E-Paper
Advertisement

Indian Railways: దేశంలోనే అతి చిన్న రైల్వే ప్లాట్‌ఫామ్.. ఇక్కడ రైలు ఎక్కాలంటే తిప్పలే, మరి పొడవైనది ఎక్కడుంది?

Indian Railways: దేశంలోనే అతి చిన్న రైల్వే ప్లాట్‌ఫామ్.. ఇక్కడ రైలు ఎక్కాలంటే తిప్పలే, మరి పొడవైనది ఎక్కడుంది?
Advertisement

Indian Railway Platforms: భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి రోజు సుమారు మూడు కోట్లకు పైగా మంది రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. భారతీయ రైల్వేలు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే స్టేషన్ కు వెళ్లగానే మనం చూసేది రైల్వే ఫ్లాట్ ఫారమ్. ఇప్పుడు మనం దేశంలోనే అతి పెద్ద, అతి చిన్న రైల్వే ఫ్లాట్ ఫారమ్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం..

దేశంలో అతి చిన్న రైల్వే ప్లాట్‌ ఫారమ్

Advertisement

భారత్ లో అతి చిన్న ఫ్లాట్ ఫారమ్ ఉన్న రైల్వే స్టేషన్ గా బాన్స్ పానీ రైల్వే స్టేషన్ గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఒడిషాలోని కియోంజర్ జిల్లా జోడా మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఒకే ఒక్క ఫ్లాట్ ఫారమ్ ఉంటుంది. అదీ కేవలం 200 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడ పెద్ద ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగవు. పరిమిత సంఖ్యలో ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి. ఈ రైల్వే స్టేషన్ కు ఎక్కువగా ఖనిజాల రవాణాకు ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో ఇనుప ఖనిజం ఫుష్కలంగా లభిస్తుంది. ముడి ఇనుప ఖనిజంతో పాటు సరుకు రవాణాలో బాన్స్ పానీ రైల్వే స్టేషన్  కీలక పాత్ర పోషిస్తున్నది.

దేశంలో అతి పెద్ద రైల్వే ప్లాట్‌ ఫారమ్

Advertisement

ఇప్పుడు దేశంలో అతి పొడవైన ఫ్లాట్ ఫారమ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్. దీని పూర్తి పేరు శ్రీ సిద్ధారూఢ స్వామిజీ స్టేషన్‌. ఇది దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పొడవైన ఫ్లాట్ ఫారమ్ ఉన్న రైల్వే స్టేషన్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం 8 రైల్వే ఫ్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. వీటిలో 8వ ఫ్లాట్ ఫారమ్ పొడవు ఏకంగా 1,507 మీటర్లు ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫారమ్ ను పెద్ద సరుకు రవాణా రైళ్ల కోసం ఏర్పాటు చేశారు. హుబ్లీ స్టేషన్ కర్నాటకలోని ప్రధానమైన జంక్షన్. ఇక్కడి నుంచి బెంగళూరు, హోస్‌ పేట, గోవా, బెలగావి వైపు రైల్వే మార్గాలు ఉన్నాయి. ఉత్తర కర్ణాటకలో ఉన్న ఈ జిల్లా వ్యాపార కేంద్రంగా కొనసాగుతోంది. కర్నాటకలో తయారైన ఉత్పత్తులను ఇక్కడి నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన వస్తువులను ఇక్కడ దిగుమతి చేసుకుంటారు.

మొత్తంగా అతి చిన్న రైల్వే ఫ్లాట్ ఫారమ్ ఉన్న రైల్వే స్టేషన్, అతి పొడవైన రైల్వే ఫ్లాట్ ఫారమ్ ఉన్న రైల్వే స్టేషన్ ఖనిజాలు, ఉత్పత్తుల రవాణాకు కేంద్ర బిందువులుగా కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందిస్తున్నాయి.

Related News

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

Big Stories

Advertisement
×