Ysrcp Politics: వైసీపీలో ఏం జరుగుతోంది? ఆ పార్టీ నేతలు నిజాలు మాట్లాడడం లేదా? మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ అబద్దాలు వల్లె వేస్తున్నారా? దానివల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదా? అధినేతకు భజన వద్దని ఎందుకన్నారు? నిజాలు చెబితేనే మంచి జరుగుతుందని ఆయన బలంగా నమ్ముతున్నారా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.
మేకపాటి సంచలన కామెంట్స్
మేకపాటి రాజమోహన్‌రెడ్డి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. జగన్ ఫ్యామిలీతో మేకపాటి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన, ఆ తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఈలోగా ఆయన కొడుకులు యాక్టివ్‌గా ఉండడంతో పార్టీ వైపు చూడడం మానేశారు.
వైసీపీలో జరుగుతున్న వ్యవహారాలను చూసిన ఆయన ఉండలేకపోయారు. చెప్పాల్సిన నాలుగు మాటలు పార్టీకి చెప్పలేదు. నేరుగా మీడియా ముందుకొచ్చి మనసులోని మాట బయటపెట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఇంతకూ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఏమన్నారు?
వైసీపీలో అప్పుడే గుసగుసలు మొదలు
2029 ఎన్నికల నాటికి వైసీపీ అధినేత జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు మాజీ ఎంసీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి. నెల్లూరులో సోమవారం మీడియా ముందుకొచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మేధావులను-నిజాయితీపరులను జగన్ తన దగ్గర పెట్టుకోవాలన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.
క్షేమం కోరే వారి మాటలు జగన్ వినాలని, అప్పుడే అధికారంలోకి వస్తామన్నారు. జగన్ మెప్పు కోసం ఊరికే భజన చేస్తే సరిపోదన్నారు. జగన్ మొప్పు కోసం ఏది పడితే అది మాట్లాడి, ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దన్నారు. నిజాలు మాట్లాడాలని, నిజాయితీగా నడుచుకోవాలన్నారు. పరుల సొమ్మును అస్సలు ఆశించరాదన్నారు.
ALSO READ: కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన.. రైతులతో మాటా మంతీ
పుట్టుకతో కొన్ని గుణాలు వస్తాయని, వాటిని మార్చుకోవడం కష్టమన్నారు మేకపాటి. సంకల్ప బలం ఉండాలని, తాను పొరపాటు చేస్తున్నానని, ఇలాంటివి చేయకూడదని ఆలోచన బలంగా ఉండాలన్నారు. అలాగైతే ముందుకు సాగవచ్చన్నవారు. అలా నడుచుకుంటే రాష్ట్రం, పార్టీ బాగుంటుందని, ప్రజలు అప్పుడు మనల్ని ఆదరిస్తారన్నారు.
ప్రజలు అంత అమాయకంగా లేరని, పద్దతి ప్రకారం నడుచుకోవాల్సి అవసరం ఉందన్నారు. అది ఏ పార్టీకైనా వర్తిస్తుందన్నారు. అనవసర మాటలు, బూతులు, అబద్దాలు వద్దని చెప్పకనే చెప్పారు. మేకపాటి మాటలను వైసీపీలో సమర్థించేవారు ఉన్నారు. వాటిని తోసి పుచ్చినవాళ్లు లేకపోలేదు. పాతతరం నాయకుడని, ప్రస్తుత రాజకీయాలకు ఆయన మాటలు సెట్ కావని అంటున్నారు.