E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ మాట విన్న నారాయణ షాక్..చక్రీ పై మహా సీరియస్.. మాధవ్ పెళ్లి క్యాన్సిల్..

Podarillu Today Episode : మాధవ్ మాట విన్న నారాయణ షాక్..చక్రీ పై మహా సీరియస్.. మాధవ్ పెళ్లి క్యాన్సిల్..
Advertisement

Podarillu Today Episode April 8th : మహాకు హారిక ఫోన్ చేస్తుంది. నీకు మా ఫ్రెండ్ నెంబర్ ఇచ్చాను కదా అక్కడికి వెళ్ళమని చెప్పాను కదా మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని హారిక అడుగుతుంది. ఇంట్లో నేను చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయి అవేం తర్వాత నేను వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి అంటుంది.. కానీ హారిక మాత్రం ఆ ఇంటిని చక్కదిద్దాల్సిన అవసరం నీకు లేదు కదా.. ఒకప్పుడు నాకు లేదు కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళతో ఉన్న తర్వాత నాకు ఆ ఫీలింగ్ కలిగింది. వీళ్ళు నన్ను అంత బాగా చూసుకున్నారు అని అంటుంది. మన ఇంట్లో కన్నా నాకు ఇక్కడే బాగా సేఫ్ గా అనిపిస్తుంది. ఇక సరే అని మహాలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. హారిక ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది అని అనుకుంటుంది.. అందరూ కలిసి భోజనం చేస్తారు.

మాధవ్ మాటలకు నారాయణ షాక్.. 

బయట నారాయణకు భోజనం ఇవ్వడానికి వచ్చిన మాధవకు జ్యోతి ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకుంటుంది.. ఇక మాధవ్ అమ్మాయితో మాట్లాడుతుండగా అని అంటాడు. భోజనం చేసావా? మీరు చేశారా మీ ఫ్యామిలీ చేశారా అని అడగడం చూసి షాక్ అవుతాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా మాధవ్ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని అనుకుంటారు.. మీరు వాడు మాట్లాడేది వింటే కచ్చితంగా షాక్ అయిపోతారు. వాడి జనరేషన్లో పుట్టాల్సిన వాడు కాదు భోజనం చేశారా అంటూ మాట్లాడుతున్నారు అని నారాయణ అంటాడు. అన్నయ్య ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని అందరూ ముందుకు వెళ్తుంటే మహాలక్ష్మి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు లోపలికి వెళ్ళండి అని మహాలక్ష్మి అంటుంది.

 జ్యోతికి మైండ్ బ్లాక్.. 

Advertisement

వెళ్ళిన మాధవ్తో జ్యోతి మాట్లాడాలని అనుకుంటుంది. మాధవ్ కి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.. తాపీ మేస్త్రి ఏం చేస్తారు? సైట్ లో పని చేస్తారు అని అంటాడు.. ఇవాళ నాకు వీక్ ఆఫ్ నేను మీతో మాట్లాడాలి అని అనుకున్నాను అని జ్యోతి అంటుంది.. మామూలుగా అయితే గోల్డ్ షాప్ కి వెళ్తే అక్కడ ఉన్న బంగారాన్ని చూపిస్తూ బొమ్మలాగా నిలుచువాలి.. కానీ ఇవాళ మాత్రం నాకు నచ్చినట్లుగా నైట్ డ్రెస్ వేసుకొని చాలా హ్యాపీగా ఉంటాను అని అనగానే మాధవ్ గాయత్రీ ని గుర్తు చేసుకుంటాడు. జ్యోతి అతని మాట తీరని చూసి నేనంటే మీకు ఇష్టం లేదా మీరు ఆల్రెడీ గతంలో ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది.. పర్లేదు ఈ రోజుల్లో ఇవన్నీ కామనే అని అడుగుతుంది కానీ మాధవ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తాడు..

మాధవ్ పెళ్లి సంబంధం క్యాన్సిల్.. 

మహాలక్ష్మితో మాట్లాడటానికి జ్యోతి ఫోన్ చేస్తుంది.. అయితే అందరూ మధ్యాహ్నం కలిసి కూర్చుని తినాలని అనుకుంటారు అప్పుడే నారాయణ వచ్చి మహాలక్ష్మి కోసం చికెన్ 65 తెచ్చి ఇస్తాడు.. అప్పుడే మాధవ్ కి చూసిన సంబంధం అమ్మాయి జ్యోతి ఫోన్ చేస్తుంది.. మాధవ్ గారి మనసులో వేరే వాళ్ళు ఉన్నారని అర్థమవుతుంది. ఆయన మాట తీరును చూస్తే నాకు మాట్లాడాలి అని అనిపించడం కూడా లేదు అని అంటారు.. నాకు నన్ను ఇష్టపడే అబ్బాయి రావాలని కోరుకున్నాను కానీ ఇలా బలవంతంగా మాట్లాడాలి అని అనుకునే వాళ్ళు నాకొద్దు సారీ అని చెప్పేస్తుంది.

అబద్దం చెప్పిన మాధవ్..

Advertisement

మాధవ్ ఇంటికి రాగానే చక్రి మనం పెళ్లి సంబంధం చూసినా అమ్మాయి ఫోన్ చేసిందా అన్నయ్య అని అడుగుతాడు. కానీ ఆరో మాత్రం ఫోన్ చేయలేదని చెప్పగానే మళ్లీ వచ్చిన తర్వాత కేశవ అడుగుతాడు. అమ్మాయి ఫోన్ చేసిందా అని అడిగితే చేసింది అని అంటాడు. చెప్పండి చెప్పండి అంటే ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి అని మాధవ్ అంటాడు. నీ మనసులో నుంచి ఆ గాయత్రి ని ఇంకా తీసేయలేదు నువ్వు. ఇంక నువ్వు ఇలానే ఉంటావా మా కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటావా నీ గురించి ఆలోచించవా అని అందరూ కూడా మాధవిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. ఏంటి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది అని మాధవ్ అంటాడు.. మహాలక్ష్మి కంటే ఇది కొత్త మనకేం కొత్త కాదు కదరా ఎందుకు మీరందరూ బాధపడుతున్నారు అని బాధ అంటాడు.

మహాను కలిసిన గాయత్రి..

గాయత్రి అలాగే తాయారు ఇద్దరు కూడా గుడికి పూజ కోసమని వస్తారు. బయట మహాలక్ష్మి కనిపించడంతో గాయత్రి అక్కడికి వెళ్లి మహాలక్ష్మి తో మాట్లాడుతుంది. నేను పిరికి వాళ్ళతో మాట్లాడను అని మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే గాయత్రి మాత్రం వినకుండా తనతో మాట్లాడాలి అని అనుకుంటుంది. బావ నా గురించి ఆలోచిస్తున్నాడా ఇంకా మర్చిపోలేకపోతున్నాడా అని అడుగుతుంది. మర్చిపోలేక పోతున్నాడు కాబట్టే మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వచ్చాము అని మహాలక్ష్మి అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన తాయారు నా కూతురుతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. నేనేమీ మీ కూతురుతో మాట్లాడలేదు గుడి కోసం వచ్చాను అని అనగానే తాయారు దిమ్మ తిరిగిపోయేలా మహాలక్ష్మికి క్లాస్ పీకుతుంది. కానీ తయారుకు ఎక్కడ తగ్గకుండా మహాలక్ష్మి మాటకు మాట సమాధానం చెబుతుంది. నీకు ఎంత పొగరే అని తాయారు అంటే నేను అదేంటో చూపిస్తాను అని మహాలక్ష్మి అంటుంది.

మాధవ్ తో మాట్లాడటానికి వచ్చిన గాయత్రి..

రాత్రి వంట చేసేందుకు మాధవికి సాయం చేయాలని మహాలక్ష్మి అనుకుంటుంది.. అయితే మహాలక్ష్మి ఉల్లిపాయలు వేయడంతో కన్నీళ్లు రావడంతో అందరూ కూడా మహాలక్ష్మి ఏడుస్తుంది ఏంటి? అని అనుకుంటారు. ఇక వీళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే వెనుక గుమ్మం నుంచి గాయత్రి లోపలికి వస్తుంది. నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా మళ్లీ ఎందుకు వచ్చావు అని గాయత్రిని బాధపడేలా తిడతారు. అయితే నారాయణ వచ్చి నువ్వు మా ఇంటికి వస్తే మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో నాకు బాగా తెలుసు అని అక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. ఇక తర్వాత మా గాయత్రి అక్కడినుంచి వెళ్ళిపోతుంది మాధవ్ బాధపడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episode: రామారాజుకు దిమ్మతిరిగే షాక్.. ప్రేమకు ధీరజ్ స్ట్రాంగ్ వార్నింగ్.. చందును చంపేందుకు సేన కుట్ర..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×