Aaryan Movie Review : ‘విష్ణు విశాల్ కి ‘రాట్ససన్’ తర్వాత సరైన హిట్టు పడలేదు. కానీ ఇతను ఎంపిక చేసుకునే కథలు బాగుంటాయి అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకమే అతని లేటెస్ట్ మూవీ ‘ఆర్యన్’ పై కూడా కొంత బజ్ క్రియేట్ చేసేలా చేసింది. మరి ఫుల్ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
నయన(శ్రద్ద శ్రీనాథ్) ఓ పాపులర్ న్యూస్ ఛానల్లో పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె పనిచేస్తున్న ఛానల్ కి ఆత్రేయ(సెల్వ రాఘవన్) అనే వ్యక్తి వస్తాడు. ఓ కామన్ మెన్ లా వచ్చిన అతను ఒక షోలో పాల్గొంటున్న వ్యక్తిని కాల్చేసి నేనొక ఫెయిల్యూర్ రైటర్ ని నాకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు అంటూ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అతను చనిపోయే ముందు ఓ కథ చెబుతాడు.
‘అందులో 5 హత్యలు జరుగుతాయి. ఆ హత్యలు చేసిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి అని చెబుతాడు’. ఈ కేసుని సాల్వ్ చేసేందుకు పోలీసాఫీసర్ నంది(విష్ణు విశాల్)రంగంలోకి దిగుతాడు. తర్వాత ఆత్రేయ చెప్పినట్టే 5 హత్యలు జరుగుతాయి. ఆ హత్యలు చనిపోయిన వ్యక్తి ఎలా చేస్తాడు? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఆ చిక్కుముడులు హీరో ఎలా విప్పాడు. ఆ చనిపోయిన వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
పోలీస్ బ్యాక్ డ్రాప్లో వచ్చే సినిమాలు, లేదా మర్డర్ మిస్టరీలు వంటి సినిమాలకి ఆడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే.. పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అంటే.. ఓ పోలీస్ విలన్ కి ఎదురెళ్ళడం. అతని స్కాములు అన్నీ బయటపెట్టడం. బిజినెస్..లు దెబ్బతీయయడం.తర్వాత విలన్ హీరో ఫ్యామిలీని టార్గెట్ చేసి వేధించడం. క్లైమాక్స్ లో హీరో ఆ విషయాన్ని పర్సనల్ గా తీసుకుని విలన్ ని అంతం చేయడం. ఇది రెగ్యులర్ కాప్ స్టోరిల స్ట్రక్చర్.
ఇక మిస్టరీ అంటే.. సిటీలో సీరియల్ కిల్లింగ్స్ జరగడం. విలన్ ఎవరో చివరి వరకు చూపించకపోవడం. ఒకానొక టైంలో విలన్ హీరో అయినటువంటి పోలీస్ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి వేధించడం.. ఆ క్రమంలో పోలీస్ కి తన ఐడెంటిటీ రివీల్ చేసి.. అతని చేతిలో చావడం. ఇది మరో స్ట్రక్చర్. అందుకే ఇవి రెండూ రెగ్యులర్ ఫార్మేట్లు అయిపోయాయి. అయితే ‘ఆర్యన్’ కి ఉన్న ప్రత్యేకత చనిపోయిన వ్యక్తి మర్దర్లు చేస్తుండటం అనే పాయింట్. దీని చుట్టూ దర్శకుడు అల్లిన కథ బాగానే ఉంది.
ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కానీ సెకండాఫ్ మందగిస్తుంది. క్లయిమాక్స్ కి వచ్చేసరికి ట్విస్టులు అన్నీ ముందే గెస్ చేసే విధంగా ఉంటాయి. దీంతో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. క్లైమాక్స్ సాదాసీదాగా ముగుస్తుంది. అయితే టెక్నికల్ గా మాత్రం ‘ఆర్యన్’ నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ.. నైట్ బ్యాక్ డ్రాప్లో వచ్చే విజువల్స్ నేచురల్ గా అనిపిస్తాయి.
యాక్షన్ సీక్వెన్సుల్లో కూడా సినిమాటోగ్రాఫర్ టాలెంట్ చూపించాడు. దర్శకుడు ప్రవీణ్ కె సెకండాఫ్ పై ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉండాల్సింది. కనీసం క్లైమాక్స్ ని ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసినా సరిపోయేది. ఫలితం బెటర్ గా ఉండేది. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. దానికి పేరు పెట్టాల్సిన పనిలేదు.
నటీనటుల విషయానికి వస్తే.. విష్ణు విశాల్ ఎప్పటిలానే కష్టపడి చేశాడు.లుక్స్ విషయంలో అతను తీసుకున్న శ్రద్ద బాగుంది. పోలీస్ ఆఫీసర్ రోల్ కి అతని కటౌట్ సరిపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాగా చేశాడు. శ్రద్దా శ్రీనాథ్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆమె కూడా తన మార్క్ పెర్ఫార్మన్స్ తో మెప్పించింది. సెల్వ రాఘవన్ కనిపించినంత సేపు బాగానే చేశాడు. మానస చౌదరి పాత్ర పెద్ద ఇంపాక్ట్ చూపలేదు. మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.
ఫస్ట్ హాఫ్
ఇంటర్వెల్ సీక్వెన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
సెకండాఫ్
క్లైమాక్స్
మొత్తంగా… ‘ఆర్యన్’.. విష్ణు విశాల్ నుండి వచ్చిన మరో డీసెంట్ అటెంప్ట్. ‘రాట్ససన్’ స్థాయిలో మెప్పించదు. కానీ ఒకసారి టైం పాస్ గా చూసే విధంగా ఉంది.