Aadi Sai Kumar: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ హీరో సాయికుమార్ వారసుడిగా ఆది సాయికుమార్ (Aadi Sai Kumar)హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈయన కెరియర్ పరంగా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి. ఇలా వరుస ఫ్లాప్ సినిమాలు తనని వెంటాడుతున్న నేపథ్యంలో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆది సాయికుమార్ త్వరలోనే “శంభాల” (Shambhala) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 25వ తేదీ విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది అయితే ఈ ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ కు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ తన సినీ కెరియర్ గురించి సంచలన విషయాలను వెల్లడించారు. తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న సమయంలో ఎంతోమంది అభిమానులు కం బ్యాక్ ఇవ్వాలి అన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే సరైన హిట్ కోసం తాను, తన ఫ్యామిలీ కూడా చాలా వెయిట్ చేస్తోందని ఆది తెలిపారు.
ఇక ఆఖరి ప్రయత్నంగా శంభాల సినిమా చేశానని ఆది సాయికుమార్ వెల్లడించారు. ఈ సినిమాకు ముందు ఇదే లాస్ట్ డాన్స్ అని ఫిక్స్ అయిపోయానని తెలిపారు. చివరిగా ఒక ప్రయత్నం చేసి చూద్దాం అన్న ఉద్దేశంతోనే శంభాల సినిమా చేశానని తెలిపారు. అయితే నా లాస్ట్ డాన్స్ కు మంచి ఆదరణ లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.. ఇక లాస్ట్ డాన్స్ అని ఎందుకు మాట్లాడుతున్నారో కూడా వెల్లడించారు తనకు డాన్స్ అంటే చాలా ఇష్టం డాన్స్ ద్వారానే తాను సక్సెస్ అయ్యానని అందుకే సినిమాని డాన్స్ గా భావించి మాట్లాడుతున్నట్టు తెలిపారు.
బజ్ లేకపోతే ప్రేక్షకులు రారు..
ఇక ఈ సినిమా ట్రైలర్ కు మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా ఆది సాయికుమార్ సక్సెస్ అందుకుంటారని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా కనుక సక్సెస్ అవ్వకపోతే ఈయన పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. ఇక శంభాల సినిమాని ప్రభాస్ అభిమానులందరూ కూడా ఓన్ చేసుకున్నారని తెలిపారు. ఈ సినిమాకు ప్రభాస్ ట్రైలర్ విడుదల చేయడంతో మంచి బజ్ ఏర్పడిందని ఇలాంటి బజ్ క్రియేట్ అవ్వకపోతే మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు ప్రేక్షకులు రావడం లేదని అందుకే ప్రభాస్ అన్న చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ విడుదల చేయించాము అంటూ ఆది సాయికుమార్ తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఆది ప్రభాస్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేశారు.
Also Read: The Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ వాయిదా… ఫైనల్లీ నిర్మాతలు స్పందించారు.. ఏం అన్నారంటే ?