Big Tv Kissik Talks: బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటించిన ఇతనికి జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సీరియల్ మంచి సక్సెస్ కావడంతో బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలోకి వెళ్లడం బిగ్ బాస్ ద్వారా మరింత మంది అభిమాను సొంతం చేసుకుని ఈ కార్యక్రమంలో రన్నర్ గా బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ తర్వాత ఈయన బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అలాగే సినిమా అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా అమర్ దీప్ బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big TV Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు.
మా మధ్య గొడవలు నిజమే..కానీ?
ఈ కార్యక్రమంలో భాగంగా అమర్ ఎన్నో విషయాలు గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా తన భార్య తేజస్వినితో(Tejaswini) గొడవల గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు. ఈయన బుల్లితెర నటి తేజస్విని గౌడను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని విడాకులు(Divorce) తీసుకొని విడిపోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఇక ఈ వార్తల గురించి తాజాగా అమర్ స్పందించారు. సినిమా షూటింగ్స్ సీరియల్ షూటింగ్స్ కారణంగా ఇద్దరం ఎంతో బిజీగా గడుపుతున్నాము. ఇలాంటి సమయంలోనే చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావడం గొడవలు జరగడం అనేది సర్వసాధారణం అందరు ఇళ్లల్లో ఎలాంటి గొడవలు అయితే ఉన్నాయో మా ఇంట్లో కూడా అలాంటి గొడవలే ఉన్నాయి అంటూ అమర్ క్లారిటీ ఇచ్చారు..
నటించడం నాకు చేతకాదు..
ఇక నేను అందరిలాంటి వ్యక్తిని కాదు.. కెమెరా ముందు ఒక విధంగా, కెమెరా వెనక ఒక విధంగా నటించే స్వభావం నాది కాదు ఎవరినైనా ప్రేమించాలన్నా, తన ప్రేమను అలాగే బయట పెడతాను ఎవరినైనా ద్వేషించాలన్న అలాగే మాట్లాడతాను. ఇతర సెలబ్రిటీల మాదిరి మేము కెమెరా ముందు కనిపించకపోవడంతోనే మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని విడాకులు తీసుకుని విడిపోతున్నాము అంటూ వార్తలను సృష్టిస్తున్నారే తప్పా విడిపోయే అంత గొడవలు మా మధ్య లేవని, ఏదైనా గొడవపడిన అక్కడికక్కడే ఆ విషయాన్ని మరిచిపోతానని అమర్ తెలిపారు.
నాకు నాలాగా బ్రతకడం ఇష్టం, ఒకరిలాగా బ్రతకడానికి తన ఇష్టపడదని ఈయన వెల్లడించారు. ఎప్పుడు నా భార్యపై ప్రేమ చూపించాలి ఎప్పుడు మేము ఫోటోలు వీడియోలు పెట్టాలనేది నాకు తెలుసు. మా ఇద్దరి వ్యక్తిగత విషయాలను కెమెరా ముందు తీసుకురావడం నాకిష్టం లేదు అంటూ అమర్ క్లారిటీ ఇచ్చారు. ఇక తన వైవాహిక జీవితం గురించి తప్పుడు వార్తలు రాసేవారికి ఈయన ఒకటే చెప్పారు. కడుపుకు అన్నం తినే వాళ్ళు అయితే ఇలా తప్పుడు రాతలు రాయరు అంటూ అమర్ తెలిపారు. ఇలా మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలు చిన్న చిన్న గొడవలు తప్ప విడిపోయే అంత పెద్దవి కాదని, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము అంటూ ఈ సందర్భంగా అమర్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?