Illu Illalu Pillalu ToIlluday Episode August 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంకాసేపు ఇక్కడ వెయిట్ చేద్దాం అని నర్మదా అంటుంది. కాసేపట్లో తెల్లారిపోతుంది కదా మేల్కొని ఉండడమే మేలు ఈ దొంగ మళ్ళీ వచ్చినా రావచ్చు అని ధీరజ్ కూడా అంటారు. అవును మనం ఇక్కడే ఉంటే బెటర్ అని అందరూ అంటారు. అయితే అత్తయ్య మామయ్యను కలపడానికి ఇదే మంచి సమయం మనం ఏదో ఒకటి చేయాలి అని ప్రేమ నర్మదా ప్లాన్ చేస్తారు.. నర్మదా వేదవతిని పిలుస్తుంది. నేను మీ ఇద్దరితో మాట్లాడనని తెలుసు కదా మరి ఎందుకు మీరిద్దరూ నాతో మాట్లాడాలని చూస్తున్నారు అని వేదవతి అడుగుతుంది. నాకు ఎప్పటినుంచో మీ లవ్ స్టోరీని తెలుసుకోవాలని ఆశగా ఉంది అత్తయ్య ఇప్పుడు ఖాళీ గానే ఉన్నాం కదా మీ లవ్ స్టోరీ చెప్పండి అని నర్మదా అడుగుతుంది.
అవును అత్తయ్య మీరు మీ లవ్ స్టోరీ చెప్పాల్సిందే అని ప్రేమ కూడా అడుగుతుంది. బాబాయ్ గారు ఇలా ఉంటే ఏం బాగోలేదు కదా వీళ్ళు చెప్పాల్సిందే అని తిరుపతిని అడుగుతుంది నర్మదా. తిరుపతి వాళ్ళు చెప్పడం కాదమ్మా వాళ్ళు మొదటి నుంచి ఎలా ఉన్నారు? నేను చెప్తానని వాళ్ళ లవ్ స్టోరీ గురించి చాలా గొప్పగా చెప్తాడు.. రామ రాజు, వేదవతి మధ్య దూరం తగ్గించేస్తుంది నర్మద.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజే మా ఇంట్లో దొంగతనం చేయమని పంపించారు అని భద్రావతి అంటుంది.. మాటలు మర్యాదగా రానివ్వండి. రోజులు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న ఏమి మాట్లాడలేదు. ఇప్పుడు అతన్ని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా అని రామరాజు అరుస్తాడు.. అసలు ఇతను దొంగతనానికి వచ్చాడో మరే దానికి వచ్చాడో తెలియాలంటే పోలీసులు రావాల్సిందే అని భద్రావతి అంటుంది. శ్రీవల్లి మాత్రం పోలీసుల్ని పిలవకండి మా నాన్న అటువంటి వాడు కాదండి అని బ్రతిమలాడుతుంది..
చందు వాళ్ళని బ్రతిమిలాడుతావ్ ఏంటి పోలీసులు రావాల్సిందే అని అంటాడు. సేనా వాళ్ళింట్లో దొంగతనం జరిగిందని పోలీసులకి సమాచారం అందిస్తాడు. అప్పుడే భాగ్యం ఆయన గారండీ అంటూ వెతుక్కుంటూ వస్తుంది.. శ్రీవల్లి పుట్టినరోజు అని శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన వచ్చారు ఇప్పటివరకు ఇంటికి రాలేదు అని చెప్తుంది..
ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటమ్మా వల్లి ఇవాళ నీ పుట్టినరోజున అని రామరాజు అడుగుతాడు. దానికి శ్రీవల్లి అవును అని అంటుంది. ముందే చెబితే గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలు చేసేవాళ్ళము కదా అని రామరాజు అంటాడు. చెబుదామని అనుకున్నాను మావయ్య కానీ మర్చిపోయాను అని శ్రీవల్లి అంటుంది. ఇంతకీ మా ఆయన ఏడండి అని పార్టీ అడుగుతుంది.. భాగ్యం అని పక్కనున్న వ్యక్తి అని అంటూ నేనేంటి మా ఆయన గొంతు లాగా పిలుస్తున్నాడు అని భాగ్యం కావాలని అంటుంది.
మీ ఆయన్ని నేను అని ఆనందరావు మరోసారి భాగ్యమును పిలుస్తాడు.. మా ఇంటి దగ్గర కొట్టారు అని కాస్త ఓవరాక్షన్ చేస్తుంది. మా అమ్మాయికి నాయనా అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి నిద్రపోడు అందుకే రాత్రి వచ్చాడు అని భాగ్యం అంటుంది. అదే నిజమైన రామరాజు అది అసలు మ్యాటరు అలా పొరపాటున మీ ఇంటికి వచ్చాడు అని క్లారిటీ ఇస్తారు. ఈ మేటర్ ఇంతటితో వదిలేస్తే బాగుంటుందని రామరాజు అనగానే భాగ్యం అమ్మయ్య బ్రతికిపోయామని మనస్సులో అనుకుంటుంది.
ఇంకా ఈ బయట ఎందుకు పదండి లోపలికిని రామరాజు తోపాటు ఆనందరావు భాగ్యం కూడా లోపలికి వెళ్ళాలనుకుంటారు. ఈ గండం నుంచి ఎలాగోలాగా గట్టేక్కామని భాగ్యం అనుకుంటుంది.. కానీ నర్మదకు మాత్రం ఎక్కడో ఏదో జరుగుతుంది అని అనుమానం అయితే మొదలవుతుంది.. భాగ్యంతాను తానే మాట్లాడుకోవడం నర్మద వింటుంది. దొంగతనానికి వచ్చింది మరెవరో కాదు ఈ భాగ్యం వల్ల ఆయనే అని అనుకుంటుంది.. ఇంట్లోకి వెళ్లిన ఆనందరావుని నర్మదా ఒక కంట కనిపెడుతూ ఉంటుంది.. నిజంగానే ఈ ఆనందరావు దొంగతనానికి వచ్చాడా ఏం తీసుకెళ్లడానికి వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ రచ్చ రచ్చగా ఉండబోతుందో చూడాలి…