E-Paper
Advertisement

ఊర్లోకి అడుగుపెడితే చంపేస్తామన్నారు.. భయంతో అలాంటి పని చేసిన బుల్లితెర నటి!

ఊర్లోకి అడుగుపెడితే చంపేస్తామన్నారు.. భయంతో అలాంటి పని చేసిన బుల్లితెర నటి!
Advertisement

Preethi Nigam: సినిమాల సంగతి కాస్త పక్కన పెడితే.. సీరియల్స్ కి మహిళలు ఎంతలా కనెక్ట్ అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో టీవీ సీరియల్స్ కి ఆదరణ తక్కువగా ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత నుంచి ఈ ఆదరణ మరింత పెరిగిపోయింది. అటు సీరియల్స్ కూడా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. నిజ జీవితాలకు అద్దం పడుతూ దర్శకులు ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసేలా అద్భుతమైన కథలతో సీరియల్స్ కొనసాగిస్తున్నారు. అయితే ఈ సీరియల్స్ లో నటిస్తున్న హీరోలు, విలన్లు, హీరోయిన్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. వీరిని తమ ఇంటి మనుషులుగా ఓన్ చేసుకుంటున్నారు .

అక్కడికి వస్తే చంపేస్తామన్నారు -ప్రీతి నిగమ్..

ఇప్పటికే వంటలక్క, డాక్టర్ బాబు వంటి క్యారెక్టర్లకు ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు సీరియల్స్ లో విలన్ గా నటిస్తున్న వారికి కూడా ఇప్పుడు అంతే పాపులారిటీ లభిస్తోంది. అందులో భాగంగానే ఒక నటి విలన్ పాత్రలో నటించి ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది ..ఇక ఆమెను నిజజీవితంలో దొరికితే చంపేస్తామనే రేంజ్ లో ప్రేక్షకులు ఆమెపై పగబట్టేశారు. అందుకే ఆ ఊరికి వెళ్తే కొడతామని, చంపేస్తామని బెదిరించారట. మరి ఆమె ఎవరు? అసలు ఏంటా విషయాలు? ఇప్పుడు చూద్దాం.

విలన్ గా నటించడం అంత ఈజీ కాదు..

Advertisement

ఆమె ఎవరో కాదు ప్రముఖ బుల్లితెర నటి ప్రీతి నిగమ్(Preethi Nigam). ఈమె గతంలో సినిమాలలో కూడా నటించింది. ముఖ్యంగా బుల్లితెర ఈటీవీ ఛానల్ లో ప్రసారమైన ఎన్నో సీరియల్స్ లో లేడీ విలన్ గా నటించిన ప్రీతి నిగమ్ ఋతురాగాలు సీరియల్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత వరుస సీరియల్స్, సినిమాలు అంటూ బిజీగా మారి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. లఇప్పటికీ కూడా వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా మారిన ఈమె ఒకానొక ఇంటర్వ్యూలో తాను పోషించిన విలన్ పాత్రల గురించి మాట్లాడుతూ..” విలన్ పాత్ర పోషించడం సీరియల్స్ లో చాలా కష్టం. ఒకసారి విజయవాడలో హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ బాయ్ నా వైపు ఏదోలా చూశాడు. అతడి చూపుకి మొదట నేను భయపడ్డాను. ఆ తర్వాత ఎందుకు అలా చూస్తున్నావ్ అని అడిగితే మీరు ఆ సీరియల్ లో చేశారు కదా.. ఇంట్లో మా నాన్నమ్మ ప్రతిరోజు మిమ్మల్ని తిడుతూ ఉంటుంది అని చెప్పాడు. ఇక మరొకసారి వైజాగ్ వెళ్లడానికి ట్రైన్ ఎక్కినప్పుడు ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి.. మీరు మా ఊరికి రావద్దు అండి. అక్కడికి వస్తే మా వాళ్ళు మిమ్మల్ని కొట్టడం లేక చంపడం జరుగుతుంది అంటూ హెచ్చరించింది” అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే మొదట భయం వేసినా ఆ తర్వాత తన నటన అందర్నీ మెప్పించింది అనే సంతోషం తనలో ఎక్కువగా కలిగింది అని ఆమె తెలిపింది.

ఇలాంటి ఘటనలు నటనకు ప్రతిరూపం.

నిజానికి ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు నటీనటులు తమ పాత్రలకు ఎంత ప్రాణం పోస్తున్నారో , ఆ పాత్రలకు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు . ఈమె నటించిన కావ్యాంజలి సీరియల్ లో తన పాత్రకు నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇక ప్రస్తుతం కలిసుందాం రా అనే సీరియల్ లో నటిస్తోంది ప్రీతీ నిగమ్.

Advertisement

also read:Tamannaah Bhatia: మద్రాస్ హైకోర్టులో తమన్నాకు చుక్కెదురు.. అసలేం జరిగిందంటే?

Related News

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×