The Girlfriend Movie: నేషనల్ క్రష్ రష్మిక మందన్న దూకుడు మామూలుగా లేదు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ఛలో చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, భీష్మ వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లు అందుకుంంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పుష్ప సీక్వెల్స్ పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్సే. ఇటూ తెలుగు అటూ హిందీ వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరో సరసన నటిస్తున్న రష్మిక ఒక్క సినిమాను ఒకే చేసింది.
అదే ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమా హీరో దీక్షిత్ శెట్టి. కన్నడ నటుడు. దసరాలో సైడ్ హీరోగా చేశాడు. కనిపించింది కాసేపే. కానీ, మంచి గుర్తింపు పొందాడు. అయితే దీక్షిత్ కెరీర్‌లో చెప్పుకొదగ్గ హిట్, సినిమా లేదు. దియాతో కన్నడ, తెలుగులో మంచి గుర్తింపు పొందాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడిప్పుడే నటుడిగా ప్రూవ్ చేసుకుంటున్న దీక్షిత్ సరసన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రష్మిక హీరోయిన్‌గా నటించింది. నిజానికి ఇది ఉమెని సెంట్రిక్ మూవీ. కానీ, ఈ సినిమా మొత్తం హీరోహీరోయిన్ల చూట్టునే తిరుగుతుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ తెరకెక్కించాడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. యూత్ ఫుల్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమా నేడు (నవంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గీతా ఆర్ట్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. రిలీజ్‌కి ముందే సినీ ప్రముఖుల కోసం స్పెషల్ షోలు వేశారు. మూవీ చూసిన వారు కూడా ఆహా ఓహో అంటూ హైప్ పెంచారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ మూవీపై ప్రశంసలు కురిపించారు. దీంతో మూవీపై అంచనాలు కూడా పెరిగాయి. కానీ, థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ ఏముందంటూ బయటకు వస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వస్తుంది. సెకండాఫ్ బాగున్న ప్రేక్షకులను ఆకట్టునేంతగా ఏం లేదంటున్నారు. కేవలం యూత్‌ని మాత్రమే ఈ మెప్పించేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ చేసి తప్పు చేసిందనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.
Also Read: Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!
మరోవైపు డైరెక్టర్ కూడా పెద్దగా సక్సెస్ గ్రాఫ్ ఉన్నవాడు కాదు. రాహుల్ రవీంద్రన్ నటుడు కం దర్శకుడి, రైటర్ అనే విషయం తెలిసిందే. దర్శకుడిగా కంటే నటుడిగానే అందరికి సుపరిచితం. పైగా దర్శకుడిగా రచయితగా పెద్దగా మెప్పించిన సినిమాలేవి లేవు. అయిన అప్పుడప్పుడు తన దర్శకత్వంతో ప్రేక్షకులు మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. అలా వచ్చిన హిట్ కొట్టినవి ఒకటోరెండో. పైగా తమిళ దర్శకుడు. అలాంటి ఆయన తెలుగు సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఫలితం ఇలాగే ఉంటుంది. కథలో మంచి దమ్ము ఉంది. స్క్రిన్‌ప్లే కూడా బాగుంది. కానీ, రష్మిక రేంజ్ మూవీ కాదనేది ఫ్యాన్స్ అభిప్రాయం. పైగా దీక్షిత్ శెట్టి, రష్మికలు కన్నడ.. రాహుల్ రవీంద్రన్ తమిళ్. ముగ్గురు పరభాషకు చెందిన వారే. ఈ ముగ్గురితో సినిమా చేస్తే ఇలాగే ఉంటుంది. హీరోని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి తీసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అంటున్నారు.