BigTV English

Trinayani Serial Today September 27th: ‘త్రినయని’ సీరియల్‌: న్యూలుక్‌ లో ఎంట్రీ ఇచ్చిన విశాల్‌ – గజగండ గురించి భయపడ్డ తిలొత్తమ్మ

Trinayani Serial Today September 27th: ‘త్రినయని’ సీరియల్‌: న్యూలుక్‌ లో ఎంట్రీ ఇచ్చిన విశాల్‌ – గజగండ గురించి భయపడ్డ తిలొత్తమ్మ

 trinayani serial today Episode:  పంచకమణిని నువ్వు తీసుకుని వెళ్లినా.. సద్వినియోగం చేసుకోలేక దుర్మార్గుల చేతికి వెళ్లటంతో దీప కాంతి చివరకు వచ్చింది. మళ్లీ వెలిగేలా చేయాలి. అప్పుడే నీకు భుజంగ మణి దొరుకుతుంది అని అమ్మవారు చెప్తారు. ఎలా రాయితో రాపిడి చేసి నిప్పురవ్వలు రగిలించాలా? అని నయని అడగ్గానే ఈసారి అలాంటి అవకాశం లేదు నయని అంటుంది అమ్మవారు.


ఆ మానసాదేవి ధరించిన ఏడు మణుల్లో ఒక మణిని స్పర్శిస్తే అప్పుడు దీప కాంతి వెలుగుతుందని అయితే మూడు అవకాశాలు మాత్రమే ఉన్నాయని అవకాశం అయిపోతే మీ ముగ్గురు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్లలేరు అని చెప్పగానే నయని ఏడుస్తుంది. అమ్మా నీ దగ్గర నుంచి పంచకమణి తీసుకుని ఇవ్వలేదని ఇన్ని పరీక్షలు పెడుతున్నావా? తల్లి. నాభర్తకు నయం అయ్యాక తిరిగి ఆ మణిని తప్పకుండా నీ సన్నిధికి చేరుస్తాను అమ్మా.. నాకు దారిని చూపించు అమ్మా అంటూ నయని వేడుకుంటుంది.

ఇంతలో శివ వస్తుంది. భుజంగమణి దొరికిందా? అని అడుగుతుంది. దీంతో లేదని.. అమ్మవారికి ఉన్న ఏడు మణుల్లో ఒక మణిని తాకాలని అప్పుడు భుజంగమణి దొరుకుతుందట అని చెప్పగానే శివ నేను తాకుతాను అని చెప్పని నయని చెప్పిన మణిని తాకుతుంది. దాన్నుంచి వెలుగు రాదు. రెండో ప్రయత్నంలో విశాల్‌ చెప్పిన మణిని తాకుతుంది శివ. రెండో ప్రయత్నంలో కూడా వెలుగు రాదు. దీంతో విశాల్‌ మరణం కాయం అంటాడు. దీంతో శివ నేను ప్రయత్నించాను కాబట్టి ఆ శిక్ష నాకే పడుతుంది అంటుంది శివ. మూడో ప్రయత్నం చేద్దాం చెప్పండి అని అడుగుతుంది శివ.


నయని, విశాల్‌ ఏది చెప్పాలో అర్థం కాక ఏడుస్తుంటారు. ఇంతలో గాయత్రి పాప చెప్తుంది. పాప చూపించిన మణిని వెళ్లి తాకుతుంది శివ. వెంటనే పెద్ద వెలుతురు వచ్చి దీపం వెలుగుతుంది. ఆ దీప కాంతి చుట్టూ విస్తరిస్తుంది. దీంతో నయని, విశాల్‌ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో భుజంగమణి కనిపిస్తుంది. నయని వెళ్లి భుజంగమణిని తీసుకుంటుంది. మణితో విశాల్‌ చేతిని నయం చేస్తుంది నయని. విశాల్ హ్యాపీగా ఫీలవుతాడు.  తల్లి నా భర్తకు నయం అయిపోయింది. ఇదిగో నీ మణిని ఇక్కడే పెడుతున్నాను అంటుంది. దీంతో అమ్మవారు నయని పంచకమణితో కలిపి భజంగమణిని ఇక్కడ పెట్టాలి. అది కూడా  వచ్చే విజయదశమి లోపు లేకుంటే నీ వంశం నిర్వీర్యం అవుతుంది అని చెప్పగానే నయని సరే అమ్మా అని చెప్తుంది.

దురందర, కోవెల మూర్తి గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటారు. ఇంతలో హాసిని వచ్చి పాలవాడి కోసం ఎదురుచూస్తున్నారా? అంటూ అడుగుతుంది. దీంతో పాల కోసం కాదని విశాల్‌, నయని కోసం అని దురందర చెప్తుంది. దీంతో దానికి కంగారెందుకు పిన్ని అంటుంది. కోవెలమూర్తి అర్థం కాక మళ్లీ అడుగుతాడు. దీంతో సమున పోయిన వాళ్లు అటే పోతారు కానీ ఇటు రారు అని చెప్తుంది. దీంతో విక్రాంత్‌, సుమనను తిడతాడు. నీకు అర్థం కాకపోతే అడుగు అంటాడు.

నీకు ఏం అర్థమైందో చెప్పరా అంటూ వల్లభ అడుగుతాడు. అయిన వాళ్లు వచ్చేంత వరకు మనం కళ్లారా? చూసేంత వరకు ఏదీ నమ్మలేము. అంటుంది సుమన. ఇంతల వల్లభ మమ్మీ గజగండ కూడా ఇంకా రాలేదు కదా? అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. తిలొత్తమ్మ, వల్లభను తిట్టుకుంటుంది. ఇంతలో హాసిని, వల్లభను నిలదీస్తుంది. అయితే భుజంగమణి కోసం నయని వాళ్లు వెలితే అది తెలుసుకున్న గజగండ వెళ్లకుండా ఉంటాడా? అని వల్లభ ఉద్దేశం అని సర్ది చెప్తుంది తిలొత్తమ్మ.

వాడు తిరిగి రాకపోయినా ఇక్కడ ఎవ్వరికీ నష్టం లేదు అంటాడు విక్రాంత్‌. ఇంతలో గాయత్రి పాప రావడం చూసిన హాసిని సంతోషంగా వచ్చేసింది అని వెళ్లి గాయత్రి పాపను ఎత్తుకుంటుంది. ఇంతలో నయని వస్తుంది. దీంతో తిలొత్తమ్మ గుమ్మం వరకు ఎవరో దిగబెట్టినట్టు ఇలా వస్తున్నారేంటి నయని అని అడుగుతుంది. ముగ్గురు కలిసి రాలేదు ఎందుకని అని ప్రశ్నిస్తుంది. ఇంతలో హాసిని కలగజేసుకుని విశాల్‌ ఎంట్రీ స్పెషల్‌ గా ఉందనుకుంటా అంటుంది.

అవునక్కా అంటుంది నయని. చెయ్యి బాగైందా? లేదా అది చెప్పు అక్క ముందు అంటూ సుమన అడుగుతుంది. వదిన ముఖంలో వెలుగు చూస్తుంటే వెళ్లిన పని పండు అయినట్టే  అంటాడు విక్రాంత్‌. నీ వాక్కు నిజమైతే అంతకన్నా హ్యపీ ఇంకేం ఉంటుంది అల్లుడూ అంటాడు కోవెలమూర్తి. ఇంతలో నయని విశాల్‌ ను పిలుస్తుంది. విశాల్‌ చాలా స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తాడు.

విశాల్‌ ను చూసిన అందరూ హ్యాపీగా ఫీలవుతారు. తిలొత్తమ్మ, వల్లభ, సుమన షాక్‌ అవుతారు. తర్వాత భుజంగమణి గురించి తిలొత్తమ్మ అడగ్గానే విశాల్‌ తీసి చూపిస్తాడు.  ఇంతలో సుమన చూస్తాననని మణి తీసుకోబోతే నయని ఆపుతుంది ఎవరుపడితే వాళ్లు టచ్ చేయకూడదని చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×