OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చే హారర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హారర్ తో పాటు కామెడీ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఓ పక్క భయపెడుతూ, మరో పక్కన నవ్విస్తూ ఉంటుంది. ఈ మూవీ చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఒక ఏలియన్ తో ప్రెగ్నెంట్ అయ్యే అమ్మాయి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘స్నాచర్స్’ (Snatchers). ఈ మూవీకి స్టీఫెన్ సీడర్స్, బెంజీ క్లీమన్ కలసి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక టీనేజ్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన మొదటి అనుభవం తర్వాత అనూహ్యంగా ఒక ఏలియన్‌తో గర్భవతి అవుతుంది. ఆతరువాత స్టోరీ ఎక్కడికో తీసుకెళ్తుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సారా అనే ఒక హైస్కూల్ విద్యార్థిని, రిచ్ లైఫ్ పై ఆసక్తి ఉన్న అమ్మాయి. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ స్కైలర్ తో మొదటిసారి కన్యత్వం కోల్పోతుంది. అంతకు ముందే స్కైలర్ మెక్సికోలో వేసవి సెలవుల్లో ఒక ఏలియన్ బగ్‌ను కలసి ఉంటాడు. ఆతరువాత అది అతని శరీరంలోకి ప్రవేశిస్తుంది. సారా అతనితో ఒక రాత్రి గడిపిన తర్వాత, మరుసటి రోజు ఉదయం ఆమె తన గర్భం తొమ్మిది నెలల స్థితిలో ఉన్నట్లు గమనిస్తుంది. ఈ విచిత్రమైన పరిస్థితిని ఎవరికీ తెలియకుండా దాచాలని సారా నిర్ణయించుకుంటుంది. ఇందుకు ఆమె తన పాత స్నేహితురాలు హేలీ సహాయం కోరుతుంది, ఆమె ఒకప్పుడు సారా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండేది. వాళ్ళిద్దరూ కలసి ఒక క్లినిక్‌కి వెళ్తారు. అక్కడ సారా ఒక భయంకరమైన ఏలియన్ జీవిని ప్రసవిస్తుంది. అయితే అది పుట్టిన వెంటనే, అక్కడ ఉన్నవాళ్ళపై దాడి చేస్తుంది. క్లినిక్‌లోని వైద్యులను చంపి, ఊరిలోకి పారిపోతుంది.
ఈ ఏలియన్ జీవి మనుషులపై దాడి చేసి, వారిని నియంత్రిస్తూ, హత్యలు చేస్తూ ఉంటుంది. సారా, హేలీ కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అది అంత తేలికగా అయ్యే పని కాకపోవడంతో ఆలోచనలో పడతారు. ఈ క్రమంలో సారా తల్లి కేట్ ఈ జీవికి బలైపోతుంది. మరోవైపు స్కైలర్ పరిస్థితి మరింత క్రిటికల్ గా మారుతుంది. అదే సమయంలో సారాకు మళ్లీ గర్భం వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది వారిని ఇంకా భయపెడుతుంది. వారు తమను తాము కాపాడుకుంటూ, ప్రపంచాన్ని కూడాఅ కాపాడుకోవడానికి అసాధారణ శక్తిని ప్రదర్శిస్తారు. చివరికి వాళ్ళు ఆ వింత జీవిని అంతం చేస్తారా ? లేక దాని చేతిలోనే బలైపోతారా ? స్కైలర్ పరిస్తితి ఏమౌతుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.