E-Paper
Advertisement

Iran President: గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు.. దాడులు చేస్తూ సారీ ఏంటో?

Iran President: గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు.. దాడులు చేస్తూ సారీ ఏంటో?
Advertisement

Iran President: అమెరికా, ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకు పడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ శనివారం పొరుగు దేశాలపై దాడులకు క్షమాపణలు చెప్పారు. మరో వైపు క్షిపణులు, డ్రోన్లు.. గల్ఫ్ అరబ్ దేశాల వైపు దాడులకు పాల్పడుతున్న సమయంలోనే ఆయన క్షమాపణలు చెప్పారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ను కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు.

ట్రంప్ వార్నింగ్

ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ ఇరాన్ పై వైమానిక దాడితో యుద్ధం ప్రారంభం అయింది. ఇరాన్‌ను పర్యవేక్షిస్తున్న ముగ్గురు సభ్యుల మండలిలో భాగమైన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ తాజాగా గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పారు. అయితే ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ వార్నింగ్ ను పెజెష్కియన్ తోసిపుచ్చారు. పెజెష్కియాన్ మాట్లాడిన కొంత సేవపటికే ట్రంప్ తమ సోషల్ మీడియా పోస్ట్‌లో మరిన్ని ఇరానియన్ ప్రాంతాలు, ప్రజలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ దాడులను ముమ్మరం చేస్తుంది. సౌదీ ప్రధాన చమురు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. పెజెష్కియాన్ క్షమాపణ చెప్పిన గంట తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్ లపై దాడులు జరిగాయి.

ఇరాన్ భిన్న ప్రకటనలు

Advertisement

ఇరాన్ దాడులపై ఆ దేశ అగ్ర నాయకత్వం సాయుధ దళాలతో సంప్రదింపులు జరుపుతోందని అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటన చేశారు. “ఇరాన్ దాడి చేసిన పొరుగు దేశాలకు నా తరపున క్షమాపణ చెబుతున్నాను” అని అధ్యక్షుడు అన్నారు. “ఇప్పటి నుంచి, పొరుగు దేశాలపై దాడి చేయకూడదు లేదా వాటిపై క్షిపణులను ప్రయోగించకూడదు, ఆ దేశాలు మనపై దాడి చేయకపోతే తప్ప. దీనిని దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని నేను భావిస్తున్నాను” అని అన్నారు. ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి జనరల్ అబోల్ఫాజల్ షెకార్చి మాట్లాడుతూ… అమెరికాకు స్థావరాలు ఇవ్వని దేశాలపై దాడి చేయలేదన్నారు.

Also Read: యుద్ధంలో మునిగిన ఇరాన్‌పై.. ప్రకృతి కన్నెర్ర.. మరోసారి భూకంపం

Advertisement

ఇరాన్ పై దాడికి గల్ఫ్ అరబ్ ప్రభుత్వాలకు ఆయుధాలు రాలేదని అధ్యక్షుడు అన్నారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నామన్నారు. టెహ్రాన్ గల్ఫ్ దేశాల్లో సైనిక స్థావరాలు, అమెరికా ఆస్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని చెప్పారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్‌లో 1,230 మంది, లెబనాన్‌లో 200 మందికి పైగా, ఇజ్రాయెల్‌లో 11 మంది మరణించారని అధికారులు తెలిపారు. అలాగే ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు. ఇరాన్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు షెల్టర్లతో తలదాచుకుంటున్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×