Bandla Ganesh Speech: నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కామెంట్స్ ఈ మధ్య వివాదస్పదం అవుతున్నాయి. స్టేజ్ పైకి వచ్చి మైక్ పట్టుకుంటే బండ్లన్న స్పీచ్తో రెచ్చిపోతున్నారు. ఆయన ఒక ఈవెంట్ కి వచ్చాడంటే ఎవరోకరు టార్గెట్ అయినట్టే. గతంలోనూ పూరీ జగన్నాథ్, ఇటీవల నిర్మాత అల్లు అరవింద్పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా హీరోలను టార్గెట్ చేశారు. దీపావళి సందర్భంగా విడుదలైన కిరణ్ అబ్బవరం కె–ర్యాంప్ మంచి విజయం సాధించింది. దీంతో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్లో నిర్వహించిన కె–ర్యాంప్ సక్సెస్ సెలబ్రేషన్స్‌కి బండ్ల గణేష్ అతిథిగా వచ్చాడు.
ఈ సందర్బంగా స్టేజ్ పై మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం ఆకాశానికి ఎత్తేశాడు. ఎలాండి బ్యాగ్రౌండ్, ఫ్రండ్ రౌండ్ లేకుండా వచ్చి వరుసగా సక్సెస్ అందుకుంటున్నాడని, ఎన్ని హిట్స్ కొట్టిన ఒదిగి ఉంటున్నాడంటూ కిరణ్ని పొగుడుతూ పలువురు యంగ్ హీరోలను ఉద్దేశిస్తూ కౌంటర్ వేశాడు. ఒక్క సినిమా హిట్ కాగానే వాట్సప్ వాట్సప్ అంటూ ఓవరాక్షన్ చేయడం. లూజ్ పాయింట్స్, ట్రోన్ జీన్స్.. క్యాప్లు పెట్టిన గొప్పలకు పోతున్నారు. అలాంటి వాళ్లు కిరణ్ అబ్బవరంని చూసి నేర్చుకోవాలంటూ ఆ హీరోలకు చురకలు అట్టించారు. సినిమా హిట్ కాగానే రాజమౌళిని తీసుకురాండి, సుకుమార్ని తీసుకురాండి అంటూ కళ్లు నెత్తికెక్కించుకున్నట్టు వారంత కిరణ్ అబ్బవరం చూసి మారండి.
వరుసగా ఆరు సినిమాలు చేసి హిట్స్ కొట్టాడు. అంతేకాదు ఈ ఆరు సినిమాలు కూడా కొత్త కొత్త డైరెక్టర్లతోనే చేశాడు.. హీరో అంటే ఇలా ఉండాలంటే కిరన్ అబ్బవరం ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే పోల్చుతూ ఆకాశానికి ఎత్తాడు. బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో ముగ్గురు హీరోలను టార్గెట్ చేసినట్టు ఉన్నాయి. ఎప్పుడు ఒకరిని విమర్శిస్తూ వివాదంలో నిలిచే బండ్లన్న ఈసారి కిరణ్ అబ్బవరంని పొగడటం అందరిని సర్ప్రైజ్ చేస్తుంది. అయితే ఈ పొగడ్తల వెనకు స్వయంగా ఆ హీరోనే ఉన్నాడని, కావాలనే బండ్లన్నతో పొగిడించుకోవడమే కాకుండా.. ఆ ముగ్గురు యంగ్ హీరోలను టార్గెట్ చేసేలా మాట్లాడించాడని సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బండ్లన్న కామెంట్స్ చూస్తుంటే ముఖ్యంగా ముగ్గురు యంగ్ హీరోలను టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది.
Also Read: Director Mani Ratnam: ‘బాహుబలి’ లేకపోతే ‘పొన్నియిన్ సెల్వన్’ లేదు.. రాజమౌళినే నాకు స్ఫూర్తి
వాట్సప్.. అనగానే ఆ హీరో ఎవరనేది అందరికి తేలిపోయింది. ఒక యంగ్ హీరో.. ఈ మధ్య రెండు సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దాని కంటే ముందు రెండు సినిమాలు చేశాడు. ఆ రెండు బ్లాక్ బస్టర్స్అయ్యాయి. సీక్వెల్స్ తో హిట్ కొట్టిన ఆ హీరో ఆ తర్వాత రొమాంటిక్ లవ్‌స్టోరీతో రెండు సినిమాలు చేశాడు. అవి రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. మరో యంగ్ హీరో కూడా ఈ మధ్య బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ చూస్తున్నాడు. కెరీర్ మొదట్లో తానే రైటర్ గా మారి సినిమాలు చేశాడు. సక్సెస్ అయ్యాడు. తర్వాత ఈ యంగ్ హీరోకు కొంచెం యాటిట్యూడ్ వచ్చింది అనే మాటలు వినిపించాయి. తర్వాత ఈయన చేసిన సినిమాలు అంతగా ఫర్మామ్ చేయడం లేదు. రీసెంట్ గా వచ్చిన రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. అయితే ఈ ముగ్గురు యంగ్ హీరోల యాటిట్యూడ్ని ఉద్దేశించే బండ్లన్న కె–ర్యాంప్ ఈవెంట్లో మాట్లాడడని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.