E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today March 31st : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మీనన్‌ కు హెల్ప్‌ చేసిన మనోహరి – మినిస్టర్ ను చంపబోయిన మీనన్‌

Nindu Noorella Saavasam Serial Today March 31st : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మీనన్‌ కు హెల్ప్‌ చేసిన మనోహరి – మినిస్టర్ ను చంపబోయిన మీనన్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  అంజు తన పర్మామెన్స్‌ ఆదరగొడుతుంది. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు మనోహరి చెప్పిన మ్యాన్‌ హోల్‌ నుంచి లోపలికి వస్తుంటాడు మీనన్‌. మరోవైపు అమర్‌ అనుమానాస్పదంగా అంతా చెక్‌ చేస్తూ ప్రిన్సిపాల్‌ చెప్పిన మ్యాన్‌ హోల్‌ గురించి గుర్తు చేసుకుని అక్కడికి వెళ్తుంటాడు. ఇంతలో మనోహరి అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ను కర్రతో కొట్టి చంపాలనుకుని వెళ్తుంది. అమర్‌ రావడం చూసి అక్కడి నుంచి పారిపోతుంది. అమర్‌ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి ఎవరైనా వచ్చారా ఇక్కడికి అని అడుగుతాడు. రాలేదని కానిస్టేబుల్‌ చెప్పగానే.. ఇక్కడ ఇంకేమైనా రూట్స్‌ ఉన్నాయా..? అని అడుగుతాడు. లేవని కానిస్టేబుల్‌ చెప్పగానే.. చుట్టు పక్కల ఎవరైనా తిరుగుతున్న అలికిడి వినిపిస్తుందా..? అని అడుగుతాడు. అలాంటిదేం లేదు సార్‌ అని  కానిస్టేబుల్‌ చెప్పగానే.. ఓకే టేక్‌ కేర్‌ అంటూ అమర్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇంతలో మనోహరి వచ్చి కానిస్టేబుల్‌ ను కర్రతో తల మీద కొట్టగానే కానిస్టేబుల్‌ స్పృహ తప్పి పడిపోతాడు. వెంటనే మనోహరి మ్యాన్‌ హోల్‌  తెరచి మీనన్‌ వాళ్లను స్కూల్‌ లోకి వచ్చేలా చేస్తుంది. మీనన్‌ బయటకు రాగానే.. అమర్‌కు అనుమానం వచ్చినట్టు ఉంది కదా అని అడుగుతాడు. మనోహరి అవును ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం పదండి అంటూ ఆడిటోరియం ఎదురుగా తీసుకెళ్లి అదిగో అదే అడిటోరియం ఇప్పుడే మినిస్టర్‌ అక్కడికి వెళ్లాడు. అని చెప్తుంది. దీంతో మీనన్‌ థాంక్స్‌ మిత్రమా ఆపదలో వచ్చి ఆదుకున్నావు అంటాడు. దీంతో  మనోహరి డబ్బులు ఇవ్వాలని మర్చిపోకు అంటుంది. నీకు చెప్పిన అమౌంట్‌ నీకు చేరుతుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లొచ్చు..ఇక మేము చూసుకుంటాం అంటాడు.

Advertisement

దీంతో మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతూ.. అవును మీరు అటాక్‌ చేస్తుంది. మీకు కావాల్సిన మనుషుల్ని జైలు నుంచి విడిపించుకోవడానికే కదా..? అని అడుగుతుంది. మీనన్‌ అవును అని చెప్తాడు. ఇప్పుడు ఆడిటోరియం మీ కంట్రోల్‌ లోకి తీసుకున్నాక మీరు ఎవరినైనా కావాలంటే చంపేయవచ్చా అని అడుగుతుంది. దీంతో మీనన్‌ నువ్వు ఎవరి చావు కోరుకుంటున్నావో చెప్పు చాలు అంటాడు. భాగీ.. అమరేంద్ర భార్య అది మీ అటాక్‌లో చనిపోవాలి. అని చెప్తుంది మనోహరి. దీంతో మీనన్‌ పెద్దతలకాయే అంటాడు. దీంతో మనోహరి నువ్వు వాళ్లను కంట్రోల్‌ లోకి తీసుకున్నంత మాత్రాన అమర్‌ నీ మాట వింటాడన్న గ్యారంటీ లేదు.

అదే నువ్వు అమర్‌ భార్యను చంపితే ఆ తర్వాత పిల్లలను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడు. అని మనోహరి చెప్పగానే.. మీనన్‌ సరే ప్లాన్‌ బాగానే ఉంది. నా పని కాగానే నీ పని చేస్తాను అనగానే.. మనోహరి ఆ అమ్మాయి ఎవరో నీకు చూపిస్తాను. ఆడిటోరియంలోకి వెళ్లే మార్గం కూడా చూపిస్తాను. అని  మనోమరి మీనన్‌ వాళ్లను తీసుకుని  ఆడిటోరియం వైపు వెళ్తుంది. ఆడిటోరియం దగ్గరకు వెళ్లిన మీనన్‌ స్టేజీ మీదకు వెళ్లి మినిస్టర్‌ కు గన్‌ ఎయిమ్‌ చేస్తాడు. అడ్డొచ్చిన మినిస్టర్‌ సెక్యూరిటీని కాల్చేస్తాడు.  వెంటనే అమరేంద్ర  గారి భార్య గారు ఒక్కసారి పైకి రండమ్మా అని పిలుస్తాడు. బయటి నుంచి అమర్‌ పరుగెత్తుకొస్తుంటాడు. స్టేజీ మీదకు వచ్చిన మిస్సమ్మను అమ్మా నువ్వు మొండోడిని పెళ్లి చేసుకున్నావు.. అతని వల్ల నీ ప్రాణాలు పోతున్నాయి. హ్యాపీ జర్నీ భాగీ అంటూ మిస్సమ్మను కాల్చబోతుంటే.. అమర్‌ పరుగెత్తుకొస్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Advertisement

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×