E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?
Advertisement

Viral News: వియత్నాంలోని ఓ భారతీయ కుటుంబం ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. హోచిమిన్ సిటీలో భారతీయ రెస్టారెంట్‌లో సిబ్బందిని బెదిరించడం, ఆస్తి నష్టం చేశారని ఆరోపించింది రెస్టారెంట్ యాజమాన్యం. ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం

Advertisement

వియత్నాంలోని ఫేమస్ సిటీ హోచిమిన్. టూరిస్టు ప్రాంతం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో అక్కడికి వస్తుంటారు. డిస్ట్రిక్ట్ 1లో బాంబే బైట్స్ హెచ్‌సీఎం పేరిట భారతీయ రెస్టారెంట్ ఉంది. అక్కడికి వచ్చిన ఓ భారతీయ ఫ్యామిలీ వచ్చింది. పేరెంట్స్ తోపాటు పిల్లలు నానా హంగామా చేశారు.

డైనింగ్ ఏరియాలో టిష్యూలు విసురుతూ అల్లరి చేయడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి టేబుల్ నుండి ప్లేట్లు, గ్లాసులు తీసుకుని నేలపై విసిరేయడం కనిపించింది. ఈ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బంది వారి తల్లిదండ్రులకు వివరించారు. పిల్లల అల్లరి ఆపాలని కోరారు. దీనికి పిల్లలను మందలించాల్సింది పోయి రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం కలకలం రేపింది.

Advertisement

ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ రెస్టారెంట్ ఓనర్‌కు బెదిరింపులు

తమపై నోరు పారేసుకోవడం, ఆస్తిని ధ్వంసం చేసిందని రెస్టారెంట్ యజమాని ఐశ్వర్య ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తావించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. రెస్టారెంట్ ప్లే గ్రౌండ్ కాదని, మా సిబ్బందిపై మీ కోపానికి, అహంకారానికి కారణం చెప్పాలన్నారు.  ఇన్‌ఫ్లుయెన్సర్లు అయినంత మాత్రాన మర్యాదను మించి ప్రవర్తించలేదన్నారు.

పిల్లలకు బాధ్యత నేర్పించడం, ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడటం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు. ఆతిథ్యం ఇవ్వడం తమ వృత్తి అని, కనీస మర్యాద పాటించడం అందరి బాధ్యత పేర్కొన్నారు. రెస్టారెంట్ యజమాని పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ALSO READ: జీతం కోతలపై హెచ్‌ఆర్‌ను నిలదీసిన ఉద్యోగి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో!

వారెవ్వా తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే ఉంటుందని, పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందంటూ కామెంట్లు పెడుతున్నారు. పర్యాటకుల ప్రవర్తన, బహిరంగ ప్రదేశాల్లో తల్లిదండ్రుల బాధ్యత వాటిపై చర్చ మొదలైంది. రెస్టారెంట్ యాజమాన్యం చేసిన ఆరోపణలపై ఆ భారతీయ ఫ్యామిలీ ఇంకా స్పందించలేదు.

 

Related News

జీతం కోతలపై హెచ్‌ఆర్‌ను నిలదీసిన ఉద్యోగి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో!

గిన్నిస్ రికార్డర్ క్రేజీ ఐడియా.. కుమారుడి పెళ్లి కోసం ‘పలక’ శుభలేఖ.. నెట్టింట వైరల్!

ఈ అత్త ఎంత మంచివారో.. తన కోడలి కోసం ఏం చేశారో చూడండి!

బాబోయ్.. 7 అడుగుల ఎత్తు కోసం ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్న యువకుడు.. అసలు కథ ఇదీ!

నలుగురు పిల్లల తల్లి కోసం టవరెక్కిన ప్రేమికుడు.. క్లైమాక్స్ మామూలుగా లేదుగా!

ఇంట్లో వందలాది పాములు.. కరెంట్ బిల్లుకు బయట పడ్డా షాకింగ్ ఘటన

రీల్స్ చూసి విసుగొచ్చిందా? నెటిజన్లను పిచ్చెక్కిస్తున్న సరికొత్త ట్రెండ్!

Big Stories

×