E-Paper
Advertisement

Viral News: కాశ్మీర్ మంచు ఢిల్లీలో అమ్మకం, ఆ కుర్రాడి ఆలోచన మామూలుగా లేదు, వీడియో వైరల్

Viral News: కాశ్మీర్ మంచు ఢిల్లీలో అమ్మకం, ఆ కుర్రాడి ఆలోచన మామూలుగా లేదు, వీడియో వైరల్
Advertisement

Viral News: మన ఆలోచన వ్యాపారానికి పెట్టుబడి.. దాంతో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. ధృవ్ సినిమాలో హీరో-విలన్ తొలిసారి ఎదురుపడేటప్పుడు వచ్చే డైలాగ్. దాన్ని నిజం చేశాడు ఢిల్లీకి చెందిన ఓ యువకుడు. కాశ్మీర్‌ మంచుని ఢిల్లీలో అమ్మకం పెట్టాడు. ఎంత సంపాదించాడో తెలుసా? దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

కాశ్మీర్ మంచు ఢిల్లీలో అమ్మకం

Advertisement

కాస్త టాలెంట్.. పట్టుదల ఉండాలే కానీ అనుకున్నది ఈజీగా సాధించవచ్చు. ఢిల్లీ యువకుడు అదే చేశాడు. జమ్మూ కాశ్మీర్‌ని మంచు దుప్పటి కమ్మేసింది. అక్కడ ఎటుచూసినా హిమపాతం దర్శనమిస్తోంది. ప్రస్తుతం ప్రజలు హిమపాతం గురించి చర్చించుకుంటున్నారు. కొందరు హిమపాతంలో వివాహాలు కూడా చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఢిల్లీకి చెందిన ఓ యువకుడు.

జమ్మూకాశ్మీర్ వెళ్లేటప్పుడు కూలింగ్ బాక్స్‌ని తన వెంట తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఎందుకని ఎవరు ప్రశ్నించినా ఏ మాత్రం చెప్పలేదు. కాశ్మీర్‌లో ఆ బాక్స్‌ నిండా మంచుతో ఫుల్ చేశాడు. గాలి చొరబడకుండా ప్యాకింగ్ చేశాడు. అక్కడి నుంచి ఓ వాహనంలో నేరుగా ఎయిర్ పోర్టుకి చేరుకున్నాడు.

Advertisement

ఢిల్లీ టీనేజర్ సాహసం.. నెట్టింటో వీడియో వైరల్

వాహనంలో యువకుడు మాట్లాడుతున్న విషయాలను జాగ్రత్తగా ఫోన్‌లో రికార్డు చేశాడు. ఆ తర్వాత విమానంలో పలువురు ప్రయాణికులతో మాట్లాడాడు. అందుకు సంబంధించిన వివరాలను రికార్డు చేశాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగి ఆ బాక్స్‌ని కన్నాట్ ప్లేస్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కిలో 20 రూపాయల చొప్పున మంచుని అమ్మేశాడు. ఆ బాక్సు మంచుకి కేవలం రూ.240 సంపాదించాడు.

అదేంటి అనుకుంటున్నారా? ఆ మంచు ఢిల్లీకి వచ్చేసరికి కొంత నీరుగా మారిపోయింది. తాను చేసింది నిజమా? అబద్దమా? అనేది తెలియడం కోసం వీడియో కూడా షూట్ చేసి యువకులకు చూపించాడు. కాశ్మీర్ వెళ్లకుండా మంచు మన దగ్గరకు వచ్చిందని సంబరపడిపోయారు. వెంట వెంటనే ఆ మంచుని కొనుగోలు చేశాడు. దీని సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ALSO READ: కాకుల గుంపును మర్డర్ అని ఎందుకు పిలుస్తారు? దీని వెనుక కథ ఇదే

ఆ టీనేజర్ ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  16 మిలియన్ల మంది ఆ వీడియో వీక్షించారు. ఆ యువకుడిపై నెటిజన్స్ రకరకాలుగా ప్రస్తావిస్తున్నాడు. ఆ యువకుడు మంచు తీసుకురాలేదని, ఓ స్టార్టప్ ఐడియాను తెచ్చాడని వ్యాఖ్యానించారు. సంపాదించాలనుకునే వ్యక్తులు ఏ విధంగానైనా సంపాదించవచ్చని మరొకరు అన్నారు.  ఎంతకు మంచుని అమ్మాడని కంటే.. ఐడియాను అందరూ మెచ్చుకుంటున్నారు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×