E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం తెలుసుకున్న మిస్సమ్మ – బుర్ఖాలో ఫాలో అయిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today September 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం తెలుసుకున్న మిస్సమ్మ – బుర్ఖాలో ఫాలో అయిన మనోహరి
Advertisement

 

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మతో కలిసి స్కూటర్‌ మీద వెళ్తున్న అమర్‌ కరెక్టుగా అరవింద్‌ ఆగిన హోటల్‌ దగ్గరే అగి లోపలికి వెళ్తాడు. ఇంతలో అరవింద్‌కు తన అనుచరుడు సూట్‌కేసులో గన్‌ తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్లిపోతాడు. గన్‌ తీసుకున్న అరవింద్‌. సంతోషంగా నవ్వుతూ.. అమరేంద్ర నా చేతుల్లో చంపేందుకే నువ్వు నీ భార్యను తీసుకుని వచ్చావు అనుకుంటాడు. గన్‌ రెడీ చేసి చాటుగా వెళ్లి మిస్సమ్మను కాల్చడానికి రెడీగా ఉంటాడు.

Advertisement

హోటల్‌లో  ఒక దగ్గర కూర్చున్న అమర్‌, మిస్సమ్మకు జాగ్రత్తలు చెప్తుంటాడు. ఇంతలో మిస్సమ్మ  ఏంటీ మనం బయలుదేరినప్పుటి నుంచి చూస్తున్నాను. మీరు  అటూ ఇటూ చూస్తూనే ఉన్నారు. అని అడుగుతుంది. దీంతో అమర్‌  ఏం లేదు మిస్సమ్మ. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎప్పుడూ నా పక్కనే ఉండు దూరంగా వెళ్లకు అంటాడు. దీంతో మిస్సమ్మ సిగ్గుపడుతూ…

అయ్యో ఈయనేంటి మరీ ఇంత డైరెక్టుగా చెప్పేస్తున్నారు. దేవుడా నువ్వు ఉన్నావయ్యా  అని మనసులో అనుకుంటుంది. మిస్సమ్మ నీకే చెప్పేది వింటున్నావా? అని అమర్‌ అడిగేసరికి.. ఆ సరేనండి మీరు చెప్పినట్లే చేస్తాను అంటుంది. దీంతో నేనెప్పుడూ నీ పక్కనే ఉంటాను నువ్వేం కంగారు పడకు అని అమర్ చెప్పగానే మిస్సమ్మ మరింత సిగ్గుపడుతూ నా గురించి ఇంతలా ఆలోచించే భర్తను ఇచ్చావా? దేవుడా? అని మనసులో అనుకుంటుంది.

Advertisement

అమర్‌ ఫాలో అవుతూ మనోహరి కారులో వస్తుంది. ఆ కారులోనే వస్తు్న్న ఆరు కంగారుపడుతుంది. ఇంకా మిస్సమ్మ, మా ఆయన కనబడరేంటి అని వెతుకుతుంది. కారులోనే ఉన్న సింగ్‌ గెటప్‌లో ఉన్న రాథోడ్‌ హోటల్‌ దగ్గర స్కూటర్‌ చూసి మనోహరి గారు డాబా వెళ్లిపోతుంది. గాడి రుక్‌ జావ్‌ అంటూ గట్టిగా అరవడంతో ఆరు, మనోహరి అవుతారు. రాథోడ్‌ మనోహరిని పేరు పెట్టి పిలిచాను అనుకుని టెన్షన్‌ పడుతుంటాడు.

అవును మనోహరి పేరు ఇతనికి ఎలా తెలుసు? అని  ఆరు డౌట్‌ పడుతుంది. మనోహరి కూడా ఏయ్‌  నా పేరు నీకెలా తెలుసు? అంటూ అడుగుతుంది. రాథోడ్‌ పలకడు. దీంతో కోపంగా హలో అడుగుతుంది. నిన్నే నా పేరు నీకెలా తెలుసు? అని గట్టిగా అడగ్గానే రాథోడ్‌  అది ఇందాకా మీది చెప్పింది. అంటాడు.  నేను మాటల్లో చెప్పానా? నేనెప్పుడు మాట్లాడాను. నీకెప్పుడు చెప్పాను. అంటూ ప్రశ్నించడంతో రాథోడ్‌ ఏదో చెప్తూ కారు దిగి వెళ్లిపోతాడు.

రాథోడ్ నే చూస్తూన్న మనోహరికి హోటల్‌ పక్కన అమర్‌ వాళ్లు వచ్చిన స్కూటర్‌ కనిపిస్తుంది. వెంటనే మనోహరి కారు దిగి హోటల్‌ దగ్గరకు వెళ్లి చూస్తుంది. లోపల ఐస్‌ క్రీం తింటున్న అమర్‌, మిస్సమ్మను చూసి లవర్స్‌ లాగా ఐస్‌ క్రీం తింటున్నారా? అని తిట్టుకుంటూ.. తన కారులో ఉన్న బుర్ఖా వేసుకుని హోటల్‌ లోపలికి వెళ్తుంది. ఆరు మాత్రం ఎంత ముందు జాగ్రత్తతో వచ్చావే అని తాను కూడా మిస్సమ్మకు ఎలాగైనా నిజం చెప్పాలని లోపలికి వెళ్తుంది.

అరవింద్‌ గన్‌ మిస్సమ్మకు ఎయిమ్‌ చేసి ఉంటాడు. ఇంతలో రాథోడ్‌ గన్‌కు అడ్డుగా నిలడతాడు. దీంతో కాల్చడం ఆపేస్తాడు అరవింద్. రాథోడ్‌, మిస్సమ్మను పక్కకు రమ్మని సైగ చేస్తాడు. దీంతో మిస్సమ్మ కోపంగా మా ఆయన చూశావా ఎలా ఉన్నాడో.. ఆ కండలు చూడు చంపేస్తారు. అంటుంది. రాథోడ్‌ మాత్రం మిమ్మల్ని చంపేస్తారు. అటూ ఇటూ చూస్తూ ఉండు అంటూ సైగ చేస్తుంటాడు.

ఇంతలో అక్కడకు వెళ్లిన ఆరు, మిస్సమ్మకు నిజం చెప్పడానికి ఎదురుగా వెళ్లబోయి.. ఇప్పుడు మిస్సమ్మకు నిజం చెప్పాలంటే నా గురించి అడుగుతుంది. ఎలా చెప్పాలి ఇప్పుడు. అని ఆలోచిస్తూ.. రాథోడ్‌ ను గమినిస్తుంది. అసలు  వీడెవడు మిస్సమ్మకు ఏవో సైగలు చేస్తున్నాడు అనుకుంటుంది. అక్కడ టేబుల్‌ దగ్గర మిస్సమ్మ జ్యూస్‌ తాగకుండా స్రాతో ఏదేదో చేస్తుంటే.. అమర్‌ చూసి తిడతాడు. జ్యూస్‌ ఉన్నది తాగాడానికి ఇలా ఇలా అడుకోవడానికి కాదు అంటాడు. దీంతో మిస్సమ్మ  అవునా జ్యూస్‌ తాగడానికి ఇచ్చారా? నేనింకా ఇలా ముందు పెట్టుకుని మీలా ఇలా దిక్కులు చూడటానికి ఇచ్చారనుకున్నా.. అంటుండగా జ్యూస్‌ మిస్సమ్మ మీద పోతుంది.

నేను వాష్‌ రూం కి వెళ్లి వస్తాను అని మిస్సమ్మ చెప్పగానే అమర్‌నేను కూడా తోడు వస్తాను. అంటాడు. దీంతో మిస్సమ్మ మిస్టర్‌ మొండి మొగుడు గారు ఈ లోపు నన్ను ఎవ్వరూ కిడ్నాప్‌ చేయరులేండి అంటూ మిస్సమ్మ వాష్‌ రూంకి వెళ్తుంది. రాథోడ్ మిస్సమ్మను ఫాలో అవుతాడు. వాష్‌ రూంలోకి బయటకు వచ్చిన మిస్సమ్మను చేయి పట్టుకుని పక్కకు లాగుతాడు. దీంతో మిస్సమ్మ ఎవడ్రా నువ్వు నా చేయి పట్టుకుంటావా? అంటూ రాథోడ్‌ ను కొడుతుంది. రాథోడ్ అయ్యో మిస్సమ్మా అంటే నన్నే మిస్సమ్మా అంటావా? అని మరింత ఎక్కువ కొడుతూ.. అయ్యో మిస్సమ్మా అంటే నేనే.. అంటూ ఆగిపోయి.. రాథోడ్ అంటుంది.

రాథోడ్‌ అవును మిస్సమ్మ అంటూ గడ్డం మీసాలు తీస్తాడు. ఏంటి రాథోడ్‌ ఈ గెటప్‌ అని అడుగుతుంది. దీంతో అసలు విషయం చెప్తాడు. ఆ టెర్రరిస్టును పట్టుకోవడానికి మా సార్‌ నిన్ను ఎరగా వాడుతున్నాడు అనగానే మిస్సమ్మ షాక్‌ అవుతుంద. గాలి తీసిన బెలూన్‌ లా డల్‌ అయిపోతుంది. తర్వాత అమర్‌ దగ్గరకు వెళ్లి కోపంగా చూస్తూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×