E-Paper
Advertisement

Madhuri On Pawan Kalyan: పవన్‌ను టార్గెట్ చేసిన దువ్వాడ జంట.. ఎందుకు?

Madhuri On Pawan Kalyan: పవన్‌ను టార్గెట్ చేసిన దువ్వాడ జంట.. ఎందుకు?
Advertisement

Madhuri On Pawan Kalyan: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వెనుక అసలేం జరుగుతోంది? అసలెందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారా? వైసీపీ హైకమాండ్ నుంచి ఆయనకు సంకేతాలు వచ్చాయా? శ్రీనివాస్-మాధురి జంట కౌంటర్ ఎవరికి ఇచ్చినట్టు? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి.

ఏపీలో రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం హాట్ హాట్‌గా సాగుతోంది. తక్కువ సమయంలో రాజకీయాల్లో బాగా ఫేమస్ నాయకుడిగా ఈయనకు ప్రత్యేక గురింపు ఉంది. ప్రతి సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు మీడియా ముందు కంట తడి పెడతారాయన. అలాంటి సందర్భాలూ లేకపోలేదు.

Advertisement

దువ్వాడ శ్రీనివాస్-మాధురి ప్రేమాయణంపై కొందరు నిర్మాతలు దృష్టి సారించారట. ‘దువ్వాడ జీవిత గాథ’ పేరుతో మూవీ తెరకెక్కించేందుకు ఓ తమిళ నిర్మాత ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ జంట తిరుమల వచ్చిందని సమాచారం.

లేటెస్ట్‌గా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్-మాధురి జంట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసింది. మా జంట గురించి మాట్లాడేవారు ముందు మీ గురించి తెలుసుకోవాలని సూటిగా హెచ్చరించింది. రాజకీయాలు వేరు.. తమ పర్సనల్ విషయాలు వేరని, ఈ రెండింటిని ముడిపెట్టడం సరికాదని అంటోంది.

Advertisement

ALSO READ: మేము ఆ తప్పు చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన దువ్వాడ, దివ్వెల మాధురి

వ్యక్తిగత విషయాలను పార్టీకి లింకు చేయడం కరెక్ట్ కాదన్నది ఆ జంట మాట. దువ్వాడ శ్రీనివాస్‌పై పార్టీ హైకమాండ్ కొరడా ఝులిపించలేదంటూ జనసేన కేడర్, పవన్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాపై ఆ జంట కాసింత ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ మాటేంటని ప్రశ్నించింది. తాము చేసింది తప్పయితే.. పవన్ కల్యాణ్ చేసిందీ తప్పేనని వ్యాఖ్యానించింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్.. డిప్యూటీ సీఎం కాలేదా అంటూ ఎదురుదాడి మొదలుపెట్టింది.

తాను నోరు విప్పితే అందరి జాతకాలు బయటపడతాయన్నారు శ్రీనివాస్. పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం మంచిది కాదంటూ చివరలో సముదాయించే ప్రయత్నం చేసుకున్నారాయన. దువ్వాడ కామెంట్స్‌పై డిప్యూటీ సీఎం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×