BigTV English
Advertisement

Road Accidents: ఒకేసారి వరుసగా 3 ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ప్రమాదాలు.. స్పాట్‌లో 65 మంది

Road Accidents: ఒకేసారి వరుసగా 3 ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ప్రమాదాలు.. స్పాట్‌లో 65 మంది

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు.. ఒకటి మరవక ముందే మరోకటి అన్నట్లుగా ఉంది. నేడు ఒక్కరోజే వరుసగా వేరు వేరు ప్రాంతాల్లో 3 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు బోల్తా.. స్పాట్ లో 65 మంది ప్రయాణికులు.. ఇలాంటి ఘటనలు చూసాక బస్సులో ప్రయాణం చేయాలంటేనే వణికిపోతున్నారు ప్రయాణికులు.. నేడు వేరు వేరు ప్రాంతాల్లో బస్సుల ప్రమాదాలు..


శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా..
శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ఘటనలో బస్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడి ఒకరు మృతి చెందగా.. ట్రాక్టర్‌లోని నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. CK పల్లి మండలం దామాజుపల్లి దగ్గర ప్రమాదం జరిగింది.

నల్గొండ జిల్లాలో మరో బస్సు ప్రమాదం..
నల్గొండ జిల్లాలో బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను వెనుక వైపు ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది దీంతో. రోడ్డుపై ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎటువంటి మరణాలు సంభవించలేదు.. అయితే ఈ ఘటన బస్సు కావలి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. కాసేపు అందరి గుండెలు ఆగిపోయే అంత ప్రమాదం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరి కాస్త ఊపిరి పిల్చుకున్నారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
తెలుగు రాష్ట్రాలను రోడ్డు ప్రమాదాలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బస్సు ఢీకొంది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తో సహా.. బస్సులో ఉన్న 15 మందికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ క్షతగాత్రులను అంబులెన్స్‌లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మెట్‌పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుగా గురించారు. హైదరాబాద్ నుంచి మెట్టుపల్లికి వెళ్తుండగా రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది.

Related News

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌‌లోనే ముగ్గురు

Coimbatore Gang Rape Case: కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. పోలీసులపై నిందితులు దాడి, ఆపై కాల్పులు

Hyderabad: అమీన్ పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ ఫూల్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Bus Accident: మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి, 40 మందికి గాయాలు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయలు

Constable suicide: రాష్ట్రంలో దారుణ ఘటన.. గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ సూసైడ్, ఎందుకంటే?

Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ప్రమాదం ఎలా జరిగింది..? బాధితులు ఏమంటున్నారంటే?

Big Stories

×