BigTV English

Nindu Noorella Saavasam Serial Today October 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోరాకు వార్నింగ్‌ ఇచ్చిన గుప్త – అమర్‌కు తెలిసిపోయిన మను నిజస్వరూపం   

Nindu Noorella Saavasam Serial Today October 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఘోరాకు వార్నింగ్‌ ఇచ్చిన గుప్త – అమర్‌కు తెలిసిపోయిన మను నిజస్వరూపం   

Nindu Noorella Saavasam Serial Today Episode :  స్కూల్ లో జాబ్ చేస్తేనే నాకు సంతోషంగా ఉంటుందని రామ్మూర్తి పిల్లలకు చెప్తాడు. కానీ ఈ విషయం మీరు ఎవ్వరికీ చెప్పోద్దని పిల్లలను రిక్వెస్ట్‌ చేస్తాడు. జాబ్‌ చేస్తేనే మీరు హ్యాపీగా ఉంటారంటే మేము ఎవరికి చెప్పమని అంటారు. అందరం కలిసి లంచ్‌ చేద్దామని తినబోతుంటే ప్రిన్సిపాల్ వచ్చి రామ్మూర్తిని పిలుస్తుంది. అక్కడ టిఫిన్‌ క్యారియర్‌ ఉందని కడగమని చెప్తుంది. రామ్మూర్తి వెళ్లి వాటిని కడుగుతుంటాడు. పిల్లలు భోజనం చేయకుండా రామ్మూర్తి కోసం ఎదురుచూస్తుంటారు.


తాతయ్యా ఇంకా రావడం లేదేంటి అని వెళ్లి చూస్తారు. రామ్మూర్తి క్యారియర్‌ కడగడం చూసి బాధపడతారు. మీరేంటి తాతయ్యా ఈ పనులు చేస్తున్నారు అని అడుగుతాడు. అసలు ప్రిన్సిపాల్ సంగతి చూద్దాం పదండి అంటూ నలుగురు పిల్లలు వెళ్తుంటే రామ్మూర్తి వారిని ఆపి.. ఈ పనులు నేను చేస్తానని చెప్పానని అనడంతో అయితే నువ్వు పక్కకు కూర్చో మొత్తం మేము కడిగేస్తాము అని పిల్లలు కడుగుతారు.

సీసాలో బంధించిన ఆరును పూజలో పెట్టి మంత్రాలు చదువుతుంటాడు ఘోర. ఏవేవో శక్తులు ఘోరకు ఆవాహనం అవుతుంటాయి. ఇంతలో అక్కడికి గుప్త వస్తాడు. సీసాలో బంధీగా ఉన్న ఆరును చూసి బాధపడతాడు.  ఆ ఇంట్లో మహారాణిలా ఉన్న నువ్వు ఇక్కడ బందీగా ఉంటే చూడలేకపోతున్నాను అని మనసులో అనుకుని గట్టిగా ఘోరా అని పిలుస్తాడు. ఉలిక్కిపడిన ఘోర ఎవరు అంటూ పిలుస్తాడు. గుప్త కనిపించగానే ఓ గుప్తుల వారా? ఎలా ఉన్నారు.. అంటూ వెటకారంగా పలకరిస్తాడు. దీంతో గుప్త కోపంగా మాతో పరిహాసం ఆడుటా.. నీకు శ్రేయస్కరం కాదు ఘోర అని హెచ్చరిస్తాడు.


ఘోర…  అయ్యో నేను మీ పని తగ్గించాను కదా గుప్త గారు. మీరిప్పుడు ఎంచక్కా యమపురికి వెళ్లిపోవచ్చు. ఇక వెంటనే వెళ్లిపోండి అంటాడు. దీంతో గుప్త నేను భూలోకము నుంచి మా లోకమునకు వెళ్లుట ఈ బాలికతోనే జరగును అంటాడు. అయితే మీరిక మాతో పాటు ఈ భూలోకంలోనే ఉండటం ఖాయం అంటాడు ఘోర.  దీంతో మరింత కోపంగా ఘోర తప్పిదముల మీద తప్పిదములు చేయుచున్నావు ఘోర. ఇక చాలింపుము ఇకనైనను నీవు పొందిన శక్తులను సరియైన మార్గమున వినియోగించుము. నీవు చేసిన పాపములు కొన్ని అయినా హరించును అంటూ గుప్త హెచ్చరించడంతో…

ఘోర మరింత కోపంగా నేను ఈ పూజలు చేస్తున్నదే చావకుండా చిరంజీవిగా ఉండుట కొరకే మరి నేను ఎందుకు నరకానికి వస్తాను అంటాడు. సృష్టి ధర్మమునకు ఎదురెళ్లుతున్నావు ఘోర. తపస్సుతోనే రానిది నీ లాంట తప్పిదాలు చేసేవాళ్లకు ఎలా వస్తుందనుకున్నావు అంటాడు గుప్త. దీంతో మీ మాటలు ఇక చాలించి వచ్చిన దారిన వెళ్లండి నేను కొత్త చరిత్రను లిఖించబోతున్నాను అంటాడు. గుప్త అక్కడి నుంచి వెళ్లిపోతాడు. గుప్త ఏదో ఒకటి చేసేలోపు నేను ఈ ఆత్మను వశపరుచుకోవాలి దేవా అంటాడు ఘోర.

రాథోడ్‌ లాప్ టాప్‌ తీసుకుని కంగారుగా పరుగెత్తుకొస్తాడు. సార్‌.. మిస్సమ్మ అంటూ అందరినీ పిలుస్తాడు. అందరూ హాల్లోకి వస్తారు. వెంటనే సార్‌ ఈ వీడియో చూడండి అంటూ లాప్‌ టాప్ ఓపెన్‌ చేసి వీడియో సీసీటీవీ పుటేజీ వీడియో ఆన్‌ చేసి మనోహరి వైపు అనుమానంగా చూస్తుంటాడు. దీంతో మనోహరి భయంగా వీడేంటి నన్ను ఇలా చూస్తున్నాడు. నేను భాగీతో మాట్లాడింది ఏమైనా విన్నాడా? అని మనసులో అనుకుంటుంది. ఇంతలో సీసీటీవీలో ఘోర అమర్‌ ఇంట్లోకి వచ్చిన వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియో చూసి అందరూ షాక్‌ అవుతారు.

ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్లింది చూసి వెనక సైడు సీసీటీవీ పని చేయలేదు సార్‌ లేదంటే వాడు ఎక్కడికి వెళ్లింది తెలిసేది అంటాడు రాథోడ్‌. రాథోడ్‌ మాటలకు మనోహరి ఊపిరి పీల్చుకుని రిలీఫ్‌ అవుతుంది. అదేంటి అమర్‌ అతను నా కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి ఏం చేస్తున్నాడు అంటుంది మనోహరి. దీంతో అప్పుడు మీరు రూంలో లేరా మనోహరి గారు. చూస్తుంటే మిమ్మల్ని కలవడానికే వచ్చినట్టు ఉంది అని మిస్సమ్మ అడుగుతుంది. దీంతో మనోహరి కోపంగా ఏయ్‌ నాకు వాడితో ఏం పని ఉంటుంది. నేను అప్పుడు రూంలోనే లేను. లేదంటే వాణ్ని చూసిన వెంటనే అమర్‌కు చెప్పి వాడి అంతు చూసేవాళ్లం కదా? అంటుంది.

ఇంతలో అమర్‌ వాడు చాలా సేపటి వరకు తిరిగి రాలేదంటే వాడు అంత సేపు మన ఇంట్లోనే ఉన్నాడు అంటాడు దీంతో అందరూ భయపడిపోతారు. వాణ్ని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది నాన్నా. ఇలాంటి వాళ్ల కళ్లు మన ఇంటి మీద పడకూడదు అంటుంది నిర్మల. మీరేం భయపడకండి అత్తయ్యా ఆయన అన్ని చూసుకుంటారు అని నిర్మల వాళ్లకు ధైర్యం చెప్తుంది మిస్సమ్మ. అవున మనోహరి ఆ బ్యాక్‌ డోర్‌ నీ రూంకి దగ్గరగానే ఉంటుంది కదా? వాడు అక్కడ తిరిగినప్పుడు నీకు అలికిడి కానీ అనుమానం కానీ రాలేదా? అని అమర్‌ అడుగుతాడు.

లేదని మనోహరి భయంగా చెప్తుంది. ఆ విషయం చెప్పడానికి ఎందుకు అంత భయం మనోహరి గారు అని మిస్సమ్మ అడుగుతుంది. దీంతో వాడు మళ్లీ నన్ను కిడ్నాప్‌ చేయడానికి వచ్చాడేమోనని భయంగా ఉందని చెప్తుంది మనోహరి. ఘోర సీసా పట్టుకుని రిటర్న్‌ వెళ్తున్న వీడియో ప్లే అవుతుంది. దీంతో అమర్‌ కోపంగా వాణ్ని పట్టుకుని తంతే ఎందుకు వచ్చాడు. ఏం తీసుకెళ్లాడు అన్న విషయం తెలుస్తుంది అంటాడు అమర్‌. ఆ పనేదో త్వరగా చేయ్‌ నాన్నా అని నిర్మల చెప్తుంది.

స్కూల్‌ లో రామ్మూర్తిని పిలిచిన ప్రిన్సిపాల్‌ తన కారు నీట్‌గా లేదని క్లీన్‌ చేయమని చెప్తుంది. అలాగేనని రామ్మూర్తి కారు తుడుస్తుంటాడు. దూరం నుంచి అది మొత్తం గమనిస్తున్న పిల్లలు ప్రిన్సిపాల్‌ అతు చూద్దామని వెళ్లబోతుంటే అంజు వాళ్లను ఆపి.. పక్కకు వెళ్లి ఫోన్‌ తీసుకొచ్చి రామ్మూర్తి కారు తుడవడాన్ని వీడియో తీస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big Stories

×