Metro Viral: మెట్రో ప్రయాణాల్లో కొందరు ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తే, మరికొందరు పుస్తకాలు చదువుతూ కనిపిస్తుంటారు. అయితే, ఇటీవల మెట్రో రైళ్లలో జరుగుతున్న కొన్ని ‘పుస్తక పఠనాలు’ ప్రయాణికులకు వినోదంతో పాటు షాక్‌కు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఒక యువతి మెట్రోలో కూర్చుని వింత పుస్తకం చదువుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వగా, తాజాగా దానికి గట్టి కౌంటర్ ఇచ్చేలా ఒక యువకుడు చేసిన పని ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ పుస్తకం చూసి అంతా షాక్!
కొద్దిరోజుల క్రితం ఒక మెట్రో రైలులో ప్రయాణిస్తున్న యువతి చేతిలో ఉన్న పుస్తకం అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై ‘‘మగాళ్లను చంపి తప్పించుకోవడం ఎలా?’’ అని రాసి ఉంది. అది చూసిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో.. “బాబోయ్.. ఈ అమ్మాయిల ఆలోచనలు ఇలా ఉన్నాయా?” అంటూ మగాళ్లంతా కాస్త భయాందోళనలు, మరికొందరు జోకులు పేల్చారు. నెటిజన్లు కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున చర్చలు జరిపారు.
‘మైండ్ బ్లోయింగ్’ కౌంటర్!
అమ్మాయిలు అంతటితో ఆగితే, మగాళ్లు ఊరుకుంటారా? అన్నట్లుగా తాజాగా దీనికి అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు ఓ భర్త. అదే మెట్రో రైలులో, సరిగ్గా అలాంటి సీట్లోనే కూర్చుని.. ‘‘భార్యను బొందపెట్టడం ఎలా?’’ అనే పుస్తకాన్ని చదువుతూ కనిపించాడు. ఈ ఫోటో కాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియాలో నవ్వుల పువ్వులు పూశాయి. “అమ్మాయికి మొగుడు.. మొగుడికి యముడు” అన్నట్లుగా.. ఆ యువతి వేసిన ‘చంపేసే’ ప్లాన్‌కు, ఈ యువకుడు ‘బొందపెట్టే’ స్కెచ్‌తో సరైన కౌంటర్ ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
నెట్టింట నవ్వుల పండగ!
ఈ రెండు ఫోటోలను పక్కపక్కన పెట్టి నెటిజన్లు చేస్తున్న మీమ్స్, కామెడీ కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. “మగాళ్ల పవర్ ఏంటో చూపించావ్ బ్రదర్”, “మీ ఇద్దరి యుద్ధంలో అమాయక ప్రయాణికులు బలవ్వకుండా ఉంటే చాలు” అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. ఏదేమైనా, ఇవి నిజంగా ఒకరిపై ఒకరు పగతో చదువుతున్న పుస్తకాలు కావు. కేవలం సస్పెన్స్, డార్క్ హ్యూమర్ నవలలు (Dark Humor Novels). కానీ, మెట్రో రైలు వంటి పబ్లిక్ ప్లేసుల్లో ఇలాంటి టైటిల్స్ ఉన్న పుస్తకాలు చదవడం మాత్రం తోటి ప్రయాణికులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది.
Also Read: “మాకు రోడ్డు కావాలి సార్..!” బురద బాటలో బాల్యం.. జంగారెడ్డి గూడెం హాస్టల్ పిల్లల కన్నీటి ఆవేదన
‘భార్యను బొందపెట్టడం ఎలా?’
ఇటీవల ఒక మెట్రో రైలులో ‘‘మగాళ్లను చంపి తప్పించుకోవడం ఎలా?’’ అనే పుస్తకాన్ని ఓ యువతి చదవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా మెట్రో రైలులోనే ఓ వ్యక్తి ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ అనే పుస్తకాన్ని చదవుతూ… pic.twitter.com/xA8KAGBb43
— ChotaNews App (@ChotaNewsApp) July 4, 2026