BigTV English

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : చేతబడి జానర్ అంటేనే ప్రేక్షకులు ఊగిపోతారు. ఈ సినిమాలలో వచ్చే స్పైన్ చిల్లింగ్ సీన్స్ అలా ఉంటాయి మరి. ఇలాంటి సినిమాలు బాగా ట్రెండ్ కూడా అవుతున్నాయి. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ జానర్ సినిమా, ఒటిటిలో కూడా దూసుకెళ్తోంది. ఈ స్టోరీ తల్లీకూతుర్ల మధ్య జరిగే అసాధారణ సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చు? మరిన్ని వివరాల్లోకి వెళితే …


షడ్డర్ లో స్ట్రీమింగ్

ఈ హారర్‌ సినిమా పేరు ‘The Surrender’ దీనికి జూలియా మాక్స్ దర్శకత్వం వహించారు. Shudderలో మే 23, 2025 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. 1 గంట 36 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 5.4/10 రేటింగ్ ను పొందింది. ఇందులో కోల్బీ మినిఫీ (మేగాన్), కేట్ బర్టన్ (బార్బరా), వాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ (రాబర్ట్), నీల్ సాండిలాండ్స్ (షమన్), చెల్సియా ఆల్డెన్ (యంగ్ బార్బరా) ప్రధాన పాత్రల్లో నటించారు.


స్టోరీలోకి వెళితే …

ఈ కథ మేగాన్, ఆమె తల్లి బార్బరా చుట్టూ తిరుగుతుంది. మేగాన్ తండ్రి రాబర్ట్‌ కి తీవ్రమైన అనారోగ్యం ఉంటుంది. ఈ సమయంలో తన తండ్రి ఆరోగ్యం గురించి తెలుసుకుని, మేగాన్ తన ఇంటికి తిరిగి వస్తుంది. తన చదువుకు ఆర్థిక సహాయం కోసం తల్లిదండ్రులను అడగాలనుకుంటుంది. అయితే ఆమె తల్లి బార్బరాతో ఆమె సంబంధం ఎప్పటినుండో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. బార్బరా, రాబర్ట్‌ను చూసుకుంటూ, అతనికి మార్ఫిన్ ఇస్తూ, అతన్ని బతికించేందుకు అనేక పద్ధతులను అనుసరిస్తుంది. ఒక రోజు రాత్రి, మేగాన్ తన తండ్రిని ఒంటరిగా చూసుకుంటూ, అతనికి మార్ఫిన్ డోస్ ఇస్తుంది. బార్బరాకు ఈ విషయం తెలీక ఆమె కూడా రాబర్ట్‌కు మరో డోస్ ఇస్తుంది. ఇది అతని మరణానికి దారితీస్తుంది. రాబర్ట్ మరణం తర్వాత, బార్బరా షాక్‌లో ఉండగా, ఆమె ఒక యోగా ఇన్‌స్ట్రక్టర్ సూచనతో ఒక షమన్ ను సంప్రదిస్తుంది. అతను రాబర్ట్‌ను తిరిగి బతికించే రిచ్యువల్ చేయగలడని చెప్పి, బార్బరా దగ్గర చాలా డబ్బులు తీసుకుంటాడు. మేగాన్ మొదట ఈ రిచ్యువల్ ను వ్యతిరేకిస్తుంది, కానీ తన తల్లి పట్టుదల, నమ్మకం చూసి, ఆమెను సమర్థించడానికి రిచ్యువల్‌లో పాల్గొంటుంది.

Read Also : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

ఈ రిచ్యువల్ మూడు దశలను కలిగి ఉంటుంది. మొదటి దశలో, రాబర్ట్‌కు సంబంధించిన అన్ని వస్తువులను కాల్చడం. రెండవ దశలో, వారు “ఇతర ప్రపంచం”కు వెళ్లి రాబర్ట్ ఆత్మను తిరిగి తీసుకురావడం. మూడవ దశలో అతని ఆత్మను అతని శరీరంలోకి తిరిగి చేర్చడం. మేగాన్, బార్బరా షమన్ సూచనలను అనుసరిస్తారు. ఇక క్లైమాక్స్‌లో మేగాన్ ఒంటరిగా హెల్‌ లాంటి ఇతర ప్రపంచంలో చిక్కుకుంటుంది. ఆమె అక్కడ జోంబీలాంటి ఆత్మలను చూస్తుంది. అక్కడ తన తండ్రి ఆత్మ కోసం వెతుకుతుంది. ఇప్పుడు స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది. మేగాన్ తన తండ్రి ఆత్మను తిరిగి తీసుకొస్తుందా ? వీళ్ళు రాబర్ట్ ను తిరిగి బ్రతికించుకుంటారా ? రిచ్యువల్ వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా ? అనే విషయాలను ఈ హారర్‌ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×