E-Paper
Advertisement

Amaravati: అమరావతి గెజిట్ వచ్చేసిందోచ్.. వ్యాపారవేత్తలకు భరోసా, ఇకపై మరిన్ని పెట్టుబడులు

Amaravati: అమరావతి గెజిట్ వచ్చేసిందోచ్.. వ్యాపారవేత్తలకు భరోసా, ఇకపై మరిన్ని పెట్టుబడులు
Advertisement

Amaravati: ఎట్టకేలకు సీఎం చంద్రబాబు కళ సాకారం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గుర్తిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పెట్టుబడుదారులకు కొండంత భరోసా వచ్చింది. అంతేకాదు రాజధాని ప్రాంత రైతులకు ఇప్పటివరకు ఉన్న రకరకాల అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయి.

అమరావతి గెజిట్ వచ్చేసిందోచ్.. వ్యాపారవేత్తలకు భరోసా

Advertisement

ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని కళ్లారా చూసిన వ్యాపారవేత్తలు, ఏపీ అంటే భయపడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం చేస్తే పెట్టుబడుదారుల్లో భరోసా వస్తుందని భావించి చకచకా పావులు కదిపారు సీఎం చంద్రబాబు.

కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాజధాని అమరావతికి చట్టబద్దత తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వచ్చిన దాదాపు ఏడాది నుంచి అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 25 వేలకు పైగా కార్మికులు పగలు రాత్రులు శ్రమిస్తున్నారు. కేవలం భవనాలు మాత్రమే కాదు.. ఓ వైపు ప్రధాన రహదారులు, ఇంకోవైపు జలాశయాల పనులు వేగవంతం అయ్యాయి.

Advertisement

అమరావతి రైతుల్లో ఆనందాలు.. ఫలించిన సీఎం చంద్రబాబు వ్యూహం

ప్రస్తుతం అమరావతిలో న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల టవర్లు నిర్మాణం జోరందుకుంది. గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగుల అపార్ట్‌మెంట్‌ టవర్ల పనులు కూడా మొదలయ్యాయి. శాసనసభ, హైకోర్టు, సెక్రటేరియేట్, హెచ్‌ఓడీ ఆఫీసుల టవర్స్ రెండేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది ప్రభుత్వం.

ప్రస్తుతం ఏడంతస్తుల సీఆర్‌డీఏ భవనం, దాని పక్కన మరో నాలుగు భవనాలను ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ విధానంలోనిర్మాణం చేస్తున్నారు. ఇదిలావుండగా 50 ఎకరాల్లో అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ భవనం పనులు జరుగుతున్నాయి. వచ్చే డిసెంబర్‌ నాటికి క్వాంటమ్‌ కంప్యూటర్‌ పనులు మొదలుపెట్టాలన్నది సీఎం చంద్రబాబు ప్లాన్.

మూడురోజుల కిందట సీఎం చంద్రబాబు రాజధానిలో నిర్మాణ పనులు చేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని తేల్చిచెప్పారు. పనుల వేగాన్ని పెంచడమేకాదు అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. రాజధాని నిర్మాణాన్ని చారిత్రక బాధ్యతగా భావించాలని, పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు.

ALSO READ: ఏపీ రాజధానిగా అమరావతి.. రాష్ట్రపతి ఆమోద ముద్ర

అమరావతిలో అధికారుల భవనాలు మాత్రమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమతమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. 15 బ్యాంకుల ఆఫీసుల భవనాలతోపాటు ఎస్‌ఆర్‌ఎం, విట్‌ యూనివర్సిటీలు విస్తరించే పనిలో పడ్డాయి. బిట్స్‌ క్యాంపస్, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, నేషనల్‌ లా యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు నిర్మాణాలు ప్రారంభించాయి.

ఇటీవల అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును ఆరు వరుసల యాక్సెస్‌ రహదారికి కేంద్రం అంగీకరించింది. దీనికి సంబంధించి డీపీఆర్ మొదలు కాగా, భూసేకరణ పనులు జరుగుతున్నాయి. తెలంగాణలోని ఎర్రుపాలెం-అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ ల మేరా రైల్వేలైన్‌ నిర్మాణానికి టెండర్లకు సిద్ధమైంది. మలిదశలో మరింత విస్తరణ కార్యక్రమాలు అమరావతిలో ఊపందుకున్నాయి. ఇందులోభాగంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌ సిటీ ప్రాజెక్టులకు భూసేకరణ మొదలైంది. రాజధాని గ్రామాల్లోని రైతుల నుంచి భూములను సీఆర్‌డీఏ సమీకరిస్తోంది. జరుగుతున్న పనులతో పెట్టుబడుదారుల్లో భరోసా వచ్చినట్లయ్యింది.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×