Big Tv Kissik Talks: బిగ్ టీవీ(Big tv) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి చాలా మంచి ఆదరణ లభిస్తుంది. వర్ష (Varsha)యాంకర్ గా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి ప్రతివారం బుల్లితెర నటీనటులు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా అమర్ దీప్ (Amar Deep)హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అమర్ తన కెరియర్ గురించి అలాగే తన వ్యక్తిగత విషయాలు గురించి కూడా మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో అమర్, తేజు విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అంటూ వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకు అమర్ ఈ సందర్భంగా పులిస్టాప్ పెట్టేశారు.
పిల్లలు ఇప్పుడే వద్దనుకున్నారా?
మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సర్వసాధారణమైనవని విడాకులు తీసుకొని విడిపోయేంత గొడవలు కాదని క్లారిటీ ఇచ్చారు. ఇలా వీరిద్దరూ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారనే విషయం తెలియచేయడంతో వర్ష పిల్లల (Kids)గురించి ప్రశ్న వేశారు. మరి బుల్లి అమర్ ఎప్పుడు రాబోతున్నాడు అంటూ ప్రశ్న వేయగా అమర్ మాత్రం సంచలన విషయాలను తెలియజేశారు. ప్రస్తుతానికి తాము పిల్లల్ని వద్దనుకున్నామని షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. పిల్లల గురించి గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో అమర్ ఇలాంటి విషయాన్ని తెలియచేయడంతో అభిమానులు నిరాశకు గురి అవుతున్నారు.
కొత్త సీరియల్ ఛాన్స్…
తేజస్విని గౌడ (Tejaswini Gauda)బుల్లితెర నటిగా అందరికీ ఎంతో సుపరిచితమే అయితే పెళ్లి తర్వాత సీరియల్స్ కు కాస్త దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు ఇప్పుడే తిరిగి కొత్త సీరియల్ అవకాశాలని అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా కెరియర్ పరంగా తనకు ఇంకా మంచి గుర్తింపు సంపాదించుకోవాలని ఇంకా ఏదో ఒక సాధించాలనే తపన ఉందని, అందుకే తనని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నానని అమర్ తెలిపారు. ఇలా లేడీ ఓరియంటెడ్ సీరియల్ అవకాశం తనకు రావడంతో పిల్లల్ని మరి కాస్త ఆలస్యంగా ప్లాన్ చేస్తున్నామని అమర్ ఈ సందర్భంగా వెల్లడించారు.
హీరోగా అమర్…
ఇలా పిల్లల గురించి అమర్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాయి. అలాగే మరి కొంతమంది మాత్రం తేజస్విని నిర్ణయానికి గౌరవించి అమర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా గ్రేట్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక అమర్ బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం తర్వాత కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈయన హీరోగా సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి కాబోతోంది అయితే ఈ సినిమాతో పాటు ఈయన మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా కెరియర్ పరంగా వీరిద్దరూ బిజీగా ఉన్న నేపథ్యంలోనే పిల్లల్ని ఇప్పుడే ప్లాన్ చేయలేదని అమర్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అమర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Tollywood workers Strike: నిర్మాతలు చెప్పినవి నచ్చలేదు.. సమ్మె ఆగదు.. హెచ్చరించిన ఫెడరేషన్!