E-Paper
Advertisement

Big TV Kissik Talks: 70 ఏళ్ల వాళ్లకి ఎందుకు పాలిటిక్స్?.. నేను రాజకీయాల్లోకి వస్తా!- వరు

Big TV Kissik Talks: 70 ఏళ్ల వాళ్లకి ఎందుకు పాలిటిక్స్?.. నేను రాజకీయాల్లోకి వస్తా!- వరు
Advertisement

Big TV Kissik Talks: వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarath Kumar) అనగానే డేరింగ్ అండ్ డాషింగ్ వుమెన్ అని అంతా అనుకుంటారు. అలాంటి పర్సన్ రాజకీయాల్లో ఉంటే.. అవును, ఇది ఏదో ఒక రోజు జరగబోతుందని అంటున్నారు వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు కచ్చితంగా పాలిటిక్స్‌లోకి వస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఇంట్లో తండ్రీకూతుళ్లు ఎలా ఉంటారో నేను, మా నాన్న కూడా అలానే ఉంటాం. కాకపోతే నా గురించి ఎక్కువగా కంప్లయింట్స్ నాన్నకు వెళుతుండేవి. ఒకసారి, నన్ను ముగ్గురు వెధవలు టచ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. వాళ్లని పట్టుకుని కొట్టాను. పోలీస్ వాళ్లు మా నాన్నకు ఫోన్ చేసి, మీ అమ్మాయి స్టేషన్‌లో ఉందని అనగానే.. ‘అయ్యో.. ఏమైంది’ అనగానే.. అసలు కొట్టిందే మీ అమ్మాయి సార్ అని చెప్పారు. వాళ్లని అలా కొట్టాను. పబ్లిక్ కూడా వచ్చి నన్ను ఆపుతున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ఎవరైనా తప్పు చేస్తే, వెళ్లి కొట్టేసేదాన్ని. అలాంటి కంప్లయింట్స్ నాన్నకు వెళ్లేవి.

Also Read- Big Tv Kissik Talks: తమిళ ఇండస్ట్రీ నన్ను వాడుకోలేదు.. వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్!

యంగ్ స్టర్స్ పాలిటిక్స్‌లోకి రావాలి

Advertisement

నాకు పాలిటిక్స్ (Politics) అంటే ఇష్టం. కచ్చితంగా ఏదో ఒకరోజు పాలిటిక్స్ లోకి వస్తాను. మా ఫ్యామిలీలో ఉన్న వాళ్లందరికీ హెల్పింగ్ నేచర్ ఉంది. మన వల్ల అవుతుంది అనుకుంటే ఫ్యామిలీ మొత్తం హెల్ప్ చేయడానికి ముందుంటారు. నాకు కూడా హెల్పింగ్ నేచర్ అక్కడి నుంచే వచ్చింది. పాలిటిక్స్ అనేది ఏం బ్యాడ్ వర్డ్ కాదు. ఇంకా యంగ్ స్టర్స్ అందరూ పాలిటిక్స్‌లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. అసలిప్పుడు ఏం ప్రాబ్లమ్ నడుస్తుందనేది యూత్‌కి బాగా తెలుసు. ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలనేది వాళ్లకే తెలుసు. అంతేకానీ, ఎవరో 70 ఏళ్ల వయసున్నోళ్లు వచ్చి పాలసీ డిక్టేట్ చేస్తే.. వాళ్లకి ఏం తెలుస్తుంది.. ఇక్కడ ఏం జరుగుతుందనేది? ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడం ఎంతో అవసరం. అందుకే, యంగ్ స్టర్స్ తప్పకుండా పాలిటిక్స్‌లోకి రావాలి. నేను సీఎం అయితే మాత్రం మహిళల విషయంలో చాలా మార్పులు తీసుకొస్తాను. అత్యాచారాలు చేస్తే కట్ చేయడమే.

Also Read- Kissik Talks: ఆ థాట్ ప్రాసెస్ వస్తేనే మార్పు.. లేదంటే దమ్ములేనట్టే!.. సోషల్ మీడియాపై వరలక్ష్మి

తెలుగు రాజకీయాల్లోకే..

Advertisement

ఇండియాలో చెత్త ఎక్కడపడితే అక్కడ వేసేస్తుంటారు. అది నాకు చాలా ఇరిటేషన్‌గా అనిపిస్తుంది. ఇండియాలో చెత్తని ఎక్కడపడితే అక్కడ వేసే వ్యక్తిని ఫారిన్ తీసుకెళ్తే చెత్త కుప్పగా వేయడు.. ఎందుకు? అక్కడ ఫైన్ వేస్తారు. ఆ భయాన్ని కలిగించాలి. అత్యాచారం చేసి జైలుకి వెళ్లి, మళ్లీ బెయిల్ తీసుకుని బయటకు వస్తున్నా.. ఇక్కడ ఎక్కడుంది భయం? ఆ భయం రావాలంటే ఇలాంటి శిక్షలు అవసరం. అరబ్ కంట్రీస్‌లో క్రైమ్ రేట్ అందుకే తక్కువగా ఉంది. నేను రాజకీయాల్లోకి రావాలంటే చెన్నై మాత్రమే కావాల్సిన అవసరం లేదు. తెలుగు రాజకీయాల్లోకి కూడా రావచ్చు. ఎక్కడ నుంచి అని కాదు, మనం ఏం చేస్తున్నామనేదే ముఖ్యం..’’ అని వరలక్ష్మీ చెప్పుకొచ్చారు.

Also Read- Vijay Deverakonda: పెళ్లికి పిలవచ్చుగా.. చిన్నారికి విజయ్ రిప్లయ్.. నెటిజన్లు ఫిదా!

Related News

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

Big Stories

Advertisement
×