Actress Khushbu: సీనియర్ నటి కుష్బూ (Khushbu) హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడపడమే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా బిజీగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ కుష్బూ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే తాజాగా నటి గౌరీ కిషన్ (Gouri Kishan) పట్ల మీడియా వారు బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మీడియా సమావేశంలో భాగంగా మీడియా వారు ఆమెను ఏకంగా మీ బరువు ఎంత అంటూ బాడీ షేమింగ్ కామెంట్లకు గురి చేశారు.
ఇక ఈ వ్యాఖ్యలపై హీరోయిన్ సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా నటి కుష్బూ సైతం ఈ వివాదం పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా మీడియా వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఖుష్బూ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. జర్నలిజం పూర్తిగా వారి విలువలను కోల్పోయారని తెలిపారు. ఒక మహిళ శరీర బరువు గురించి అడగడం కంటే కూడా వారి ప్రతిభ, పనితనం గురించి అడిగితే బాగుంటుందని హితువు పలికారు.
హీరోయిన్ బరువు గురించి ప్రశ్నలు వేయటం చాలా సిగ్గుచేటు అని తెలిపారు. ఒక హీరోయిన్ బరువు గురించి అడిగిన వారు హీరో బరువు గురించి అడగగలరా అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా మీ ఇంట్లో మహిళల విషయంలో ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా ఉంటుంది. ముందు ఎదుటివారికి గౌరవం ఇవ్వటం నేర్చుకోండి అంటూ ఈ సందర్భంగా గౌరీ కిషన్ విషయంలో కుష్బూ స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. గౌరీ కిషన్ విషయంలో కుష్బూ మద్దతుగా నిలవడంతో ఎంతోమంది కుష్బూ పోస్టుపై స్పందిస్తూ సానుకూలంగా కామెంట్ చేస్తున్నారు.
https://twitte.com/khushsundar/status/1986652779184828527?t=iydcGib9qMlIKpb8vaUOuw&s=19
ఇక గౌరీ కిషన్ విషయానికి వస్తే ఇటీవల 96 సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తాజాగా అదర్స్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగానే మీడియా వారి నుంచి గౌరీ కిషన్ కి ఈ తరహా ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్న అడిగిన వెంటనే గౌరీ కిషన్ కూడా స్పందిస్తూ.. నటిగా నేను మీ ముందు ఉన్నాను అంటే సినిమా గురించి,నా పాత్ర గురించి అడగాలి కానీ ఇలా బరువు గురించి కాదు ఇది నిజంగా మహిళలను కించపరచడమే అంటూ ఈమె కూడా తనదైన స్టైల్ లోనే మీడియా వారికి గట్టిగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఒక్కొక్క సెలబ్రెటీ స్పందిస్తూ నటి గౌరీ కిషన్ కి మద్దతు తెలియజేస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు మీడియా వారి నుంచి ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Also Read: Sujeeth: సుజీత్ డైరెక్షన్ లో క్రికెట్ దిగ్గజం సచిన్.. అసలేం జరిగిందంటే?