కొంటుంది. అక్కడ కొన్ని ఆత్మలు ఈమెను వెంబడిస్తాయి. అందులో ఇరవై సంవత్సరాల తరువాత క్రితం చనిపోయిన మహిళ ఆత్మ తిరిగి వస్తుంది.  కథ ముందుకు సాగే కొద్దీ, హిజ్రాన్‌ తన కొడుకు మరణం వెనుక ఉన్న ఒక శాపం, దాని వెనక ఉన్న షాకింగ్ విషయాలను తెలుసుకుంటుంది. చివరికి బిరోల్ చావుకు కారణం ఎవరు ? తన కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకుంటుందా ? అతనికి ఉన్న శాపం ఏమిటి ? అతనిపై బ్లాక్ మ్యాజిక్‌ ప్రయోగం జరిగిందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ టర్కిష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : ఆటోలో అమ్మాయిలను అనుభవించి చంపే సైకో… ఫ్యామిలీతో ఈ సినిమాను చూస్తే అంతే సంగతులు

 

యూట్యూబ్ (Youtube) లో

ఈ టర్కిష్ సూపర్‌ నాచురల్ హారర్ సినిమా పేరు ‘Siccin 2’ 2015 లో విడుదలైన ఈ సినిమాకి అల్పర్ మెస్టి దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ బ్లాక్ మ్యాజిక్ థీమ్‌ పై నడుస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ (Youtube), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లలో ఈ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×