E-Paper
Advertisement

Vande Bharat Rail: వందే భారత్ రైలు నడపడానికి గొడవపడ్డ లోకో పైలట్లు.. వీడియో వైరల్

Vande Bharat Rail: వందే భారత్ రైలు నడపడానికి గొడవపడ్డ లోకో పైలట్లు.. వీడియో వైరల్
Advertisement

Vande Bharat Express Clash.. between Kota and Agra division employess: యూపీ, రాజస్థాన్ మధ్య ఆగ్రా ఉదయ్ పూర్ కోటా వందే భారత్ రైలు ప్రారంభోత్సవం రోజున ఆగ్రా, కోటా రైల్వే డివిజన్ ఉద్యోగులు రైలును నడపడానికి గొడవలకు దిగడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. గురువారం వందేభారత్ కు సంబంధించిన ఉద్యోగి లోకో పైలట్ అతని హెల్పర్ ని బట్టలు చించేసి, శారీరకంగా దాడులు చేయడంతో వివాదం మరింత జఠిలంగా మారింది. అసలేం జరిగిందంటే.. కొత్తగా ప్రారంభించిన వందేభారత్ రైలును ఆగ్రా-ఉదయ్ పూర్ మధ్య నడిపించడంపై కోటా రైల్వే డివిజన్ ఉద్యోగులు గురువారం నుంచి గొడవలకు దిగారు. ఇదే రైలులో ప్రయాణిస్తున్న గార్డు గది తలుపులు, అద్దాలు సైతం పగలగొట్టారు. అయితే ఈ విషయం ఎట్టకేలకు రైల్వే ఉన్నత అధికారులకు చేరింది. దీనిపై ఇంకా అక్కడ ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి.

ఆగ్రా గార్డు ఫిర్యాదు

Advertisement

ఆగ్రా డివిజన్ రైల్వే ఉద్యోగి గార్డు రాఘవేంద్ర సరస్వత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొందరు గుర్తు తెలియని రైల్వే సిబ్బందిపై కేసు నమోదు చేశామని.. దీనిపై సమగ్ర విచారణ జరిపి వారిని ఎలాగైనా పట్టుకుని శిక్షిస్తామని.. అవసరమైతే సస్సెండ్ చేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ గొడవంతా గంగాపూర్ సిటీ జంక్షన్ పరిధిలోని రైల్వే రక్షక సిబ్బంది ఎదుటే జరిగింది. జనం కూడా ఈ గొడవంతా వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది. అయినా రక్షక సిబ్బంది వారించాల్సింది పోయి సినిమా చూసినట్లు గా వ్యవహరించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ గొడవంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు కొందరు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

త్వరలోనే పరిష్కారం

Advertisement

రెండు డివిజన్ ల మధ్య గొడవలు త్వరలోనే పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. భారతీయ రైల్వే అంటేనే ఓ గౌరవ ప్రధమైన ప్రతిష్టాత్మక సంస్థ అని.. దీని గౌరవానికి భంగం కలిగించే వారు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు రైల్వే ఉన్నత అధికారులు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×