E-Paper
Advertisement

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?
Advertisement

ప్రపంచంలో అత్యతం దుర్భరమైన పరిస్థితులలో సూడాన్ దేశం కొట్టుమిట్టాడుతోంది. సంక్షోభ పరిస్థితులు నెలకొనడంతో  అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయుడిని సూడాన్ తిరుగుబాటుదారులు కిడ్నాప్ చేశారు. అల్ ఫషీర్‌ నగరం నుంచి అతడిని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) అనే తిరుగుబాటు సంస్థ ఎత్తుకెళ్లింది. కిడ్నాప్ చేయబడిన భారతీయుడిని ఆదర్శ్ బెహరాగా అధికారులు గుర్తించారు. సూడాన్ రాజధాని ఖార్టూమ్ నుంచి దాదాపు 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ ఫషీర్ నుండి కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు. 36 ఏళ్ల ఆదర్శ్ ను  దక్షిణ డార్ఫర్‌ లోని RSFకు పట్టున్న న్యాలాకు తీసుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు.  భారత్ లోని సూడాన్ రాయబారి మహమ్మద్ అబ్దుల్లా అలీ ఎల్టోమ్, అతడి విడుదలకు తమ దేశం ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు.

ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా

ఆదర్శ్ బెహెరా ఒడిశాలోని జగత్సింగ్‌పూర్ జిల్లాకు చెందినవాడు. మూడు సంవత్సరాల క్రితం సుకారాతి ప్లాస్టిక్ ఫ్యాక్టరీ అనే కంపెనీలో పని చేయడానికి సూడాన్‌ వెళ్లాడు. అతడికి పెళ్లైంది. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఒకరి వయసు 8 ఏళ్లు కాగా, మరొకరి వయసు మూడేళ్లు. RSF షేర్ చేసిన వీడియోలో, బెహెరా ఇద్దరు తిరుగుబాటుదారుల మధ్య కూర్చుని ఉన్నట్లు కనిపించింది. వారిలో ఒకరు అతడిని “మీకు షారుఖ్ ఖాన్ తెలుసా?” అని అడుగుతున్నట్లు వినిపించింది.

Advertisement

ఆదర్శ్ కిడ్నాప్ గురించి స్పందించిన సూడాన్ రాయబారి  

ఆదర్శ్ బెహరా కిడ్నాప్ వ్యవహారంపై భారత్ లోని సూడాన్ రాయబారి మహమ్మద్ అబ్దుల్లా అలీ ఎల్టోమ్ స్పందించారు.  బెహెరా సురక్షితంగా తిరిగి రావడానికి తన దేశంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. “రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) అపహరించబడిన భారతీయ పౌరుడు ఆదర్శ్ ను మేం చూశాం. వారు అతడిని సురక్షితంగా ఉంచాలని మేము ప్రార్థిస్తున్నాము” అని ఆయన వెల్లడించారు. “ఈ మిలీషియా ఇప్పటి వరకు చాలా దారుణాలు చేసింది. కానీ, వారు భారతీయ పౌరుడిని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేలా చూస్తారని ఆశిస్తున్నాము. ఒక ప్రభుత్వ అధికారిగా, అతడు భారతదేశానికి సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. అందుకు అవసరమైన ఏ ప్రయత్నం చేయడానికిఐనా మేం సిద్ధంగా ఉన్నాం. మేం భారత అధికారులతో సహకరిస్తాము. అతడు స్వదేశానికి సురక్షితంగా తిరిగి రావడానికి మేము చేయగలిగినదంతా చేస్తాం” అని వివరించారు.

Advertisement

Read Also: రైల్వే స్టేషన్ లో యువకుడి పైత్యం, అందరూ చూస్తుండగా మూత్ర విసర్జన, వీడియో వైరల్!

సూడాన్ అంతర్గత యుద్ధం గురించి..

గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న సూడాన్ అంతర్గత యుద్ధం కారణంగా 1,50,000 మందికి పైగా మరణించారు. దాదాపు 12 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. సైన్యం బలంగా ఉన్న డార్ఫర్‌ ను కూడా ఇటీవల RSF స్వాధీనం చేసుకుంది. ఇక్కడ సామూహిక హత్యలు, లైంగిక హింస, దోపిడీలు, కిడ్నాప్‌ లు కొనసాగుతున్నాయి. సైన్యం, RSF నాయకుల మధ్య యుద్ధం 2023లో ప్రారంభం అయ్యింది.

Read Also:  రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన బైకర్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×