E-Paper
Advertisement

Kalki -Shambhala: ప్రభాస్ కల్కి సినిమాకు.. ఆది శంభాలకు లింక్

Kalki -Shambhala: ప్రభాస్ కల్కి సినిమాకు.. ఆది శంభాలకు లింక్

Kalki -Shambhala: టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్(Aadi Sai Kumar) చాలా గ్యాప్ తరువాత హీరోగా శంభాల(Shambhala) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆదికి జోడిగా అర్చన అయ్యర్, శ్వాసిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆది శాస్త్రవేత్తగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాకు యుగంధర్ ముని(Ugandhar Muni) దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రభాస్ కల్కి..

ఇక ఈ సినిమా టైటిల్ శంబాల పేరు వినగానే అందరికీ టక్కున ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన కల్కి(Kalki) సినిమా గుర్తుకు వస్తుంది. కల్కి సినిమాలో శంభాల అనే ప్రపంచాన్ని ఎంతో అద్భుతంగా చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఆది సాయికుమార్ సినిమా టైటిల్ కూడా అదే కావడంతో ఈ రెండు సినిమాలకు మధ్య లింక్ ఏదైనా ఉందా? అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలిగింది. అయితే తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ యుగంధర్ ముని క్లారిటీ ఇచ్చారు.  ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ కు కల్కి శంభాల మధ్య లింక్ గురించి ప్రశ్న ఎదురయింది.

కల్కి సినిమాకు శంభాలకు సంబంధం..

ఈ ప్రశ్నకు డైరెక్టర్ యుగంధర్ మాట్లాడుతూ.. కల్కి సినిమా విడుదలైన తర్వాత ఇందులో శంభాల గురించి చెప్పడంతో ఒక్కసారిగా మేము షాక్ అయ్యాము అప్పటివరకు శంభాల అంటే ఎవరికి తెలియదని, ప్రభాస్ సినిమా కారణంగా మా సినిమాకు కూడా మంచి బజ్ ఏర్పడిందని తెలిపారు. అయితే మా సినిమాకు శంభాల అని టైటిల్ పెట్టినప్పటికీ ప్రభాస్ కల్కి సినిమాకు మా సినిమాకు ఏ మాత్రం సంబంధం ఉండదని, ఈ రెండు సినిమాలు రెండు వేరు ప్రపంచాలుగా ఉంటాయని దర్శకుడు వెల్లడించారు.

సినిమా కుటుంబం మొత్తం అండగా..

ఇలా ఈ సినిమాకు కల్కి సినిమాకు ఏ మాత్రం సంబంధం ఉండదని చెప్పడంతో ఈ సినిమా విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం కూడా సంతోషం వ్యక్తం చేశారు మా సినిమాకు ఆ శివయ్య ఆశీస్సులు ఏమో కానీ సినిమా కుటుంబం మొత్తం మద్దతుగా నిలిచారని డైరెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాకు ప్రభాస్ తన వంతు సహాయంగా ట్రైలర్ విడుదల చేయడంతో సినిమా పట్ల మంచి బజ్ ఏర్పడిందని తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కనుక ఆది సాయికుమార్ ఈసారి హిట్ కొట్టబోతున్నారని స్పష్టం అవుతుంది. మరి డిసెంబర్ 25వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ఆది సాయికుమార్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో వేచి చూడాలి.

Also Read: Aadi Sai Kumar: శంబాల ఆఖరి ప్రయత్నం.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న హీరో!

Related News

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

Big Stories

×