E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!
Advertisement

Nagpur Assault: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సభ్య సమాజం తలదించుకునేలా దారుణ ఘటన వెలుగుచూసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ పోలీసు అధికారిని కొందరు వ్యక్తులు అత్యంత అనాగరికంగా దాడి చేశారు. కారులో వెళ్తున్న వ్యక్తిని బైక్ లతో అడ్డగించి.. విచక్షణారహితంగా కొట్టారు. రోడ్డుపై పడేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి.

పోలీసుల సమాచారం ప్రకారం.. ఓ చిన్న గీత విషయంలో వివాదం మెుదలైంది. 35 ఏళ్ల పోలీసు అధికారి.. ఓ మహిళతో కలిసి మంకపూర్ చౌక్ కు ప్రైవేటు వాహనంలో వెళ్తుండగా.. 8 బైకులపై వచ్చిన గుంపు అతడ్ని అడ్డుకుంది. కారు నుంచి బయటకు లాగి విపరీతంగా దాడి చేసింది. జూన్ 28వ తేదీ రాత్రి సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అతడ్ని కొట్టడంతో పాటు కారును సైతం నిందితులు ధ్వంసం చేశారు.

Advertisement

సీసీటీవీ విజువల్స్ పరిశీలిస్తే.. తొలుత నిందితులు తమ బైక్స్ ను కారు ముందు అడ్డంగా ఆపారు. ఆపై కారు నడుపుతున్న పోలీసులను దూషించడం ప్రారంభించారు. అనంతరం రోడ్డుపై కొట్టుకుంటూ.. ఈడ్చుకెళ్లారు. దీంతో ఏం జరుగుతుందో అర్ధంగాక.. స్థానికులు సైతం మిన్నకుండిపోయారు. ఆపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోగా.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని బాధితుడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Also Read: పశ్చాత్తాపం లేదు.. పైగా వికృత చేష్టలు.. సియా వీడియో నెట్టింట వైరల్!

ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మెుత్తం 14 మందిని అరెస్టు చేశారు. నిందితులను హర్ష్ పవార్, గౌరవ్ ధిర్డే, గణేష్ పురి, ప్రతీక్, సత్యం, ప్రేమ్ రాజ్, ఆకాశ్, నితిన్, విక్కీ, భూమి దేవ్, గణేష్, ప్రీతమ్, తికారమ్ గా గుర్తించారు. నిందితుల్లో కొందరికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 5 ద్విచక్ర వాహనాలతో పాటు రూ.5.6 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Also Read: నగరంలో వరుస హత్యలు… పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే సీరియల్ కిల్లర్

Related News

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

జీతం కోతలపై హెచ్‌ఆర్‌ను నిలదీసిన ఉద్యోగి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో!

గిన్నిస్ రికార్డర్ క్రేజీ ఐడియా.. కుమారుడి పెళ్లి కోసం ‘పలక’ శుభలేఖ.. నెట్టింట వైరల్!

Big Stories

×