E-Paper
Advertisement

Podarillu Gayatri : ‘పొదరిల్లు ‘ గాయత్రి రీఎంట్రీకి కారణం ఇదే.. జీవితంలో అన్నీ ట్విస్టులే..

Podarillu Gayatri : ‘పొదరిల్లు ‘ గాయత్రి రీఎంట్రీకి కారణం ఇదే.. జీవితంలో అన్నీ ట్విస్టులే..
Advertisement

Podarillu Gayatri : తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఛానల్ కూడా డిఫరెంట్ స్టోరీలతో కొత్త కొత్త సీరియల్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాయి. సినిమాలను మించిన స్టోరీ తో పాటుగా గ్రాఫిక్స్ కూడా సీరియల్స్ లో కనిపించడంతో ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా సీరియల్స్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ఈ మధ్య ప్రతి సీరియల్ కూడా కొత్త అనుభూతిని ఇవ్వడంతో జనాలు మిస్ అవ్వకుండా చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా జనాలని ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. అందులో రీసెంట్ గా ప్రారంభమైన పొదరిల్లు సీరియల్ ఒకటి. గత ఏడది డిసెంబర్ లో ప్రారంభమైన ఈ సీరియల్ కేవలం కొన్ని నెలల్లోనే మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంది. ఇందులో ప్రస్తుతం మాధవ్ గాయత్రీల పెళ్లి సస్పెన్స్ గా మారింది. మొన్నటి వరకు సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు గాయత్రి గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈమె సీరియల్స్ కి ఎందుకు గ్యాప్ తీసుకుంది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. నిజంగానే గాయత్రి ఎందుకు గ్యాప్ తీసుకుంది అన్నది ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

గాయత్రి గ్యాప్ ఎందుకు తీసుకుంది..?

ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నంతవరకు వరుసగా సినిమాలు లేదా సీరియల్స్ చేసుకుంటూ చాలామంది బిజీగా గడుపుతారు. ఒక్కసారి అవకాశాలు తగ్గితే మాత్రం వాళ్ల జీవితం రివర్స్ అవుతుందన్న విషయం చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాంటిది కొంతమంది సీరియల్స్ లేదా సినిమాలకు గ్యాప్ తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో పొదరిల్లు సీరియల్ గాయత్రి కూడా ఒకరు. గాయత్రి అసలు పేరు ప్రియాంక నాయుడు. గతంలో ఈమె అనేక సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సీరియల్స్ కి దూరమైంది. అయితే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సీరియల్స్లలో నటించడానికి ఒప్పుకోవడం లేదు అంటూ ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు ఈమెకి ఒక పాప కూడా పుట్టింది. ఇన్నాళ్లకు మళ్ళీ సీరియస్లలో రియల్ ఇచ్చింది. స్క్రీన్ మీద కనిపించడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడమో, ప్రెగ్నెంట్ అవ్వడమో తెలియదు కానీ సీరియల్స్ కి మాత్రం ఈమె గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు వరుసగా సీరియల్స్ ని లైన్ అప్ లో పెట్టుకుంటూ దూసుకుపోతుంది.:

మాధవ్ తో గాయత్రి పెళ్లి..? 

Advertisement

ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ లో గాయత్రి ప్రేమించిన వ్యక్తితో కాకుండా ఆమె తల్లి వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు అన్ని సిద్ధం చేస్తుంది. ప్రేమించిన వ్యక్తి ముందే తన పేరెంట్స్ చూసిన అబ్బాయి తో నిశ్చితార్థం కూడా చేసుకుంటుంది. ఆ ఘటన నుంచి మాధవ్ బయటికి రాలేకపోతాడు. అటు గాయత్రి ఇటు మాధవ్ ఇద్దరు కూడా తమ ప్రేమని బయటికి చెప్పుకోలేక బాధపడిపోతూ ఉంటారు. ఇక రేపు గాయత్రి పెళ్లి కావడంతో తాయారు ఇంట్లో హడావిడి మామూలుగా ఉండదు. గాయత్రి పెళ్లి దగ్గర పడడంతో మాధవ్ తట్టుకోలేక పోతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో మాత్రం ప్రేక్షకులకు అదిరిపోయే ట్విస్ట్ ఎదురవుతుంది. పెళ్లికూతురు గారు రెడీ అయిన గాయత్రి మాధవ్ ఇంటికి వచ్చేస్తుంది. ఇక అందరూ కలిసి మాధవ్ కి గాయత్రికి పెళ్లి చేస్తారు. మరి ఆ పెళ్లిని తాయారు ఒప్పుకుంటుందా..? ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయి? ఈ సీరియల్లో వీళ్ళ పెళ్లి తర్వాత ఎదురయ్య ట్విస్టులు ఏంటి అన్నది చూడాలి.. ఏది ఏమైనా కూడా పెద్దోడి పెళ్లి అవ్వడంతో ఆడియన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇకముందు ఎపిసోడ్లలో కేశవ శైలు మధ్య ప్రేమ పడుతుందేమో చూడాలి..

Also Read :Gundeninda Gudigantalu Balu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ బాలు ఇంట తీవ్ర విషాదం.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

Big Stories

Advertisement
×