Anchor Shyamala: వైసీపీ గుట్టుని యాంకర్ శ్యామల బట్టబయలు చేశారా? పోలీసుల విచారణలో ఏం చెప్పారు? అంతా పార్టీపై తోసిశారా? ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చదివానని చెప్పే ప్రయత్నం చేశారా? కొన్ని ప్రశ్నలు ఎందుకు చెమటలు పట్టాయి? బయటకు వచ్చిన తర్వాత మిగతా రాజకీయ నేతల మాదిరిగా వ్యవహరించారా? అవుననే సమాధానాలు వస్తున్నాయి.
విచారణలో శ్యామల ఏం చెప్పారు?
వైసీపీ నేత, యాంకర్ శ్యామల రాజకీయ నేతగా మారిపోయారు. కర్నూలు పోలీసులు విచారణ తర్వాత మీడియా ముందుకొచ్చారు. ఆమె మాటలు చూసినవారు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ పోలీసులను ఆమె ప్రశ్నించారా? అంటూ చర్చించుకోవడం మొదలైంది. పోలీసులు విచారణ తర్వాత మీడియా ముందుకొచ్చారు యాంకర్ శ్యామల.
వైసీపీ అధికార ప్రతినిధిగా 10 ప్రశ్నలు అడిగానని అందులో తప్పేముందని ప్రశ్నించినట్టు చెప్పారు. తన ప్రశ్నలకు టీడీపీ నేతలు రిప్లై ఇవ్వకుండా కేసులు పెట్టడం ఏంటన్నది ఆమె మాట. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, తన పోరాటం ఆపబోనని తేల్చిచెప్పారు. సోమవారం ఉదయం కర్నూలు పోలీసు విచారణ నిమిత్తం శ్యామలతోపాటు పలువురు వైసీపీ నేతలు డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు.
పార్టీ స్క్రిప్ట్ ప్రకారమే చదివానని చెప్పారా?
డీఎస్పీ ఆధ్వర్యంలో పలువురు సీఐలు-మహిళా ఎస్సై సమక్షంలో ప్రశ్నించారు. దాదాపు గంటన్నరపాటు ఆమెని విచారించారు. కర్నూలు ట్రావెల్ బస్సు ప్రమాద గురించి కారణాలు తనకు తెలియవని చెప్పినట్టు తెలుస్తోంది. కేవలం వైసీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్టు వెల్లడించారట. ప్రమాదానికి ముందు శివశంకర్- ఎర్రిస్వామి బెల్టు దుకాణంలోని మద్యం తాగారని ఎవరు చెప్పారు?
అన్న ప్రశ్నకు నీళ్లు నమిలినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే చూపాలన్నారు విచారణ అధికారులు. ఈ విషయంలో అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేశారని ప్రశ్నించారు. పార్టీ ఆదేశాల మేరకు తాను మీడియా ముందు చెప్పానని అన్నట్లు తెలిసింది. తన వ్యవహారం వెనుక అంతా పార్టీ ఉందని తేల్చి చెప్పేశారు.
ALSO READ: విశాఖలో భూకంపం.. ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు
ఈ విషయంలో తన ప్రమేయం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. విచారణ తర్వాత ఆమె మాట్లాడిన ప్రతీ మాట రాజకీయ కోణంలోనే ప్రస్తావించారు. అక్టోబరు 24న కర్నూలు జిల్లాలో ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన వెనుక బెల్టుషాపులో నిందితుడు మద్యం తీసుకున్నారంటూ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఏకంగా 27 మందిపై అక్టోబరు 30న కేసు నమోదు అయ్యింది. విచారణకు రావాలని పలువురికి నోటీసులు పంపారు పోలీసులు. వైకాపా అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల, కారుమూరి వెంకటరెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ ప్రతినిధి నాగార్జునరెడ్డి, నవీన్, సీవీ రెడ్డిలను విచారించారు.