E-Paper
Advertisement

OTT Movie : బొమ్మలంటే ఇష్టమా? ఈ చెమటలు పట్టించే హర్రర్ మూవీని చూస్తే జన్మలో బొమ్మలు ముట్టుకోరు

OTT Movie : బొమ్మలంటే ఇష్టమా? ఈ చెమటలు పట్టించే హర్రర్ మూవీని చూస్తే జన్మలో బొమ్మలు ముట్టుకోరు
Advertisement

OTT Movie : హర్రర్ సినిమాలు ఎంత థ్రిల్లింగ్ గా ఉంటాయో వాటిని ఇష్టపడే వారికి బాగా తెలుసు. కానీ ఎప్పటిలాగే సినిమాల్లో అప్పుడప్పుడు వచ్చే  దయ్యాల కంటే భయపెట్టే స్క్రీన్ ప్లే, సస్పెన్స్ ఉంటే ఆ థ్రిల్ వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే హారర్ మూవీ లవర్స్ ఇలాంటి సినిమాలలో కూడా కాస్త కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్ట్ చేసిన అంశాలు ఉంటేనే బెస్ట్ హారర్ మూవీ అనే బిరుదును ఇస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చు ? సినిమా పేరేంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో… 

Advertisement

హర్రర్ సినిమాలు అనగానే ఎక్కువగా ఓ మనిషికి దయ్యం పట్టడం లేదా పిశాచాలు దయ్యాలు తమను చంపిన వారిపై పగ తీర్చుకోవడం.. ఈ రెండు కాదంటే ఓ పెద్ద బంగ్లాలో దయ్యమై తిరగడం వంటి నేపథ్యంలో వస్తూ ఉంటాయి. కానీ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే క్షుద్ర పూజలు, బొమ్మల్లో ఉండే ఆత్మలు వంటి పిచ్చెక్కించే స్టోరీతో వస్తేనే ప్రేక్షకులు మరింత ఆదరిస్తున్నారు. అలాంటి జానర్లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఓ అపార్ట్మెంట్లో అందమైన బొమ్మ కనిపిస్తుంది. అయితే ఒక బ్యూటిఫుల్ అమ్మాయి మరింత అందంగా ముస్తాబయి కాసేపటికి ఆ బొమ్మను పట్టుకుని బాత్ టబ్ లో సూసైడ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇన్స్టా లో సాంగ్స్ పాడుతూ పాపులర్ అయిపోవాలి అనే కోరికతో ఉన్న హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఇక తన కోరిక మేరకు ఎప్పటికప్పుడు లైవ్ లో పాటలు పాడుతూ, ఏదో ఒక రోజున బిగ్గెస్ట్ పాపులర్ సింగర్ అవుతాను అని కలలలో మునిగితేలుతుంది. కానీ ఇంట్లో వాళ్లకు ఇవన్నీ ఇష్టం లేకపోవడంతో ముఖ్యంగా వాళ్ళ నాన్నకు తెలియకుండా సీక్రెట్ గా ఈ సింగింగ్ పనులు చేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే గతంలో చనిపోయిన ఆ అమ్మాయి కూడా ఒక గ్రేట్ సింగర్. ఆమె సెలబ్రిటీ కాబట్టి విషయం క్షణంలో వైరల్ గా మారుతుంది. అసలే ఆమె చనిపోయిందనే విషయం తెలిసి హీరోయిన్ షాక్ అవుతుంటే మీకు బాగా క్లోజ్ కాబట్టి ఇంటరాగేట్ చేస్తామని చెప్పి పోలీసులు హీరోయిన్ ని తీసుకెళ్తారు. ఓ ఇంటరాగేషన్ రూమ్లో కూర్చోబెట్టి ‘ఆ సింగర్ కి ఏదైనా డిసీజ్ ఉందా? ఆమె చేతిలో ఒక బొమ్మ ఉంది’ అని అడుగుతారు పోలీసులు. కానీ హీరోయిన్ తనకేం తెలియదని చెప్తుంది. మనసులో మాత్రం తమ గతాన్ని నెమరు వేసుకుంటుంది.. ఆ తర్వాత ఇంట్లో అడుగు పెట్టిన హీరోయిన్ కి కొన్ని వింత సంఘటనలు ఎదురు కావడంతో హీరోయిన్ ఆ సింగర్ అంత్యక్రియలకు వెళ్లి తనను క్షమించమంటూ ఏడుస్తుంది. అసలు ఆ సింగర్ కి ఈమెకు ఉన్న రిలేషన్ ఏంటి? ఈమె గతం ఏంటి? మధ్యలో బొమ్మ స్టొరీ ఏంటి? అనే విషయాలకు సమాధానం తెలియాలంటే ‘ది గార్డియన్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×