E-Paper
Advertisement

Trinayani Serial Today October 11th: ‘త్రినయని’ సీరియల్‌: పంచకమణి ఇవ్వమని గజగండను అడిగిన తిలొత్తమ్మ – రెండు మణులను అమ్మవారి సన్నిధిలో పెడతామన్న నయని

Trinayani Serial Today October 11th: ‘త్రినయని’ సీరియల్‌: పంచకమణి ఇవ్వమని గజగండను అడిగిన తిలొత్తమ్మ – రెండు మణులను అమ్మవారి సన్నిధిలో పెడతామన్న నయని
Advertisement

 trinayani serial today Episode: సుమన డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని దుప్పటి కప్పుకుని నిద్రపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన విక్రాంత్‌.. సుమనను చూసి షాక్ అవుతాడు. మెల్లగా దగ్గరకు వెళ్లి దుప్పటి తీసేసి సుమనను నిద్ర లేపుతాడు. ఎందుకు ఇక్కడ కునికిపాట్లు పడుతున్నావు అని అడుగుతాడు. మీ అహల్య పిన్ని వచ్చి ఏం చెప్పింది అని సుమన అడగ్గానే.. మా అమ్మ మంచిది కాదు అని చెప్పింది అంటాడు విక్రాంత్‌.

అయితే మీ అహల్య పిన్ని ఎందుకు అలా అంది అని ఇక్కడ దుప్పటి కప్పుకుని ఆలోచిస్తేనే అర్థం అయింది. అనగానే విక్రాంత్‌ ప్లేట్‌ తీసుకుని కొడితే ముఖం మూడు ముక్కలవుతుంది అంటూ తిడతాడు. దీంత అయ్యో మీరు సరిగ్గా ఆలోచించడం లేదండి అంటుంది. నువ్వు ఆలోచించడం మానేయ్‌ అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు విక్రాంత్‌.

Advertisement

నయని ఏదో రాస్తుంటే విశాల్‌ వచ్చి నయని ఏం రాస్తున్నావు అని అడుగుతాడు. దీంతో రేపు ఏం చేయాలో రాస్తున్నాను అని నయని చెప్తుంది. అయితే అందులో ముఖ్యమైనది ఏంటో చెప్పు అని విశాల్‌ అడగ్గానే పెద్దాయన్ని కలవాలని చెప్తుంది నయని. జోగయ్యాశాస్త్రి గారిని నువ్వనేది అని అడుగుతాడు విశాల్‌. అవునని నయని చెప్తుంది.

ఎవ్వరూ చూసినా గాయత్రి పాప గురించే మాట్లాడుతున్నారు. అందుకే నిజం ఆయన్నే అడగాలనుకుంటున్నాను అంటుంది నయని. ఇలా అడిగితే ఆయన బాధపడరా? నయని అంటాడు విశాల్‌. దీంతో అనుమానాలు, అభిప్రాయబేధాలు వస్తాయి తప్పా ప్రయోజనం ఉండదు అంటాడు. మన మీద ఎంత నమ్మకం ఉంటే శాస్త్రి గారు తన మనవరాలును అప్పగిస్తారు చెప్పు అంటాడు విశాల్‌.

Advertisement

అయితే మీ పెద్దమ్మ మాటలు కూడా లెక్కలోకి తీసుకోవద్దు అంటారా? అని ప్రశ్నిస్తుంది నయని. అయితే అహల్య పిన్నే త్వరలోనే అన్ని వివరాలు చెప్తాను అంది కదా? అంటాడు విశాల్‌. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టు అని విశాల్‌ చెప్తాడు. సరే సరిగ్గా నాలుగు రోజులు ఓపిక పడతానని చెప్పి నయని వెళ్లిపోతుంది.

తిల్లొత్తమ్మ, గజగండ ఆలోచిస్తుంటారు. వల్లభ వచ్చి మ్యాటర్‌ చెప్పావా మమ్మీ అంటూ అడుగుతాడు. చెప్పానని తిలొత్తమ్మ చెప్తుంది. మరి మ్యాటర్‌ చెప్తే మౌనం పాటిస్తున్నారేంటి? అని అడుగుతాడు వల్లభ. జరిగింది తలుచుకుంటే ఏం మాట్లాడో కూడా తెలియడం లేదు వల్లభ అంటుంది. ఏమైందని గజగండ అడుగుతాడు. నయని భుజంగమణిని  గాయత్రి పాప ఆడుకునే బోమ్మల్లో పెట్టి మమ్మల్ని పూల్స్‌ ని చేసింది అని తిలొత్తమ్మ చెప్తుంది. ఆ పిల్ల మణిని ఇవ్వమని అడిగినా ఇచ్చే రకం కాదని వల్లభ అంటాడు.

అయితే బొమ్మల్లో మణిని పెట్టి నయని మిమ్మల్ని ఆడిస్తుందన్నమాట అంటాడు గజగండ. బొమ్మలే కాదు నా చీర  కొంగుకే మణిని కట్టి మమ్మల్ని పూల్స్‌ ను చేసింది గజగండ అంటుంది. నీ చీరలో పెడితే నువ్వు చూసుకోలేదా..? తిలొత్తమా అంటూ ఎంత పని చేశావు అంటూ నయని తెలివితేటలకు మనం సిగ్గుపడాలి అంటాడు గజగండ. ఇంట్లో మేము ఎంత వెతికినా ఆ భుజంగమణి మాకు దొరకడం లేదు. నువ్వు పంచకమణి మాకు ఇస్తే.. మేము తీసుకెళ్లి నయనికి ఇచ్చినట్టే ఇచ్చి భుజంగమణిని కూడా తీసుకుని వస్తాము అని తిలొత్తమ్మ చెప్తుంది.

నేను అమాయకుణ్ని కాదు తిలొత్తమ్మ.. నేను మిమ్మల్ని నమ్ముతానా? అంటాడు. అదేంటి గజగండ మా మీద నీకు నమ్మకం లేదా? అంటూ ప్రశ్నిస్తుంది తిలొత్తమ్మ. అయితే మా మమ్మీకి ఇవ్వడం ఇష్టం లేకపోతే నాకివ్వు నేను తిరిగి వచ్చేవరకు మా మమ్మీ నీ దగ్గరే ఉంటుంది గంటలమ్మకు అభ్యంతరం లేకపోతే అని వల్లభ చెప్పగానే తిలొత్తమ్మ కోపంగా రాస్కెల్‌ ఏం మాట్లాడుతున్నావురా అంటూ తిడుతుంది. దీంతో వల్లభ కంగారుగా అయ్యోయ్యో నేను వేరే ఉద్దేశంతో చెప్పడం లేదు మమ్మీ అంటూ సర్ది చెప్తాడు. అక్కడి నుంచి గజగండ వెళ్లిపోగానే వీలు చూసుకుని గజగండ నుంచి పంచకమణి కొట్టేయాలని చెప్తుంది తిలొత్తమ్మ.

ఇంట్లో స్టీల్‌ సామాను పట్టుకుని వస్తున్న హాసిని ని చూసి సుమన ఏంటక్కా స్టీల్‌ సామాను షాపు పెట్టావు అని అడుగుతుంది. ఎవరి బుద్దులకు అవి అలాగే కనిపిస్తాయి అని చెప్తుంది హాసిని. తర్వాత ఇవాళ దుర్గాష్టమి కదా? అయుధాలకు పూజలు చేద్దామని తీసుకెళ్తున్నాను అంటుంది హాసిని. అవి ఆయుధాలేంటి వదిన అంటూ విశాల్‌ అడుగుతాడు. ఆడవాళ్లకు ఇవే ఆయుధాలు అని చెప్తుంది. ఈ విషయం వల్లభ బ్రోకు తెలిస్తే నువ్వెక్కడ గరిటెతో కొడతావో అని రాడు అంటాడు విక్రాంత్‌.

ఇంతలో అక్కడకు వచ్చిన వల్లభ నన్ను కొట్టే మొనగాడే పుట్టలేదురా అంటాడు. అవును ఆడవాళ్లతో దెబ్బలు తింటాడు కదా? అంటుంది హాసిని. తర్వాత విశాల్‌, నయని భుజంగమణిని తీసుకుని గుడిలో పెట్టేసి వస్తామని చెప్తారు. మరి పంచకమణి ఎలా అని అడుగుతారు. మోసం చేసి పంచకమణిని తీసుకున్నవాడికి అమ్మవారి శక్తి ఏంటో చూపిస్తామని నయని చెప్తుంది. ఇంతలో నయని, విశాల్‌ వెళ్తారు.  ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×