BigTV English

Chandrababu in East Godavari: వాళ్ల డీఎన్ఏలో ఉంది.. సీఎం రిజైన్ చేయాల్సిందే?

Chandrababu in East Godavari: వాళ్ల డీఎన్ఏలో ఉంది..  సీఎం రిజైన్ చేయాల్సిందే?

Chandrababu angry on cm jagan attitude at Eastgodavari


Chandrababu in East Godavari (Political news in AP): సీఎం జగన్ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికైనా జగన్ శవరాజకీయాలు మానుకోవాలన్నారు. వాళ్ల డీఎన్ఏలో అది ఉందన్నారు. తండ్రి చనిపోతే రాజకీయ లబ్ది కోసం జగన్ ప్రయత్నించాడని ఆరోపించారు. బాబాయ్‌ని చంపేసిన మళ్లీ దండేసి సానుభూతి పొందారని దుయ్యబట్టారు.

తూర్పుగోదావరి నల్లజర్లలో మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. ఓడిపోతామని తెలిసి 13 వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు విడుదల చేశారని మండిపడ్డారు. పింఛన్లు ఇవ్వాలంటే ముందుగా మనీ డ్రా చేసి పెట్టుకోవాలని, డోర్ డెలివరీ ఇవ్వొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదన్నారు. వైసీపీ కుట్రలో అధికారులు భాగస్వామ్యులు కావడం దారుణమన్నారు. పింఛన్ల మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనన్నారు.


ALSO READ:  జగన్‌పై ఆగ్రహం.. అందుకే సీఎం కుర్చీ..!

వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదన్నారు చంద్రబాబు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను బెదిరించడం దారుణమన్నారు. వాలంటీర్లను ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలని వైసీపీ ప్లాన్ చేసిందన్న చంద్రబాబు.. ఆ వ్యవస్థను తాము కంటిన్యూ చేస్తామన్నారు. జగన్ గెలుపు కోసం వాలంటీర్లను బలిపశువు చేశారని దుయ్యబట్టారు. చివరకు వాలంటీర్లను రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొద్దిరోజులు ఆగితే.. ప్రతీ ఇంటికీ తాను పెద్ద కొడుకుగా ఉంటానన్నారు.

Related News

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Big Stories

×