Satyabhama Today Episode November 13 th : నిన్నటీ ఎపిసోడ్ లో.. మహాదేవయ్య, చక్రవర్తి మాట్లాడుకుంటుంటే సత్య వెళ్తుంది. అప్పుడే చక్రవర్తి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సత్య వెళ్లి ఏంటో సీక్రెట్ గా మాట్లాడుతున్నారు. అది కూడా మనుషులను పెట్టి అని అంటుంది. ఆస్తి విషయాలు మాట్లాడుకుంటాం.. అన్నా తమ్ముళ్ల మధ్య సవాలక్ష ఉంటాయి అంటాడు. దానికి సత్య అవును అని అంటుంది. క్రిష్ నచ్చ చెప్పినట్లు వినలేదు. ఇక కథ ఎక్కడ మొదలైందో అక్కడే తెలుసుకుంటాను. ఆదారాలతో రుజువు చేస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది. నిజాన్ని సమాధి చేశాను. నీ ఇష్టం కనిపెట్టు చూద్దాం అని అంటాడు. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావ్ చేసి చూపిస్తాను అని ఛాలెంజ్ చేసి వెళ్తుంది. ఇక జయమ్మ కొడుకు తనతోనే ఉండాలని ఫీల్ అవుతుంది. ఇక మైత్రి కిడ్నాప్ అయిన విషయాన్ని హర్ష ఇంట్లో చెబుతాడు. ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు.
ఇవాళ ఎపిసోడ్ లో చూస్తే.. సత్య మహాదేవయ్య నుంచి ఎలాగైనా క్రిష్ ను వేరు చెయ్యాలని చూస్తుంది. ఎలాగైనా నిజం తెలుసుకోవాలని ఆలోచిస్తుంది. అటు హర్ష మాత్రం మైత్రి మిస్ అయ్యిందని టెన్షన్ పడుతుంది. అప్పుడే హర్షకి కిడ్నాపర్ల నుంచి ఫోన్ వస్తుంది. మైత్రి క్షేమంగా ఇంటికి రావాలి అంటే డబ్బు కావాలి అంటాడు. నందిని సైడ్ నుంచి పదివేలో ఇరవై వేలో ఇస్తామని చెప్పమంటుంది. కానీ మైత్రికి టెన్షన్ పడకు కిడ్నాపర్స్ డబ్బులు లెక్కలు వాళ్లకు ఉంటాయి అని శృతి చెబుతుంది. మైత్రి హర్ష దగ్గర డబ్బు లేదు పేరుకే ఒక 50 వేలు అడగండి అని అంటుంది. కిడ్నాపర్లు, మైత్రి ఫ్రెండ్ మైత్రికి నీ ప్రేమ ఇక్కడ చూపించకు అని చెప్పి హర్షకి 10 లక్షలు అడుగుతారు. అంత డబ్బు అనగానే హర్షతో పాటు ఫ్యామిలీ మొత్తం నోరెళ్లబెడతారు. ఎక్కడ నుంచి తెస్తారు అని షాక్ అవుతారు. ఇక రాత్రి సత్య ఒక్కటే ఆలోచిస్తుంది. ఎంత రెచ్చగొట్టినా మామయ్య దగ్గర నుంచి క్రిష్ తండ్రి గురించి తెలుసుకోలేకపోతున్నా మామయ్య తెలివిగా మాట్లాడుతున్నారు. బిడ్డను మార్చడం అంటే అది పురిటిలోనే జరిగుండాలి. అంటే హాస్పిటల్లోనే సాధ్యమవుతుంది. అంటే నా ఎంక్వైరీ క్రిష్ పుట్టిన హాస్పిటల్ నుంచే మొదలు పెట్టాలి.
సత్య ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు సత్య అని క్రిష్ అడిగిన పరద్యానంలో ఉన్న సత్య పలకదు.. ఓయ్ మేడం ఏంటి ఆలోచిస్తున్నారు. అని ముద్దు పెడతాడు. ఈ లోకం లోకి వచ్చావా. మొగుడు పక్కన ఉండగా ఏదో ఆలోచిస్తావ్ ఏంటి. ఎవరి గురించి అని అడుగుతాడు. దానికి సత్యం నీ గురించి అంటుంది.. దానికి సత్య ఏదోకటి చెప్పి కవర్ చేస్తుంది. రేపు నేను బయటకు వెళ్లాలి. నువ్వు నాతో రావొద్దు అనగానే క్రిష్ నేను వస్తే అడ్డమని అడుగుతాడు. అడ్డమే మనసులో నేను వెళ్లేది నీ కోసమే క్రిష్ నీ కన్న వాళ్లు ఎవరో తెలుసుకోవడానికే వెళ్తున్న అని సత్య అనుకుంటుంది. అంత కచ్చితంగా చెప్పావు అంటే నేను కచ్చితంగా వస్తాను. ఏంటి నాకు మస్కా కొట్టి ఎలా పారిపోవాలి అనుకుంటున్నావా. నేను అంత తప్పు ఏం చేశాను. నన్ను దూరం పెడుతున్నావ్. తప్పు జరిగింది అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నానని సత్య అనుకుంటుంది. చివరకు నువ్వు రేపు ఒక్కదానివే బయటకు వెళ్లాలి నేను రావొద్దు అంటే కదా సరే రానులే అని క్రిష్ ఒప్పుకుంటాడు..
ఇక క్రిష్ సత్యని దగ్గర తీసుకుంటాడు. ఇద్దరూ హగ్ చేసుకుంటాడు. మరోవైపు నందిని హర్షతో అంత డబ్బు ఇవ్వలేం మైత్రి గురించి మర్చిపో అని అంటుంది. మైత్రి నెత్తి మీద రూపాయి పెట్టిన చెల్లదు అలాంటి దానికి పది లక్షలు ఎలా ఇస్తావని అంటాడు. అంత డబ్బు నువ్వు ఎలా ఇవ్వగలవు తన గురించి వదిలేయమని అంటుంది. నందిని ఫుల్ ఫైర్ అయిపోతుంది. అంత డబ్బు మన వల్ల కాదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తుంది. కానీ గ్
హర్ష ఆలోచిస్తాడు.. ఇక భైరవి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే సత్యం హడావిడిగా బయటకు వస్తుంది. ఎక్కడికో బయటకు వెళ్లే ప్రోగ్రాం పెట్టారమ్మా అందుకే ఇంత దూకుడుగా ఉన్నారు. భైరవి నాకు అదే అనుమానంగా ఉందే. మరి ఇంకేం వెళ్లి కాళ్లకి అడ్డం పడండి వెళ్లనివొద్దు. కంట్రోల్లో పెట్టుకోండి అని పంకజం అనుకుంటుంది. భైరవి దాని సంగతి చూస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే అని సత్యను అడగ్గా కొంచెం పని ఉంది బయటకు వెళ్తున్నా అత్తయ్య అంటుంది. ఆ దాపరికం చెప్పవే. నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు నేను పర్మిషన్ ఇచ్చినప్పుడే పోవాలి. పో లోపలికి పో. సత్య టెన్షన్ పడుతుంది.
అప్పుడే జయమ్మ ఎంట్రీ ఇస్తుంది. మీ అత్త అలాగే అంటుంది నువ్వు వెళ్లమ్మా అని చెప్తుంది. నా కోడలు నా మాట వినాలి అని భైరవి అంటే నా కోడలు నా మాట వినాలి అని జయమ్మ అంటుంది. ఇంతలో మహదేవయ్య వచ్చి అన్ని అందరికీ చెప్పాలి అంటే కుదరదు కదా పోనివ్వే అని అంటాడు. అయినా భైరవి ఒప్పుకోదు. ఇంతలో క్రిష్ వచ్చి బాపు బయటకు వెళ్లాలి అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో సత్య కూడా క్రిష్ వెనకాలే వెళ్లి అందరూ చూసేలా క్రిష్ నన్ను బయటకు తీసుకెళ్తా అని చెప్పావు ఇప్పుడు వదిలేసి వెళ్తున్నావ్ అని రివర్స్లో వెళ్లి క్రిష్ని అడ్డుపెట్టుకొని భైరవి చూస్తుండగా క్రిష్ కారు ఎక్కేస్తుంది. మరోవైపు హర్ష, విశ్వనాథం డల్గా కూర్చొంటారు. నందిని కాఫీ ఇస్తుంది. విశాలాక్షి ఏదొక నిర్ణయం తీసుకోవాలని అంటుంది. కిడ్నాపర్ల నుంచి మరోసారి ఫోన్ వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరిస్తాడు. ఏమాతుందో చూడాలి.