OTT Movie : హారర్ మిస్టరీ సినిమాలు మనల్ని ఒక భయంకరమైన ప్రపంచంలోకి తీసుకెళతాయి. చీకటి రహస్యాలు, అతీంద్రియ సంఘటనలు, సాధారణ వ్యక్తుల జీవితాల్లో భయాలు కలిసి మనల్ని ఒక ఉత్కంఠతో నిండిన రైడ్‌లో ఉంచుతాయి. ఇలాంటి కథలను ఇష్టపడితే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మీ కోసమే. ఈ అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ సినిమా, ఒక గర్భిణీ స్త్రీ చేసే ఒంటరి పోరాటాన్ని, భయంకరమైన అతీంద్రియ శక్తులతో కూడిన ఒక థ్రిల్లింగ్ సాహసంగా చూపిస్తుంది. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చు? మరిన్ని వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
ఈ కథ జూలీ రివర్స్ అనే గర్భిణీ స్త్రీ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన భర్త డానియల్ తో కలిసి న్యూయార్క్‌లోని ఒక పాత, అందమైన లేక్‌సైడ్ ఇంటికి కొత్త జీవితం కోసం వెళ్తుంది. జూలీ ఇప్పుడు ఏడు నెలల గర్భిణీ. తనకు పుట్టబోయే బిడ్డ కోసం తపిస్తూ సంతోషంగా ఉంటుంది. ఈ కొత్త ఇంట్లో ఒక వర్కర్ జూలీకి ఒక పాత బ్రాస్‌లెట్ ఇస్తాడు. అది ఇంటి డ్రెయిన్‌లో దొరికిందని చెబుతాడు. జూలీ, “ఓహ్, ఇది ఎంత అందమైనది!” అని సరదాగా దాన్ని ధరిస్తుంది. కానీ ఆ బ్రాస్‌లెట్ కి ఒక భయంకరమైన గతం ఉంటుంది. కథలో ఒక ట్విస్ట్ వస్తుంది. జూలీ ఒక చిన్న పిల్లవాడి ఆకారాన్ని చూసి భయపడి, మెట్లపై నుండి జారి పడిపోతుంది. ఆసుపత్రిలో, డాక్టర్ మీడోస్ జూలీకి తన గర్భం చివరి ఎనిమిది వారాలు (55 రోజులు) పూర్తి బెడ్ రెస్ట్‌లో ఉండాలని ఆదేశిస్తాడు. ఎందుకంటే ఆమెకు ప్లాసెంటల్ అబ్రప్షన్ సమస్య వస్తుంది. జూలీ, “అరె, ఎనిమిది వారాలు బెడ్ మీదే? ఇది ఏమన్నా జైలా?” అని సరదాగా అంటుంది. కానీ ఆమె జీవితం త్వరలో ఒక హారర్ సినిమాగా మారుతుంది.
Read Also : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్
మెలాండ్రా దెయ్యం ఆమె కొత్తగా జన్మించిన ఆడపిల్లను తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే డెల్మీ జూలీని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ మెలాండ్రా ఆమెను కిటికీ గుండా బయటికి విసిరేస్తుంది. డానియల్ తలపై గాయంతో స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో జూలీ, ఒక బాత్‌టబ్‌లో బిడ్డను ప్రసవిస్తుంది. మెలాండ్రా ఆత్మ ఆ బిడ్డ శక్తిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ స్టోరీ ఒక షాకింగ్ ట్విస్ట్ తో భయంకరమైన మలుపు తీసుకుంటుంది. మెలాండ్రా ఆత్మ నుంచి తన బిడ్డను జూలీ కాపాడుకుంటుందా ? జూలీ మెలాండ్రా ఆత్మకి బలవుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘Bed Rest’. ఈ సినిమాకి లోరీ ఎవాన్స్ దర్శకత్వం వహించారు. 2022 డిసెంబర్ 7న ఈసినిమా Tubiలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. 90 నిమిషాల నిడివితో, ఇంగ్లీష్ , తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులో మెలిస్సా బారెరా (జూలీ రివర్స్), గై బర్నెట్ (డానియల్ రివర్స్), ఎడీ ఇంక్‌సెట్టర్ (డెల్మీ వాకర్), ఎరిక్ అథవాలే (డాక్టర్ మీడోస్), క్రిస్టెన్ సవాట్జ్కీ (మెలాండ్రా కిన్సే), ప్రధాన పాత్రల్లో నటించారు.